తల మీద 100 కిలోల బరువు | 14 అడుగుల మీసాలు! మన భారతీయుల రికార్డ్స్ చూశారా?

indian records longest mustache biggest turban

తల మీద 100 కిలోల బరువు | 14 అడుగుల మీసాలు! మన భారతీయుల రికార్డ్స్ చూశారా?

మనలో ఎవరైనా తల మీద చిన్న బరువు పెడితే అబ్బా ఎంతసేపు ఉండాలి అంటాం. బరువును మహా అయితే ఒక పది నిమిషాల వరకు మోయగలం. అప్పటికే మనకు ఎంతో మెడ నొప్పిగా, తలనొప్పిగా అనిపిస్తుంది. అప్పుడు దాన్ని దించేస్తాం. మీకు మంచి ఉదాహరణగా చెప్పాలంటే, మనం రోజు హెల్మెట్ పెట్టుకుంటాం కదా, బండిమీద వెళ్లేటప్పుడు అప్పుడు మనకు ఏమనిపిస్తుంది కొంచెం చికాకుగా అనిపించవచ్చు. మరి కొంచెం బరువుగా అనిపించవచ్చు. కానీ తప్పదు. మన రక్షణ కోసం తప్పనిసరిగా పెట్టుకోవాలి.

ప్రపంచంలోనే అతి పెద్ద తలపాగా ఈయనదే – అవతార్ సింగ్ మౌని

తల పైన కిలోల కిలోల బరువులు మోసే వారు ఎవరైనా ఉంటారా. మన దేశంలో ఒక మనిషి ఉన్నాడు ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కిలోల బరువు తలపై మోస్తాడు. అదేదో ఒక గంట, రెండు గంటలు కాదు. రోజు మొత్తం ఆ బరువును మోస్తాడు. ఆయన పేరు అవతార్ సింగ్ మౌని. ఈయన పంజాబ్ కు చెందిన వ్యక్తి ఈయన తన తల పైన 100 కిలోల బరువున్న తలపాగాను మోస్తాడు. ప్రపంచంలోనే అతిపెద్ద తలపాగ కట్టుకునే వ్యక్తిగా రికార్డు పొందాడు. అసలు అలా ఎందుకు మోస్తున్నాడు. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఈ అవతార్ సింగ్ మౌని పంజాబ్ లోని పటియాల లో ఉంటాడు. ఈయన తలపై ఉండే తలపాగా ఒక పెద్ద కొండ లాగా ఉంటుంది. ఆయన యొక్క తలపాగా కట్టుకోవడానికి ఉపయోగించే బట్ట పొడవు ఎంతో తెలుసా. అది 645 మీటర్ల వరకు ఉండవచ్చు. అంటే చెప్పాలంటే, మన ఒలంపిక్స్ స్విమ్మింగ్ పూల్స్ ఒక 13 కలిపితే ఎంత పెద్ద పొడవు అవుతుందో అంతా అన్నమాట. ఆ బరువు బట్ట మాత్రమే కాదు. ఆయన తలపాగా మాత్రమే ధరించడు. అ తలపాగలో ఆయన తన సిక్కుల సంప్రదాయం ప్రకారం కొన్ని ఆభరణాలు, ఆయుధాలు, గొలుసులు వేసుకుంటాడు. ఇవన్నీ కలిపి లెక్క కట్టి చూస్తే దాదాపుగా 85 నుంచి 100 కిలోల బరువు వరకు ఉంటుందట. ఒక మనిషి తలమీద కూర్చున్నంత బరువు ఉంటుంది.
ఆయన తయారు కావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది అంట. సాధారణంగా మనం తల దువ్వుకొని రెడీ అవ్వడానికి మహా అయితే పది నిమిషాలు పడుతుంది. కానీ ఈయన తయారు కావడానికి ఏకంగా 6 గంటల సమయం పడుతుందట. ఈయన పొద్దున్నే లేచి ఆ బట్టను అంతా చక్కగా మడత పెట్టి మెల్లగా తన తలపాగా చుట్టుకుని తయారయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. అయినా సరే ఆయనకు విసుగు రాదట చాలా ఓపిగ్గా చేసుకుంటాడట.

ఈయనకు కారులో వెళ్లడం సాధ్యం కాదు. ఎందుకంటే, ఆ తలపాగా అంత పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈయన ఒక బుల్లెట్ బండి పైన వెళ్తాడు. ఎక్కడికి పోయినా చక్కగా బుల్లెట్ పైన హాయిగా వెళతాడు. ఆయన రోడ్డుపై పోతుంటే జనాలు అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తారట. తమ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటారు. ఇంకొక నవ్వు తెప్పించే విషయం ఏంటంటే, ఈయన కొన్ని ఇళ్లల్లోకి పోలేరట ఎందుకంటే, ఆ తలపాగా అడ్డం వస్తుంది. కాబట్టి ఈయన చాలా పెద్ద పెద్ద గేట్లు ఉన్నా ఇళ్లల్లోకి మాత్రమే పోతాడట.

