కాళ్లు లేకపోయినా నడుస్తది.. ఏనుగులు లాగినా కదలదు! ఈ రాళ్ల వింతలేంది?

sailing stones vs krishnas butterball mystery

కాళ్లు లేకపోయినా నడుస్తది.. ఏనుగులు లాగినా కదలదు! ఈ రాళ్ల వింతలేంది?

రాళ్లు అంటే ఎలా ఉంటాయి చెప్పండి. కదలకుండా ఒక చోట స్థిరంగా ఉంటాయి. ఎంత గాలి వీచిన అవి స్థిరంగానే ఉంటాయి. కానీ ఒక చోట మాత్రం రాళ్లు నడుస్తూ ఉంటాయి. రాళ్లు నడవడం ఏంటి అని మీకు సందేహం రావచ్చు. అవును అమెరికాలో ఒక ప్రదేశంలో ఇలా జరుగుతూ ఉంది. అక్కడ రాళ్లు ఎవరి సహాయం లేకుండానే అవంతట అవి నడుచుకుంటూ వెళ్లిపోతాయి. ఇది వినడానికి చాలా గమ్మత్తుగా ఉంది కదా. కొన్ని వందల కిలోల బరువు ఉన్న రాళ్లు కూడా ఒక చోట నుండి ఇంకో చోటికి జరిగిపోతాయి అంట. ఇలా కావడానికి ఎవరైనా మ్యాజిక్ చేశారా లేక ఏమైనా ఏలియన్స్ చేసిందా ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం.

ఎవరూ నెట్టకుండానే.. రాళ్లు పరుగు తీస్తున్నాయి

అమెరికాలోని కాలిఫోర్నియాలో “డెత్ వ్యాలీ” (Death Valley) అనే ఎడారి ఉంది. అక్కడ “రేస్ ట్రాక్ ప్లేయా” అనే ఎండిపోయిన సరస్సు ఉంది. అక్కడ నేలంతా పగిలిపోయి నట్టుగా ఉంటుంది. అక్కడ నేల పైన చాలా పెద్ద పెద్ద రాళ్లు ఉంటాయి. ఆ రాళ్లు నడుచుకుంటూ వచ్చి నట్టుగా పెద్ద పెద్ద గీతలు ఉంటాయి. అంటే అచ్చం మన కారు పోతే దాని టైర్ అచ్చులు ఎలా ఉంటాయి. అలానే రాళ్ల అచ్చులు కూడా ఉంటాయి. కొన్ని రాళ్లు అయితే ఏకంగా 1500 అడుగుల దూరం వరకు కూడా జరుగుతాయి అంట.

ఈ రాళ్ళను చూసి జనాలు భయపడుతున్నారు. సైంటిస్టులు జుట్టు పీక్కుంటున్నారు. చాలా ఏళ్ల వరకు కూడా ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కొందరేమో అక్కడ దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు వచ్చి రాళ్లను జరుపుతున్నాయని అంటారు. మరి కొందరు ఏలియన్స్ వచ్చి అక్కడ రాళ్లతో ఆడుకుంటున్నారు అని అంటారు. మీకు ఇంకొక ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. సైంటిస్టులు కెమెరాలు పెట్టినా కూడా అవి కదులుతున్నట్టు ఎక్కడ కెమెరాలో రికార్డు కాలేదు. ఎందువలన అంటే అవి ఎప్పుడు కదులుతాయో ఎవరికీ తెలియదు.

2014 లో రిచర్డ్ మారిస్ అనే సైంటిస్టు దీని అసలు గుట్టు చెప్పారు. ఇది మ్యాజిక్ ఏమీ కాదు. ప్యూర్ సైన్స్ అని చెప్పారు. ఆ ప్రదేశంలో ఎప్పుడైనా వర్షం పడితే ఆ తర్వాత ఎండిపోయిన నేల మీద కొంచెం నీళ్లు ఆగుతాయి. రాత్రివేళ అక్కడ చలి వల్ల నీళ్లు గడ్డ కట్టి ఒక సన్నని మంచు పొర వలె మారుతాయి. అప్పుడు ఆ నేల మొత్తం జారే గుణం ఉంటుంది. అదే సమయంలో చాలా గట్టిగా గాలి వీస్తే ఆ జారే నేల మీద రాళ్లు మెల్ల మెల్లగా జారుకుంటూ ముందుకు పోతున్నాయి. ఉదయం ఎండ రాగానే మంచు కరిగిపోయి నీళ్లు ఆవిరైపోతాయి. కానీ రాళ్లు జరిగిన గుర్తులు మాత్రం అట్లానే ఉంటాయి. అందువల్ల ఆ రాళ్లు కదిలినట్టు కనిపిస్తాయి. అంటే ఇది గాలి, నీళ్లు, మంచు కలిసి ఆడే ఆట. ప్రకృతిలో జరిగే ప్రతి వింత వెనకాల ఒక సైన్స్ ఉంటుంది.

గాలిలో తేలుతున్నా.. కింద పడదేం?

