ప్రకృతి అనేది ఒక అద్భుతమైన కళాకారుడు లెక్క. మనం మామూలుగా ప్రకృతిలో అనేక రకాల రంగు రంగుల పక్షులను మరియు ఇంత జంతువులను చూస్తుంటాం.
అవి ఆ రంగుల ద్వారానే తమ ఉనికిని చాటుకుంటాయి. శత్రువుల యొక్క కంట పడకుండా దాక్కుంటాయి. కానీ ఆ రంగులే లేకపోతే ఎలా ఉంటుంది?
ఒక జీవి పూర్తిగా అద్దంలో ఇంకోవైపు ఏముందో కనిపించేలా పారదర్శకంగా ఉంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఈ విషయం వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ గ్రాఫిక్స్ మాయలా అనిపించినా, ఇది పూర్తిగా నిజం.
మన భూమి మీద కొన్ని జీవులు ఉన్నాయి. ఆ జీవులు తమ శరీరాన్ని లేదా రెక్కలను గాజు లెక్క మార్చుకొని జీవనం సాగిస్తాయి. అలాంటి రెండు వింత జీవుల గురించి ఇప్పుడు మీకు చెప్తాను.
Glasswing Butterfly అద్దం లాంటి రెక్కలు దీని ప్రత్యేకత

సీతాకోకచిలుక అంటే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి చెప్పండి. దాని రెక్కల మీద ఉండే రంగు రంగుల డిజైన్లు కదా. కానీ ఇప్పుడు మీకు నేను చెప్పబోయే సీతాకోకచిలుక పూర్తి భిన్నంగా ఉంటుంది.
దీన్ని మామూలుగా గ్లాస్‌వింగ్ బటర్‌ఫ్లై (The Glasswing Butterfly) అని పిలుస్తారు. ఈ సీతాకోకచిలుక యొక్క శాస్త్రీయ నామం గ్రెటా ఓటో Greta oto.
ఈ సీతాకోకచిలుక యొక్క రెక్కలు మన ఇంటి కిటికీ అద్దంలా పారదర్శకంగా ఉంటాయి. ఈ సీతాకోకచిలుక యొక్క రెక్కలు అసలు ఎందుకు అలా ఉంటాయి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణ సీతాకోక చిలుక రెక్కలు కైటిన్ అనే ప్రోటీన్ పొరతో తయారై ఉంటాయి. వాటి మీద వేల సంఖ్యలో అతి చిన్న పొలుసులు కూడా ఉంటాయి.
ఈ పొలుసుల మీద అది పరివర్తనం చెంది, మన కళ్ళకు మాత్రం రంగు రంగుల లాగా కనిపిస్తుంది. ఉదాహరణకు నెమలి ఈకలు మరియు ఇతర సీతాకోకచిలుకల రంగులు ఈ విధంగానే ఏర్పడతాయి.
కానీ గ్లాస్‌వింగ్ బటర్‌ఫ్లై రెక్కల పైన ఈ రంగుని ఇచ్చే పొలుసులు ఉండవు. దీని రెక్కల మధ్యలో ఉండే కణజాలం ఎటువంటి రంగులు ప్రతిబింబించదు.
దీనివల్ల కాంతి దాని రెక్కల గుండా నేరుగా ప్రయాణం చేస్తుంది. అందువలన మనం దాన్ని వెనకాల ఉన్న ఆకులు, పువ్వులను స్పష్టంగా చూడగలం.
నానో పిల్లర్స్ అనే అద్భుతమైన టెక్నాలజీ
శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా దాని పైన ఉండే రెక్కలను పరిశీలించినప్పుడు, ఒక అద్భుతమైన విషయం తెలిసిపోయింది. దాని రెక్కల ఉపరితలం నున్నగా ఉన్న గాజు వలె ఉండదు.
దానిపై చాలా చిన్నదైనా, మన కంటికి అగుపడని నానో పిల్లర్స్ అనే చిన్న స్తంభాలు ఉంటాయట. ఈ నానో పిల్లర్స్ యాదృచ్ఛికంగా వేరు వేరు ఎత్తులో అమర్చబడి ఉంటాయట.
కాంతి కిరణాలు దాని రెక్కల మీద పడినప్పుడు, ఈ గ్లాస్‌వింగ్ బటర్‌ఫ్లై ఆ కాంతిని వెనక్కి ప్రతిబింబించకుండా రెక్కల లోపలికి వెళ్లే విధంగా చేస్తాయట.
దానివల్ల సైన్స్ పరిభాషలో యాంటీ-రిఫ్లెక్టివ్ గుణం అంటారు. దీనివల్ల రెక్కలు మెరవకుండా పూర్తిగా పారదర్శకంగా మారిపోతాయట.
ఈ టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మనుషులు ఇప్పుడు కెమెరా లెన్స్‌లు, సోలార్ ప్యానెల్స్ తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
శత్రువుల కంట పడకుండా ప్రకృతి ఇచ్చిన వరం
ఈ సీతాకోకచిలుక ఎందుకలా మారుస్తుందంటే, ప్రకృతిలో ప్రతి మార్పు వెనకాల ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ పారదర్శకత దీనికి గొప్ప రక్షణ కవచం అయింది.
మామూలు శీతకోకచిలుకలు వాటి రంగుల వల్ల పక్షులకు లేక ఇతర శత్రువులకు త్వరగా కనిపిస్తాయి. కానీ ఈ గ్లాస్‌వింగ్ బటర్‌ఫ్లై ని చూడటం చాలా కష్టమైన పని.
ఇది ఆకుపైన వాలితే ఆకుపచ్చగా, పువ్వు పైన వాలితే ఆ పువ్వు రంగులోకి కలిసిపోయి ఉంటుంది. శత్రువులు ఈ సీతాకోకచిలుకను కనిపెట్టే లోపే ఇది తప్పించుకొని పారిపోతుంది.
ఈ సీతాకోకచిలుకలు ఎక్కడ ఉంటాయంటే, ఇవి మధ్య మరియు దక్షిణ అమెరికా అడవుల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా మెక్సికో, కొలంబియా పనామా మరియు ఈక్వెడార్ దేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
ఇవి చూడ్డానికి చాలా సున్నితంగా ఉంటాయి. కానీ దృఢంగా గట్టిగా ఉంటాయి. ఇవి తమ బరువు కంటే 40 రెట్లు బరువును మోయగలుగుతాయి. అట్లనే రోజుకు 12 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయని పరిశోధనలో తేలిపోయింది.
ఇది కూడా చదవండి: [మనిషి లెక్క అరిచే పక్షి, ఆవు లెక్క నమిలే పక్షి]
Jewel Caterpillar ఇది పురుగా లేక కదిలే వజ్రమా

ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి. మనం కొన్నిటిని చూడగానే ఇలాంటివి కూడా ఉంటాయా అని మనం నోరు వెళ్ళబెడతాం. ఇప్పుడు నేను చెప్పబోయే పురుగు కూడా చాలా వింతగా ఉంటుంది.
ఈ పురుగును చూస్తే అచ్చం నడిచే రత్నం లాగానే ఉంటుంది. దీని పేరు జ్యువెల్ క్యాటర్‌పిల్లర్ (Jewel Caterpillar) అంటారు. దీన్ని అసలు పేరు Acraga coa. దీని అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనం మామూలుగానే గొంగళి పురుగును చూస్తేనే ఛి అని అంటాం. దాన్ని చూడగానే కంపరం వేస్తుంది. కానీ జ్యువెల్ క్యాటర్‌పిల్లర్ ని చూస్తే మాత్రం అరే భలే అందంగా ఉందిలే అని మనకు అనిపిస్తుంది.
దీని ఒళ్లంతా గాజు ముక్కలు అతికించినట్టు లేదా జెల్లీ ముక్కలతో చేసినట్టు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇది అటు ఇటు ఒకేలా కనబడుతుంది.
అందువల్లనే దీన్ని జ్యువెల్ క్యాటర్‌పిల్లర్ అంటారు. ఇది ఆకుల మీద నడుస్తుంటే, ఎండ పడినప్పుడు ఈ పురుగు ఒంటి మీద కోలగా ముళ్ళు మాదిరి కనిపిస్తాయి.
అందంగా కనిపిస్తుంది కానీ ముట్టుకుంటే అంతే
అవి చూడడానికి డేంజర్ అనిపించినా, అవి ఏం గుచ్చుకోవు. అవి మెత్తగా జెల్లీ లాగానే ఉంటాయి. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది.
ఏదైనా పక్షి కానీ, చీమ కాని దీన్ని తినటానికి వస్తే ఈ జిగురు లాంటి ముళ్ళు ఉండటంవల్ల, అవి తినగానే వాటి నోట్లోనే ఇరుక్కుపోతాయి.
అందువల్ల శత్రువులు దీనికి జోలికి పోరు. ఈ పురుగును చూడగానే మాకు వద్దు అని పారిపోతాయి. ఈ పురుగు చాలా అందంగా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు.
పెద్దగా అయినాక సీతాకోకచిలుక లెక్క మారినప్పుడు ఇంకా ఎంత అందంగా ఉంటుందో అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడే సీన్ రివర్స్ గా ఉంటుంది.
చిన్నప్పుడు రత్నం పెద్దయ్యాక మామూలు పురుగు
ఇది గొంగళి పురుగు గా ఉన్నప్పుడు రత్నం లాగా ఉంటుంది. కానీ పెద్ద అయితే మాత్రం జ్యువెల్ మాత్ (Jewel Moth) గా మారుతుంది.
ఇది అప్పుడు నారింజ రంగులో ఒంటిమీద అన్ని బొచ్చుతోని, మామూలు పురుగు లాగా అవుతుంది. అంటే చిన్నప్పుడు ఉన్న గ్లామర్ పెద్దగా అయ్యాక ఉండదన్నమాట.
ఈ పురుగులు మన దగ్గర కనిపించవు. ఇవి మెక్సికో, సెంట్రల్ అమెరికా అడవుల్లోని మాన్‌గ్రోవ్ అనే చెట్ల మీద ఇవి చాలా తిరుగుతూ ఉంటాయి.
ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అని చెప్పడానికి ఈ పురుగు ఒక బెస్ట్ ఉదాహరణ.
గాజు లాంటి ఈ సీతాకోకచిలుక, రత్నం లాంటి ఈ పురుగును చూసాక మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