మీకు అనిపిస్తుందా ఎందుకింత బరువు మోయడం అని, అదే విషయం ఎవరైనా అడిగితే, ఆయన చాలా చిరునవ్వుతో ఇచ్చే సమాధానం ఏమిటో మీకు తెలుసా? ఇది బరువు కాదు నా బాధ్యత. నా తల మీద పెట్టినవి కొన్ని కిలోల బరువు మాత్రమే కాదు. నా గురువుల ఆశీర్వాదాలు మరియు నా మతం పట్ల నాకున్న భక్తి అని సమాధానం చెప్తాడట. మామూలుగా సిక్కుల యొక్క తలపాగా 5 నుండి 7 మీటర్ల వరకు ఉంటుంది. కానీ ఈయన మాత్రం తన యొక్క సాంప్రదాయాన్ని ప్రపంచానికి మొత్తానికి తెలియాలని ఇలా చేస్తాడట.

ఈయన అంత పెద్ద బరువు మోయడం అంటే అభినందించాల్సిన విషయమే. మనం చిన్న పనికి అలసిపోతాం. కానీ ఈయన 60 సంవత్సరాల అంత బరువున్న తలపాగను మోస్తున్నాడు. మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్ప విషయాలలో ఇది ఒకటి.

ప్రపంచాన్ని షేక్ చేసిన రాజస్థాన్ మీసాల వీరుడు – రామ్ సింగ్ చౌహన్

మగవారికి మీసం ఉండడం అందం మరియు విలువ లాంటిది. తమకు నచ్చిన మాదిరి మగవారు తమ మీసాలను పెంచుకుంటారు. కానీ ఒక మొనగాడు మాత్రం ఏకంగా 14 అడుగుల మీసాన్ని పెంచిండు. అతనే రామ్ సింగ్ చౌహన్. ఇంత పెద్ద మీసాన్ని పెంచడం అంటే ఆషామాసి ముచ్చట కాదు. దానికి చాలా ఓపిక మరియు ధైర్యం ఉండాలి. మన తోటోడు మన మీసం గురించి మాట్లాడితే మనకెంతో పౌరుషం వస్తుంది. మరి 14 అడుగుల మీసం పెంచిన ఈయనకు ఇంకెంత పౌరుషం ఉండాలి. అందుకే ఈయన ప్రపంచంలోనే అతి పెద్ద మీసం ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు కొట్టిండు. అసలు ఈ మీసం విషయం ఏంటంటే ఈయన 1970 నుండి తన మీసాన్ని కత్తిరించలేదు. అది పెరిగి పెరిగి ఇప్పటికే 14 అడుగుల కన్నా ఎక్కువ ఉంది.

మరి అంత పెద్ద మీసాన్ని చూసుకోవడం అంటే తమాషా ముచ్చట కాదు. మనం నెత్తిమీద జుట్టుకే గంటలకు కొద్దిగా సమయం పెడతాం. మరి అంత పొడవున్న ఆయన మీసానికి ఎన్ని గంటల సమయం పడుతుందో, ఎంత కష్టపడాలి. ఆయన మీసాన్ని శుభ్రం చేసి నూనె పెట్టి దువ్వటానికి రెండు గంటల సమయం పడుతుంది. అంత పెద్ద మీసం ఉన్నప్పుడు చూసేటోళ్ళకు మంచిగా మెరుస్తూ కనబడాలి కదా, అందుకోసం ఆయన బాదాం నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, వంటివి పెడతాడు. అంతా పెద్ద మీసాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన నడుస్తున్నప్పుడు ఆ మీసం కాళ్ళ కింద పడకుండా మీసాన్ని తన మెడ చుట్టూ చుట్టుకుంటాడు. పొరపాటున కూడా ఆ మీసం కాళ్ళ కింద పడితే ప్రాణం పోయినంత పని అవుతుందట.

ఈ మీసం పుణ్యమా అని ఈయన సినిమా నటుడు కూడా అయ్యాడు. ఈయనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా ఈయన నటించాడు. ఈయన మీసం గురించి ఏమంటాడంటే మీసం మగాడికి ఒక నగ లాంటిది అంటాడంట. అది పెంచడం ఒక పెద్ద తపస్సు అని ఈయన ఉద్దేశం. గిన్నిస్ బుక్ వాళ్ళు ఈయనకు సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు ఆయన మస్తు సంతోష పడిండు. రాజస్థాన్ టూరిజం వాళ్లకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్క మారిపోయిండు. ఇంత పెద్ద మీసాన్ని పెంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు అంటే, ఆయన ఓపికకు దండం పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *