52 Hertz Whale నీటిలో ఒక తిమింగలం | Lonesome George నేల మీద ఒక తాబేలు

52 Hertz Whale, lonesome george AI Generated

మనకు కొంచెం బాధ అనిపించినప్పుడు, స్నేహితులెవరు మాట్లాడకపోతే నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని మనం ఫీల్ అయిపోతాం.

కానీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన భాష ఎవరికీ అర్థం కాక, తన పిలుపు ఎవరికి వినిపించక సముద్రం మొత్తం ఒక్కతే తిరుగుతున్న జీవి ఒకటి ఉంది.

ఆ జీవి గురించి మీరు వింటే మీకు గుండె బరువెక్కుతుంది. అదే 52-హెర్ట్జ్ తిమింగలం. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వేల్ (The World’s Loneliest Whale) అని పిలుస్తారు.

అసలు దీని కథ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

52 Hertz Whale ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం

సాధారణంగా సముద్రంలో ఉండే నీలి తిమింగలాలు (Blue Whales) కానీ, ఫిన్ వేల్స్ గానీ, అవి మాట్లాడుకునే శబ్దం వేరు ఉంటుంది.

అవి దాదాపు 10 నుంచి 25 హెర్ట్జ్ (Hz) మధ్యలో అరుస్తూ ఉంటాయి. ఈ శబ్దం మనుషులకు వినిపించదు. కానీ సముద్రంలో వందల కిలోమీటర్ల దూరం వరకు వేరే తిమింగలాలకు వినబడుతుంది.

మీకు నేను చెప్పే తిమింగలం ఉంది చూశారా? దాని గొంతు పాపం వెరైటీగా ఉంటుంది. ఇది 52 హెర్ట్జ్ లలో అరుస్తుంది. అంటే మామూలు తిమింగలాల కంటే గట్టిగా అరుస్తుందన్నమాట.

దీని వల్ల వచ్చిన పంచాయతీ ఏమిటంటే, ఇది అరిస్తే వేరే తిమింగలాలకు వినిపించదు. ఎప్పుడైనా వినిపించినా ఇదేదో వేరే జీవి అరుస్తుందిలే మన జాతి కాదు అని అవి మామూలుగా ఉంటాయి.

పిలిచినా పలికే నాథుడు లేని బతుకు

ఏం పట్టించుకోవు. అయ్యో పాపం ఇది మహా ప్రేమగా పిలిచినా కూడా, స్నేహం చేద్దామని పిలిచినా, అవతల నుంచి ఒక రిప్లై కూడా రాదు.

ఇది ఇప్పటి విషయం కాదు. 1989 లో అమెరికా నేవీ వాళ్ళు సోవియట్ జలాంతర్గాముల కోసం సముద్రంలో నిఘా పెట్టారు. వాళ్లకి ఈ వింత వినిపించింది.

వాళ్లు ఏమనుకున్నారంటే, ఇదేంటి తిమింగలం లెక్క ఉంది. కానీ సప్పుడు ఏమో తేడా వస్తుంది అని అనుకున్నారు. విలియం వాట్కిన్స్ ఒక సైంటిస్టు దీని పైన ఏళ్ల తరబడి రీసెర్చ్ చేశారు.

ఇది ఒకటే దీనికి ఫ్యామిలీ లేదు. స్నేహితులు కూడా లేరు అని ఆయన కనిపెట్టి చెప్పారు. దీని జీవితం చూస్తే మనకు అయ్యో పాపం అని జాలి వేస్తుంది.

ప్రతి సంవత్సరం ఇది వేల కిలోమీటర్ల సముద్రంలో ఈదుతూ ఉంటుంది. తనకు తోడు కోసం, జత కోసం పాపం అరుస్తూనే ఉంటుంది.

కానీ దానికి ఎక్కడి నుంచి ఏమీ జవాబు రాదు. మిగతా తిమింగలాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే, ఇది మాత్రం ఒక్కతే సైలెంట్ గా తన దారిలో తను పోతూ ఉంటుంది.

హైబ్రిడ్ వల్లే వచ్చిన ఈ తిమింగలం కష్టాలు

సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఇది బహుశా రెండు వేరే రకాల తిమింగలాలకు పుట్టిన హైబ్రిడ్ అయి ఉండవచ్చు అంటున్నారు. అందువల్ల దీని గొంతు ఇట్లా తయారయింది.

ఈ తిమింగలం ఏ జాతికి కాకుండా పోయింది. పుట్టుకతోనే వచ్చిన లోపం దీనికి పెద్ద శాపం అయింది. దీని గురించి తెలిశాక ప్రపంచంలో చాలామంది దీనికి ఫ్యాన్స్ అయిపోయారు.

ఎందువల్ల అంటే, మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం కదా? నా బాధ ఎవరికి అర్థం అయితలేదని బాధపడతాం.

నాకు ఎవరు లేరు, నేనొక్కడినే అని ఈ తిమింగలం ఒంటరితనానికి ఒక సింబల్ అయిపోయింది. దీని మీద పాటలు రాసినారు. సినిమాలు కూడా తీశారు.