ప్రపంచంలో చాలా వింతలు ఉంటాయి. కొన్ని చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మన భారతదేశంలో అందులోనూ మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక వింత ఉంది. ఆ వింత చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ వింత పేరు కృష్ణస్ బటర్ బాల్ (Krishna’s Butterball). ఇది ఒక పెద్ద బండరాయి. కానీ దీని వెనుక కథ మాత్రం వేరే ఉంది. అది నిలబడ్డ తీరు చూస్తే పెద్ద పెద్ద సైంటిస్టులకే అంతు చిక్కదు. ఈ రాయి ఏనుగు లాగినా కదలదు. అంతా గొప్పతనం ఏంది అనుకుంటున్నారా. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఈ వింత తమిళనాడులోని మహాబలిపురంలో ఉంది. ఈ రాయి మనిషి చెక్కింది కాదు. ఎవరో అక్కడ తెచ్చి పెట్టింది అంతకంటే కాదు. ఈ రాయి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక పెద్ద గ్రైనేటు శిలా. దీని ఎత్తు దాదాపుగా 20 అడుగులకు పైగా ఉంటుంది. వెడల్పు 16 అడుగులు ఉంటుంది. దీని బరువు 250 టన్నుల వరకు ఉంటుంది. అంటే దాదాపుగా 60 ఏనుగుల బరువుతో సమానం.

మామూలుగా ఇంత బరువు గల రాయి నేల మీద ఉంటే అదేం పెద్ద వింత కాదు. రాయి ఏటవాలుగా ఉన్న ఒక చిన్న కొండ మీద ఉంటుంది. అక్కడ నేల దాదాపుగా 45 డిగ్రీల వాలుగా ఉంటుంది. సాధారణంగా మనం ఒక చిన్న రాయిని అక్కడ పెడితే కిందకి పడిపోతుంది. కానీ ఈ రాయి మాత్రం అలా కాదు 250 టన్నుల బరువు గల రాయి గుండ్రంగా ఉంటుంది. జారిపోకుండా ఎటు దొర్లిపోకుండా గత 1200 సంవత్సరాల నుండి అక్కడే ఉంది.

మనకు ఎవరికైనా ఆ రాయిని చూస్తే వామ్మో గాలి ఎక్కువగా వస్తే మన మీద పడుతుంది అనే భయం వేస్తుంది. కానీ ఈ రాయి ఇంచు మందం కూడా కదలదు. భూమికి మరియు రాయికి మధ్యలో ఉన్న తేడా కేవలం నాలుగు అడుగుల స్థలం మాత్రమే అనుకుని ఉంటుంది. అంత చిన్న దాని మీద అంత పెద్ద రాయి బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవడం అంటే ఇది ఆశ్చర్య పోవాల్సిన విషయమే.

ఈ రాయిని తమిళనాడులోని స్థానికులు వాన్ ఇరై కల్ అని పిలిచేవారట. అంటే ,అర్థమేంటంటే ఆకాశ దేవుడి రాయి అని అర్థం. కానీ తర్వాత ఈ రాయికి కృష్ణస్ బటర్ బాల్ అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం చూస్తే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వెన్న తినేవాడు. ఆ కృష్ణుడి చేతిలో నుంచి జారిన ఒక వెన్నె ముద్దే ఇలా రాయి గా మారి ఉంటుందని భక్తుల నమ్మకం. ఇది చూడటానికి కూడా ఒక వెన్న ముద్ద లాగానే గుండ్రంగా చాలా స్మూత్ గా ఉంటుంది.

ఈ రాయి ఇలా ఉండటానికి కారణం ఏంటి అని సైంటిస్టులను అడిగితే దీని వెనకాల దేవుడు మాయనా లేక సైన్స్ అని సైంటిస్టులను అడిగితే వారు కొన్ని కారణాలు చెబుతున్నారు.

ఈ రాయి జారకపోవడానికి కారణం రాయికి మరియు కింద ఉన్న నేలకి మధ్యలో చాలా రేపిడి ఉండటం వలన అది జారటం లేదంట రాయి యొక్క మొత్తం బరువు ఒకే పాయింట్ మీద కేంద్రీకృతం అవడం వలన అది ఎంత ఎత్తులో ఉన్న బ్యాలెన్స్ కోల్పోవడం లేదంట. కొంత మంది జియాలజిస్టులు మాత్రం ఆ రాయి కొండలో ఒక భాగమే అంటున్నారు. కోతకు గురి కావడం వలన చుట్టూ ఉన్న మట్టి పోయి అలా రాయిలా మిగిలిపోయింది అంటున్నారు.

ఈ రాయి ఒక ఫేమస్ టూరిస్టర్ స్పాట్. జనాలు రాయి కింద నిల బడి దాని చేతులతో పైకి లేపుతున్నట్లుగా ఫోటోలు దిగుతుంటారు. ఎండా కాలంలో అయితే ఆ రాయి కింద కూర్చుంటారు. వాళ్లకు ఆ రాయి మీద పడిపోతుందో ఏమో అన్న భయం అసలు ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *