మనం సాధారణంగా సముద్రం అంటే ఎలా ఉంటుందో చూస్తూనే ఉంటాం. ఎటు చూసినా ఒకటే రంగు ఉంటుంది. నీళ్లన్నీ నీలం రంగులో ఉంటాయి.
ఒక బకెట్లలో నీళ్లు తీసుకొని ఇంకొక బకెట్లోకి పోస్తే, అవి ఒక సెకండ్ లో కలిసిపోతాయి. నదుల నుండి సముద్రంలోకి వచ్చిన నీరు కలిసిపోతాయి.
సముద్రంలో నుంచి మరో సముద్రంలో నీరు కలిస్తే అవి ఒకేలాగా ఉంటాయి. మనకు ఆ నీళ్లు కలిసి పోవడం వల్ల పెద్ద తేడా తెలియదు.
Gulf of Alaska నీళ్లు కలవని సముద్రం వెనుక ఉన్న అసలు కథ

ఈ ప్రపంచంలో ఒక వింత ప్లేస్ ఉంది. సముద్రం తీరు అక్కడ వేరుగా ఉంటుంది. రెండు మహా జల రాశులు పక్కపక్కనే ఉంటాయి.
అవి ఒకదాని పక్కన ఒకటి ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ వాటి నీళ్లు మాత్రం అస్సలు కలవు. సముద్రం మధ్యలో ఎవరు అడ్డంగా ఒక గీత గీసినట్టు ఉంటుంది.
ఇటుపక్క ఒక రంగు, అటు పక్క ఒక రంగు ఉంటుంది. ఒకవైపు ముదురు నీలం, ఇంకోవైపు బురద రంగులో ఉంటాయి. ఈ నీళ్లు ఒకదానితో ఒకటి తాకుతాయి కానీ కలవు.
మరి నిజంగానే సముద్రం నీళ్లు కలవవా? దీని వెనుక ఉన్న అసలు సంగతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గల్ఫ్ ఆఫ్ అలస్కా రెండు సముద్రాలు కాదు
గల్ఫ్ ఆఫ్ అలస్కా Gulf of Alaska. రెండు మహాసముద్రాలు కలుస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ జరిగే కథ వేరు.
అక్కడ కలిసేది రెండు సముద్రాలు కాదు. ఒక పక్క పసిఫిక్ మహాసముద్రం నీళ్లు, మరొక పక్క గ్లేసియర్స్ కొండల నుంచి కరిగి వచ్చిన నీళ్లు.
ఈ రెండు నీళ్లు ఒకే దగ్గర చేరినప్పుడు అవి వెంటనే కలవకుండా, ఒక బార్డర్ లాగా ఏర్పడతాయి. అందువల్ల మనకు అవి చూడడానికి రెండు రంగుల నీళ్లు వేరువేరుగా ఉన్నట్టు కనిపిస్తాయి.
నీళ్లు కలవకపోవడానికి గల ముఖ్యమైన సైంటిఫిక్ కారణాలు
నీళ్లు కలవక పోవడానికి కారణం సైన్స్ ఏమని చెప్తుంది అంటే, దీని వెనకాల ఒక పెద్ద మ్యాజిక్ ఏమీ లేదు అంటుంది. అంతా సైన్స్ ఉందట.
ఈ నీళ్ళు కలవక పోవడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయట. సముద్రం నీళ్లు ఉప్పుగా ఉంటాయి. అందువల్ల అవి బరువు, చిక్కగా ఉంటాయి.
మంచు కొండల నుంచి వచ్చే నీరు మంచినీళ్లు అవి తేలికగా ఉంటాయి. అందువల్ల ఉప్పు నీళ్లు, మంచినీళ్లు సాంద్రత తేడా వల్ల అవి అంత తొందరగా కలిసిపోవు.
ఎలాగంటే నూనె, నీళ్లు ఎట్లా అయితే కలవవో ఇది కూడా అంతే. మంచు కొండలు కరిగినప్పుడు ఆ నీటిలో మట్టి, రాళ్లు ఇసుక అన్ని కొట్టుకొని వస్తాయి.
అందుకే ఆ నీళ్లు లేత నీలం రంగులో కాస్త బురదగా కనిపిస్తాయి. అదే సముద్రం నీళ్లు మాత్రం స్వచ్ఛంగా ముదురు రంగులో ఉంటాయి.
ఈ రంగుల తేడా వల్లనే మనకు అవి కలవనట్టు అనిపిస్తాయి. సముద్రం నీళ్లు కొంచెం వెచ్చగా ఉంటాయి. కానీ గ్లేసియర్ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి.
ఈ ఉష్ణోగ్రత తేడా వల్ల కూడా అవి కలవడానికి సమయం పడుతుంది. నీళ్లు ఎప్పటికీ కలవవా అని మీకు సందేహం రావచ్చు. కలుస్తాయి కానీ మెల్లగా కలుస్తాయి.
మనకు పైకి చూస్తే ఒక గీత గీసినట్టు అనిపించినా, లోపల మాత్రం నీళ్లు మెల్లగా మిక్స్ అయితానే ఉంటాయి. ఆటుపోట్లు, గాలి వల్ల కొంత టైం కి ఈ రెండు నీళ్లు కలిసిపోతాయి.
కానీ ఆ ప్రాసెస్ చాలా మెల్లగా ఉండటం వలన ఆ లైన్ మనకు ఎప్పుడు అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే ఇది దేవుడు సృష్టి, మ్యాజికో కాదు.
ఇది ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైన సైంటిఫిక్ ప్రక్రియ. నీళ్లు కలవని సముద్రం అనే ఈ గల్ఫ్ ఆఫ్ అలస్కా నిజంగా చూడడానికి మన రెండు కాళ్లు చాలవు.
ఇది కూడా చదవండి: [కరెంట్ లేకున్నా వెలిగే సముద్రం, ఈత రాకున్నా ముంచని నీళ్లు]
Mauritius Underwater Waterfall సముద్రం లోపల జలపాతం

జలపాతం అంటే సాధారణంగా ఎలా ఉంటాయి. కొండల మీద నుంచో, గట్ల మీద నుంచో కిందకు దూకుతాయి. దాదాపుగా అన్ని జలపాతాలు మనం ఇలానే చూస్తుంటాం.
కానీ ఎక్కడన్నా జలపాతం సముద్రం లోపల ఉంటుందా? అవును నిజం ఉంటుంది. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా. కానీ మారిషస్ దేశంలో ఈ వింత నిజంగానే ఉంది.
దీన్ని చూడడానికి జనాలు ఎగబడతారు. అసలు సముద్రం మధ్యలో ఈ జలపాతం ఎలా వచ్చింది. దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఇది నిజమైన జలపాతం కాదు ఒక కంటి మాయ
మీకు సూటిగా చెప్పాలంటే అక్కడ నిజంగా జలపాతం లేదు. అవును మీరు విన్నది నిజం. మనం పై నుంచి డ్రోన్ కెమెరాల తోను, హెలికాప్టర్ లోను చూస్తే…
సముద్రం నీళ్ళు అమాంతం లోపలికి జారిపోతున్నట్టు, ఒక పెద్ద అగాధంలోకి పడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ అదంతా మన కంటికి కనిపించే ఒక భ్రమ మాత్రమే.
మారిషస్ సముద్రం లోపల ఇసుక జారే అద్భుతం
మరి జలపాతం ఎందుకు కనిపిస్తుంది అంటే దీని వెనకాల సైన్సు చాలా కామెడీగా ఉంటుంది. మారిషస్ దీవి చుట్టూ సముద్రం లోతు తక్కువగా ఉంటుంది.
కానీ ఒక దగ్గర మాత్రం సముద్రం అడుగు భాగం ఒక్కసారిగా లోతులోకి జారిపోతుంది. సముద్రపు అలల వల్ల అక్కడ ఒడ్డుకు ఉన్న ఇసుక, మట్టి అన్ని కొట్టుకొని పోతాయి.
లోతు ప్రదేశంలోకి జారుతుంటాయి. నీళ్లు ప్రవహించడం వల్ల ఆ ఇసుక వేగంగా కిందకు జరగడం చూస్తే అచ్చం నీళ్లే కిందకు పడుతున్న విధంగా మనకు కనబడుతుంది.
నీటి రంగుల్లో వచ్చే మార్పు వల్ల, ఆ ఇసుక జారే విధానం వల్ల అది ఒక అండర్ వాటర్ ఫాల్ లాగా తయారయింది.
మీరు ఈ అద్భుతాన్ని మారిషస్ దేశంలోని నైరుతి మూలాన ఉన్న ఇది లీ మోర్న్ బ్రబెంట్ అనే ప్రాంతంలో ఉంటుంది.
ఇది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందంటే, మ్యాప్స్ లో చూసినా కూడా ఈ జలపాతం చాలా క్లియర్ గా కనిపిస్తుంది.
మీకేమనిపిస్తుంది
నిజంగానే సముద్రంలో ఇలాంటి వింతలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కావట్లేదు కదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.