ఇది ఒంటరిగా ఉన్నా, దానికి ఎవరు రిప్లై ఇవ్వకపోయినా కూడా అది మాత్రం ఈదుడు ఆపదు. అరవడం కూడా ఆపదు.

ఇది కూడా చదవండి: [కడుపుబ్బా నవ్వించే, భయంతో వణికించే వింత జంతువులు]

Lonesome George Tortoise జాతికి ఆఖరి వారసుడు

మనకు స్నేహితులు, చుట్టాలు, ఫ్యామిలీ అని అందరూ ఉంటారు. ఎవరైనా చనిపోతే ఏడుస్తాం. కానీ ఒక్కసారి ఊహించండి.

ఈ భూమి మీద మీ తెగకు సంబంధించి, మీరు ఒక్కరే మిగిలితే ఎలా ఉంటుంది. మీతో మాట్లాడే తోడు లేక జతకట్టి తోడు లేక, మీరొక్కరే ఉంటే మీకు ఏమనిపిస్తుంది.

అది నరకంగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక జీవి కూడా పాపం అలాంటి బాధని అనుభవిస్తుంది. దాని పేరు లోన్‌సమ్ జార్జ్ (Why Lonesome?).

ఇది గాలాపాగోస్ (Galapagos) దీవుల్లో పింటా ఐలాండ్ తాబేళ్ల జాతికి చెందిన ఆఖరి వారసుడు. ఇప్పుడు దీని కథ ఏంటో మనం తెలుసుకుందాం.

అంతరించిపోయిన జాతిలో మిగిలిన ఒక్కడు

గాలాపాగోస్ దీవుల్లో ఒకప్పుడు ఈ తాబేలు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ మనుషులు చేసిన పనుల వల్ల, అంటే వేటాడటం వల్ల, అక్కడికి మేకలను వదలటం వల్ల అవి అంతరించాయి.

అవి మొత్తం పచ్చగడ్డిని మేసి, ఈ తాబేలకు తిండి లేకుండా చేసినాయి. అందువల్ల మెల్ల మెల్లగా ఒక్కొక్కటి చనిపోయాయి. 1970 కి అసలు ఈ జాతి మొత్తం అంతరించిపోయింది.

ఒక సైంటిస్టు ప్రకారం 1971లో పింటా దీవిలో తిరుగుతుంటే, పొదల చాటున ఏదో మెసిలినట్టు అనిపించింది. తీరా చూస్తే, అది ఒక ముసలి తాబేలు.

అది మెల్లగా నడుచుకుంటూ పోతుంది. ఈ జాతి మొత్తం అంతరించిపోయింది కదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన ఆశ్చర్యపోయాడు.

ఆ లోన్‌సమ్ జార్జ్ ప్రపంచం మొత్తంలో ఆ జాతికి మిగిలిన ఒకే ఒక్కడు. ఇది దొరికిన సంతోషంలో, ఆ సైంటిస్టు దీన్ని జాగ్రత్తగా చార్లెస్ డార్విన్ రీసెర్చ్ స్టేషన్ కి తీసుకొని పోయారు.

వంశం నిలపడానికి చేసిన ప్రయత్నాలు విఫలం

అక్కడే అసలు కథ మొదలైంది. వారికి ఒక ఆలోచన వచ్చింది. జార్జ్ ఒక్కడే ఉంటే, అతని వంశం అంతరించిపోతుంది. అందుకే పెళ్లి చేయాలి అని ఆలోచన చేశారు.

దీని జాతి ఆడ తాబేలు లేవు కాబట్టి, దగ్గర పోలికలు ఉన్న వేరే ఆడ తాబేలు ఎన్‌క్లోజర్ లో వదిలారు. కానీ దానికి మూడ్ లేకనో లేక నా జాతి పిల్లనే నాకు కావాలి అని పంతమో ఏమో కానీ దేనితో సెట్ కాలేదు.

దాదాపుగా 40 సంవత్సరాలు ట్రై చేసినా కూడా, ఒక పిల్ల పుట్టలేదు. అందువల్లనే, దీన్ని లోన్‌సమ్ జార్జ్ అని పిలిచారు. ప్రపంచంలోనే అరుదైన జీవిగా ఫేమస్ అయింది.

జార్జ్ యొక్క వయసు సుమారు 100 సంవత్సరాలు ఉంటుందని అంచనా. ఇది మామూలు విషయమే, ఎందుకంటే సాధారణంగా తాబేలు 200 సంవత్సరాలు బతుకుతాయి.

కానీ ఇది 2012 లో చనిపోయింది. ఇది ఒక్కటే చనిపోలేదు. దానితో పాటు పింటా ఐలాండ్ తాబేళ్ల జాతి మొత్తం శాశ్వతంగా అంతరించిపోయినట్టు లెక్క.

మీకేమనిపిస్తుంది

ఒంటరిగా మిగిలిన ఈ తిమింగలం, జత లేని ఆ తాబేలు గురించి చదివాక మీకేమనిపించింది? మీ భావాలను కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *