మనిషి 2 అడుగులు | జుట్టు 6 అడుగులు! ప్రపంచాన్ని షేక్ చేసిన ఇద్దరు భారతీయ మహిళలు

nilanshi patel vs jyoti amge indian records

మనిషి 2 అడుగులు | జుట్టు 6 అడుగులు! ప్రపంచాన్ని షేక్ చేసిన ఇద్దరు భారతీయ మహిళలు

ఆడవాళ్లకు జుట్టు అనేది ప్రధాన అందం. ఆడవాళ్లు తమ జట్టు అందంగా మరియు ఆకర్షణయంగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు అందంగా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టు అందంగా కనబడాలని చాలా సమయం అద్దం ముందు కూర్చుని తయారవుతారు. మరి అంత అంత జాగ్రత్తగా చూసుకునే జుట్టు కొంచెం ఊడిపోతేనే చాలా బాధపడతారు.

మనిషి కంటే పొడవైన జుట్టు పెంచిన గుజరాత్ అమ్మాయి

కొంత మంది అమ్మాయిలు జుట్టు ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా ఫీల్ అవుతారు. మొత్తం మీద ఆడవాళ్లు జుట్టు అందంగా మరియు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక అమ్మాయి జుట్టు ప్రధాన ఆకర్షణీయంగా మరియు అందంగా ఉంటుంది. ఆమె జుట్టును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆమె జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. ఎంత అంటే నడుము దాకా కాదు, మోకాలు దాకా కాదు, ఏకంగా నేలపై పాకే అంత పొడవుగా ఉంటుంది.

ఈమె యొక్క జుట్టు మనిషి పొడవు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈమె పేరు నీలాన్షి పటేల్. ఈమె గుజరాత్ కు చెందిన అమ్మాయి. ఈమెను అందరు ముద్దుగా ఇండియన్ రాపుంజెల్” (Rapunzel of India) అంటారు. అసలు ఆమె ఎందుకు అలా జుట్టు అంత పెద్దగా పెంచుకుంది. దాని వెనకాల అసలు కథ ఏమిటి. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఆమెకు అంత పెద్ద జుట్టు పెరగడానికి వెనకాల ఒక బాధాకరమైన కథ ఉంది. అదేంటంటే, వాళ్ళ అమ్మ ఆమెకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కటింగ్ చేయించడానికి బార్బర్ షాప్ కు తీసుకెళ్లిందట. కానీ, బార్బర్ ఆమెకు కటింగ్ సరిగ్గా చేయకపోగా, కటింగ్ మొత్తం పాడు చేశాడంట. అది చూసిన ఆమె ఎంతో బాధపడింది. అద్దంలో తన మొఖం చూసుకొని చాలా ఏడ్చిందట. ఆ కోపంతో ఇక జీవితంలో కటింగ్ చేయించుకోనని శపధం చేసింది. అప్పటి నుంచి 12 సంవత్సరాలు అంటే దాదాపుగా ఆమెకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు కటింగ్ చేపించుకోలేదంట. అందువల్ల, ఆ జుట్టు పెరిగి పెరిగి గిన్నిస్ రికార్డు స్థాయికి చేరింది.

ఈమె యొక్క పట్టుదల చూసి గిన్నిస్ వరల్డ్ ఆశ్చర్యపోయారు. ఈమె యొక్క జుట్టు పొడవు 2020 లో కొలిచి చూస్తే ఆరడుగులకు పైగా ఉంది. సాధారణంగా ఒక మనిషి యొక్క ఎత్తు 5.5 అడుగులు ఉంటుంది. అంటే ఈమె జుట్టు మనిషి పొడవు కన్నా ఎక్కువ అన్నమాట. ప్రపంచంలోనే టీనేజర్స్ అందరిలో అత్యంత పొడవు జుట్టు ఉన్న అమ్మాయిగా ఈమె వరసగా మూడు రికార్డులు సొంతం చేసుకుంది.

ఆడవాళ్లు సాధారణంగా స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకోవడానికి నానా తంటాలు పడతారు. కానీ, మరి ఆరడుగుల జుట్టు అంటే మామూలు విషయమా. ఈమె వారానికి ఒక సారి తలంటు స్నానం చేస్తుందట. ఆమె జుట్టుకు షాంపూ పెట్టుకోవడానికి గంట సమయం పడుతుంది అంట. స్నానం చేసిన తర్వాత ఆ జుట్టు ఆరబెట్టుకోవడానికి మరియు చిక్కులు తీసుకోవడానికి గంటల కొద్ది సమయం పడుతుంది.

ఈ పనిలో వాళ్ళ అమ్మ ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటుందట. అందువల్లే, గిన్నిస్ రికార్డులు కొట్టడం వీలైంది. ఈ విషయం ఆమె చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఈమె తన జుట్టును చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఆ జుట్టు మట్టిలో తగలకుండా ఎల్లప్పుడూ జడ అల్లుకొని లేకపోతే కొప్పు కట్టుకొని ఉండేదట. ఆటలు ఆడేటప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా కొప్పు కట్టుకొని చేసేదట.

ఈమె చాలా అపురూపంగా చూసుకునే జుట్టును ఏం చేసిందో మీకు తెలిస్తే, మీరు బాధపడతారు, ఆశ్చర్యపోతారు. ఈమె 2021 సంవత్సరంలో 18 సంవత్సరాలు నిండగానే, నాకు ఈ జుట్టు వల్ల చాలా పేరు వచ్చింది. ఇక నేను ఈ జుట్టుకి గుడ్ బై చెప్తాను, అని నిర్ణయం తీసుకుంది.

తన యొక్క జుట్టును కత్తిరించి అమెరికాలోని ఫేమస్ మ్యూజియం Ripley’s Believe It or Not దానం చేసింది. జుట్టును కత్తిరించేటప్పుడు ఆమె చాలా అంటే చాలా బాధపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి, ఆమె యొక్క జుట్టు చాలా అందంగా మరియు ఒక వింతగా మ్యూజియంలో వేలాడుతూ ఉంది. ఎంతో మంది ఆ జుట్టును చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈమె చాలా గ్రేట్ కదా. చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన అవమానాన్ని పట్టుదల మార్చుకొని ప్రపంచ రికార్డులను కొట్టింది. ఈమెను చూస్తే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అర్థమవుతుంది.

ప్రపంచంలోనే అతి పొట్టి మహిళ – జ్యోతి ఆమ్గే

మనలో ఎవరైనా హైట్ తక్కువగా ఉంటే చాలా బాధపడతారు. చూసే జనాలు ఏమనుకుంటారు. ఎలా హేళన చేస్తారు అని, నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక మహిళ మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా తన చిన్న హైట్ తో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఆమె పేరు జ్యోతి ఆమ్గే. ఈమె మహారాష్ట్రలోని నాగపూర్ నాగపూర్ కు చెందిన అమ్మాయి.

ఈమె యొక్క ఎత్తు రెండు అడుగులు మాత్రమే. అంటే మీకు చాలా కరెక్ట్ గా చెప్పాలంటే మన ఇంట్లో ఉండే ఒక చిన్న పాప అంటే ఒక రెండు నెలల పాప ఎంత ఉంటుందో అంత ఉంటుంది అన్నమాట. కానీ ఈ యొక్క వయసు 30 సంవత్సరాలకు పైగా ఉంటుంది. ఈమె తన హైట్ తో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు కొట్టింది.

ఈమె అసలు ఎందుకు అంత చిన్నగా ఉంది అనే విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. గిన్నిస్ రికార్డు ఆరు 2011 సంవత్సరంలో ఈమె యొక్క హైట్ కొలిచారు. అప్పుడు ఏం తేలిందంటే, ఈమె కేవలం 62.8 సెంటి మీటర్లు ఉంది. అంటే రెండు అడుగుల ఒక అంగుళం అన్నమాట.

ఈ యొక్క బరువు 5 నుండి 6 కిలోలు మాత్రమే ఉంది. సాధారణంగా మనం వాడే ఒక రెండు అడుగుల స్కేల్ కంటే ఈమె కొంచెం పెద్దగా ఉంటుంది. ఈమె యొక్క బట్టలు మరియు చెప్పులు ఉంగరాలు అన్ని చాలా స్పెషల్గా చిన్న పిల్లల మాదిరి తయారు చేయించుకుంటుంది.

ఈమెకు ఎందుకు ఇలా జరిగిందంటే, ఇది ఒక మెడికల్ కండిషన్ అట. దీని యొక్క పేరు అకాండ్రోప్లేసియా” (Achondroplasia). మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇది ఒక రకమైన మరుగుజ్జు మరుగుజ్జుతనం. వాళ్ల అమ్మ కడుపులో ఈమె ఉన్నప్పుడు ఎముకల యొక్క పెరుగుదల ఆగిపోయిందట. అందువల్ల, ఈమె పుట్టింది కానీ పెరుగుదల ఆగిపోయిందట. ఆ విషయం ఐదు సంవత్సరాలు వచ్చే అరకు కూడా ఇంట్లో వాళ్లకు తెలియదు. కానీ గొప్ప విషయం ఏంటంటే హైట్ పెరగకపోయినా ఈమెకు ఎంతో మనోధైర్యం ఉంది.

ఈమె హైట్ తక్కువ అని నా వల్ల ఏమి అవుతుందని ఎప్పుడూ ఇంట్లో ఖాళీగా కూర్చోలేదట. ఈమె చదువుకుంది డిగ్రీ సంపాదించింది. అంతే కాకుండా ఏకంగా హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసింది. అమెరికాలోని ఫేమస్ టీవీ షో అయిన అమెరికన్ హర్రర్ స్టోరీ లో ఈమె నటించింది. ఈమె సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోలో గెస్ట్ గా వెళ్లి సందడి చేసింది. ఇప్పుడు ఈమె ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయింది. ఈమెతో ఫారిన్ వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు.

ఈమె యొక్క నిజజీవితం ఎలా ఉంటుందంటే, ఈమె కు ఇంట్లో వస్తువులు అందడం చాలా కష్టం. అందుకని ఈమె తన కావాల్సిన వస్తువులన్నీ కిందనే పెట్టుకుంటుంది. మొబైలు, తన వస్తువులు అన్ని కూడా చిన్నవిగా ఉంటాయి. ఈమె ఎక్కడికి పోవాలన్నా వాళ్ళ నాన్న లేక అన్నయ్య ఈమెను ఎత్తుకొని తీసుకుపోతారు.

ఈమె ఇంత హైట్ తక్కువగా ఉన్న ఎప్పుడు బాధపడలేదట. ఈ యొక్క రూపం వల్లనే నేను ప్రపంచం మొత్తం తిరుగుతున్న అని అంటుందట. నేను సెలబ్రిటీ అయ్యాను అని గర్వంగా చెప్పుకుంటుందట.

ఈమె చిన్నదైనా ఈమె యొక్క ఆశయం చాలా గొప్పది. లోపం అనేది మన శరీరానికి మాత్రమే ఉంటుంది. కానీ మన టాలెంట్ కి కాదు. అని ఈమె నిరూపించింది.

చివరగా నా సలహా: హైట్ తక్కువగా ఉన్న వాళ్లు, మీరు హైటు తక్కువగా ఉన్నారని బాధపడొద్దు. మిమ్మల్ని ఎవరైనా హైట్ తక్కువగా ఉన్నావని హేళన చేస్తే వారికి ఈ ఆర్టికల్ షేర్ చేయండి. ఇది చూశాక వాళ్ళు ఎప్పుడు ఎవరిని హేళన చేయరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *