Karni Mata Temple ఎలుకలే దేవుళ్లు | Kodinhi Village ఊరంతా కవల పిల్లలే

karni mata temple, kodinhi twins village AI Generated

పెద్ద పెద్ద సైంటిస్టులకు అర్థం కాని ఎన్నో వింతలు మన దేశంలో ఉన్నాయి. ఆ వింతలు చూస్తే ఎవరికైనా మతిపోతుంది.

కొన్ని ప్రదేశాలు మరియు కొన్ని ఊర్లు చాలా వింతగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక రెండు వింత ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం.

ఒకటి ఉత్తరాదిన రాజస్థాన్లో అయితే మరొకటి దక్షిణాదిన కేరళలో ఉంది. ఒకచోట ఎలుకలను దేవుళ్ళ లెక్క చూస్తారు.

ఇంకోచోట ఊరంతా ఎక్కడ చూసినా కవల పిల్లలు. ఆ ఊర్లోకి పోతే మన కళ్ళను మనమే నమ్మలేము. అక్కడ అలా ఉంటుంది.

Karni Mata Temple ఎలుకలే దేవుళ్లు ఎంగిలి ప్రసాదమే మహా భాగ్యం

మామూలుగా మన ఇంట్లో ఎలుకలు కనబడితే ఏం చేస్తాం చెప్పండి. చీపురు పట్టుకొని లేదంటే, కట్టె పట్టుకొని కొట్టి తరిమేస్తాం.

లేకుంటే బోనులో పెట్టేస్తాం. కానీ రాజస్థాన్లో ఓ గుడిలో అలా కాదు. అక్కడ ఎలుకలని దేవుళ్ళ లెక్క చూస్తారు.

మనుషుల కంటే వాటికి ఎక్కువ మర్యాద ఇస్తారు. ఆ గుడి కర్ణి మాత గుడి. రాజస్థాన్లోని బికనీర్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో దేశ్ నోక్ అనే ఊరు ఉంటుంది.

అక్కడ ఈ కర్ణి మాత గుడి ఉంటుంది. గుడి బయట నుండి చూడడానికి అచ్చం పాలరాయితో కట్టిన మంచి ప్యాలెస్ లెక్క ఉంటుంది.

పాతిక వేల ఎలుకలు యమధర్మరాజు వరం

కానీ లోపలికి పోతేనే దీని అసలు కథ మనకు తెలుస్తుంది. గుడిలో చాలా ఎలుకలు ఉంటాయి. దాదాపుగా 25 వేల నల్ల ఎలుకలు ఉంటాయి. వీటిని కబాలు అని పిలుస్తారు.

దీని వెనకాల ఒక కథ ఉంది. కర్ణి మాతను అక్కడ ఆ జనాలు దుర్గా దేవి అవతారమని నమ్ముతారు. కర్ణి మాత వంశానికి చెందిన ఒక కొడుకు ఒకసారి నీళ్లలో మునిగి చనిపోతాడు.

యమ ధర్మరాజును ఆమె బతికించమని బ్రతిమిలాడుతుంది. కానీ అలా బ్రతికించకుండా ఒక వరం ఇస్తాడు. నీ వంశంలోని వాళ్లు చనిపోయాక మనుషుల మాదిరి పుట్టరు.

ఎలుకల వలె పుడతాడు అంటాడు. మళ్లీ ఆ ఎలుకలు చనిపోయాక మనుషుల్లాగా పుడతారు అని వరం ఇస్తాడు. అందువల్ల అక్కడ ఉండే ఎలుకలను ఎలుకల లెక్క చూడరు.

ఎలుక చనిపోతే బంగారంతో పరిహారం

వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు పూర్వీకుల లెక్క చూస్తారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. అది తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు.

కర్ణి మాత గుడిలో పెద్ద పెద్ద గిన్నెలలో లడ్లు స్వీట్లు పాలు పెడతారు. ఎలుకలు అవి తింటాయి. ఆ ఎలుకలు తినగా మిగిలిపోయిన దాన్ని అక్కడివాళ్లు ప్రసాదం లెక్క స్వీకరిస్తారు.

మరి ఎలుకలు తిన్నదాన్ని తింటే రోగాలు రావా అని మీకు సందేహం రావచ్చు. రోగాలు రాకపోగా ఉన్న రోగాలు పోతాయని అక్కడి వాళ్ళు గట్టిగా నమ్ముతారు.

పెద్దపెద్ద వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఆ గుళ్లో ఒక్కరికి కూడా జబ్బు రాలేదు. ఈ గుడి నిండా చాలా ఎలుకలే ఉంటాయి వాటిలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉంటాయి.

పొరపాటున ఈ తెల్ల ఎలుకలు ఎవరికైనా కనిపిస్తే సాక్షాత్తు ఆ కర్ణిమాతే దర్శనం దొరికిందని ఆ గుడిలో ఉన్న వాళ్ళు నమ్ముతారు.

తెల్ల ఎలుకలు కనబడే దాకా కొన్ని గంటల పాటు ఎదురు చూస్తారు. ఆ గుడికి పోయినవారు ఎవరైనా ఒక తప్పు చేస్తే బంగారం ఆ గుడికి పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది.

అది ఏం తప్పు అంటారా? గుడిలో నడిచేటప్పుడు అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. పొరపాటున ఎవరైనా నడుస్తున్నప్పుడు ఒక ఎలక కాని కాళ్ళ కిందపడి చనిపోతే అది మహాపాపంగా అక్కడి వాళ్ళు అంటారు.

దానికి పరిహారం ఆ ఎలుక ఎంత బరువు ఉందో అంతే బరువున్న బంగారం లేక వెండి ఎలుక బొమ్మను చేసి ఆ గుడికి ఇవ్వాలి.

Karni Mata Temple లో ఎలుకలకు చాలా రక్షణ ఉంటుంది. ఎలుకలను పిల్లులు తినకుండా చాలా జాగ్రత్తగా చూస్తారు. పిల్లుల నుండి ఎలుకలను కాపాడడానికి గుడి చుట్టూరా ఇనుప జాలిలను పెట్టారు.

ఇది కూడా చదవండి: [కాళ్లు లేకుండా నడిచే రాళ్లు, ఏనుగులు లాగినా కదలని రాయి]

Kodinhi Village ఎక్కడ చూసినా ఇద్దరే అచ్చం జిరాక్స్ కాపీలు

ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటారు. కానీ ఒకే కుటుంబంలో అచ్చం ఒకేలాగా పుట్టిన పిల్లలను కవలలు అంటారు.

మామూలుగా మన చుట్టుపక్కల లేక మన బంధువులలో అచ్చం ఒకేలాగా పుట్టిన కవల పిల్లలను చూస్తాము. వీరిని చూడగానే మనం ఆశ్చర్యపోతాం.

ఇలా అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఒక మీకు విషయం చెప్తే మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఒక ఊరి మొత్తం కవల పిల్లలు ఉంటారు.

మీరు నమ్మడం లేదు కదా ఇది నిజం. ఎక్కడ చూసినా ఆ ఊరిలో మీకు కవల పిల్లలే కనిపిస్తారు. కేరళలోని కోడిన్హి గ్రామంలో ప్రతి ఇంటికి కవల పిల్లలు ఉంటారట.

బడికి వెళితే తరగతి గది నిండా కవల పిల్లలే ఉంటారు. వాళ్లలో ఎవరో తెలియక టీచర్లకే అప్పుడప్పుడు బుర్ర తిరిగిపోతుంది. ఈ ఊరు చూడడానికి చాలా చిన్న ఊరే కానీ చాలా కవల పిల్లలు ఉంటారు.

సైన్స్ కు అందని మిస్టరీ కవలల ఊరు

ఈ ఊరిలో దాదాపుగా 2000 పైగా ఆ కుటుంబాలు ఉంటాయి. వారిలో 400కు పైగా జతల కవలలు ఉన్నారు. అంటే సుమారు 800 పైగా మంది ఉన్నారు.

పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి ముసలోడి దాకా ఎక్కడ చూసినా కవల జంటలే కనిపిస్తారు. ప్రతి 1000 మందికి 45 మంది కవలలు పుడుతూ ఉన్నారు.

డాక్టర్లు మరియు సైంటిస్టులు ఆ ఊరికి వచ్చారు. వారు అక్కడ ఉండే నీళ్లను మరియు మట్టిని తినే తిండిని అన్నిటిని కూడా పరీక్షలు చేశారు.

ఏదైనా జన్యు లోపం ఉందా లేక ఏమైనా కెమికల్స్ కలిశాయా అని పరీక్షలు చేశారు. కానీ ఇప్పటివరకు ఎవరికీ కూడా సరైన కారణం తెలియలేదు.

అది అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇది ఒక మెడికల్ మిస్టరీ అని చేతులెత్తేస్తున్నారు.

కన్ఫ్యూజ్ చేసే కవలల కోసం ఒక సంఘం

ఈ కవల పిల్లల వల్ల ఆ ఊరిలో చాలా తమాషాలు జరుగుతాయి. చూడడానికి ఒకే విధంగా ఉంటారు కాబట్టి ఎవరు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం.

తప్పు ఒకటి చేస్తే నింద ఇంకొకడిపై పడుతుంది. తప్పు చేసినాడు చాలా తెలివిగా తప్పించుకుంటాడు. కానీ అమాయకుడు మాత్రం చేయని తప్పుకు బలి అవుతాడు.

కొత్తగా ఎవరైనా ఆ ఊరికి పోతే మాత్రం మస్తు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కవల పిల్లల కోసం అక్కడ ఒక సంఘం కూడా పెట్టుకున్నారు.

దాని పేరే టాకా (TAKA). ఈ సంఘంలో కవల పిల్లలకు వచ్చే కష్టసుఖాలను మాట్లాడుకుంటారు. ఏదైనా అవసరం పడితే ఒకరి కొకరు సహాయం చేసుకోవడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఎలుకల గుడి, కవలల ఊరు గురించి విన్నాక మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *