బండి స్టార్ట్ చేయకున్నా కొండ ఎక్కుద్ది | సిమెంట్ ఇసుక లేకున్నా గట్టి బ్రిడ్జిలు
మన భారతదేశంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాలు చూస్తే ప్రతి ఒక్కరూ నోరు వెళ్ల బెడతారు. ఒక చోట బండి స్టార్ట్ చేయకున్నా గాని దానంతట అదే పోతుంది. ఇంకో చోట ఇసుక సిమెంటు ఏమీ లేకుండానే వంతెన కట్టేస్తారు. ఆ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరవు. ఒకటి లడక్ లోని ప్రకృతి మాయజాలం అయితే, మరొకటి మేఘాలయాలోని మనిషి మేధస్సు అద్భుతం. ఈ విషయాలు సైంటిస్టుల బుర్రను కూడా హీటెక్కిస్తున్నాయి. ఈ రెండు విషయాల వెనకాల ఉన్న అసలు సంగతి ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను.
ఇంజిన్ ఆపినా బండి పైకి పోతది.. లడఖ్ లోని వింత

ఎవరైనా కొండపైకి ఎక్కాలంటే ఏం చేస్తారు చెప్పండి. బైక్ అయితే ఫస్ట్ గేర్ వేసి ఫుల్ ఆక్సిలేటర్ ఇచ్చి బండి ఎక్కిస్తారు. ఇక కారు గురించి చెప్పనే అవసరం లేదు. దానిని ఫుల్లుగా అరిచే విధంగా చేస్తారు. ఒక ప్రదేశంలో మాత్రం పూర్తిగా రివర్స్లో చేస్తారు. ఇంజన్ ఆన్ చేయకుండా పెట్రోల్ ఖర్చు లేకుండా కొండపైకి ఎక్కిస్తారు. లడక్ నుంచి కార్గిల్ పోయే హైవే మీద ఈ ప్రదేశం ఉంటుంది. దీన్ని బైకర్ల స్వర్గం అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే అక్కడ బండ్లు చాలా తేలికగా పోతాయి. చుట్టూరా కొండలు మధ్యలో రోడ్డు చూడ్డానికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఈ ప్రదేశం లేహ్ సిటీ నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ఈ ప్రదేశంలో అసలు ఏముంటుంది. ఎందుకు ఎలా బండ్లు పోతాయి. అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం రోడ్డు పైన అక్కడ పసుపు రంగు డబ్బా గీసి పెట్టి ఉంటాది. బైక్ లు మరియు కార్లు తీసుకుపోయి సరిగ్గా ఆ బాక్సులో పెట్టాలి. బండి ఇంజన్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. బండి గేర్ తీసేసి న్యూట్రోల్లో లో పెట్టాలి. ఇక అప్పుడు చూడండి. అసలైన తమాషా బండిని ఎవరు తోయకుండా ఇంజన్ ఆన్ చేయకుండా బండి దానంతట అదే ముందుకు కదులుతుంది. చక్కగా కొండపైకి బండి ఎక్కుతుంది. దాదాపుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో బండి కొండ పైకి ఎక్కుతుంది. ఇది చూసే వాళ్లు మాత్రం ఇదేమి వింత రా బాబోయ్ అనుకుంటారు.
ఈ ప్రదేశంలో ఇలా జరగడానికి రెండు కారణాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. అక్కడ ఉన్న కొండకు అయస్కాంత శక్తి ఉందని అంటారు. అందువల్ల వాహనాలు ఇనుముతో చేయడం వలన ఆ వాహనాలను తన వైపు లాక్కుంటుందని కొందరు అంటారు. అందువల్ల దీని మ్యాగ్నెటిక్ హిల్ అంటారు. ఈ ప్రాంతంలో ఇనుముతో చేసిన వాహనాలు ఏవి తిరిగిన ఇలాగే ఉంటుంది. ఈ ప్రాంతం లో పై నుండి విమానాలు పోయినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండటానికి అక్కడికి విమానం వచ్చే ముందే కాస్త ఎత్తులోకి విమానాన్ని లేపుతారు.
సైంటిస్టులు మాత్రం ఇది ఆప్టికల్ ఇల్యూజన్ (కంటి భ్రమ) అని చెబుతారు. ఆ చుట్టుపక్కల ఉన్న కొండల వల్ల అక్కడున్న భూమి లోతు వల్ల కళ్లకు డౌన్ పల్లెం కూడా ఎత్తుగా కనిపిస్తుంది. అని సైంటిస్టులు అంటారు. అందు వల్లే బండిని ఆన్ చేయకుండా దానంతట అదే జారుకుంటూ పోతుంది. కానీ చూసేవారి కళ్ళకు మాత్రం ఆ రోడ్డు పైకి ఉన్న విధంగా కనిపిస్తుందన్నమాట. సైంటిస్టులు అందువల్ల బండి పైకి ఎక్కుతుందని బ్రమపడతారు అంటారు. కంటి మాయ లేక మరిమైనా పవర్ ఉందా. అనే విషయం పక్కన పెడితే అక్కడ ఆ అనుభవం మాత్రం చాలా బాగుంటుంది అంటారు.
ఎంతమంది ఎక్కినా కదలవు.. మోడ్రన్ బ్రిడ్జిల కంటే ఇవే స్ట్రాంగ్
మనదేశంలో చాలా అంటే చాలా వింతలు ఉన్నాయి. మనిషి బుర్ర పెడితే దానికి ప్రకృతి శక్తి తోడైతే ఏ పనైనా చేయవచ్చు. మేఘాలయలోని ఒక వింతను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మామూలుగా బ్రిడ్జి కట్టాలంటే ఇసుక, సిమెంటు, కంకర, ఇనుము తెచ్చి వాటితో పనులు మొదలు పెడతాం. కానీ మేఘాలయ లోని అడవి మనుషులు మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వంతెనలు కట్టేస్తున్నారు. అది ఎట్లా సాధ్యమంటే, అడవిలోని చెట్ల వేర్లతో నదుల మీద బ్రిడ్జిలు కడతారు. చెట్ల వేర్లతో బ్రిడ్జిలు కట్టడం ఏంటి అని నమ్మబుద్ధి కావడం లేదా ? అవును ఇది నిజం.
ఈ బ్రిడ్జిలు ఎలా కడతారు అంటే, ఇదేదో ఒక రోజులోనూ లేక ఒక నెలలో అయ్యే పని కాదు. దీనికి చాలా ఓపిక ఉండాలి. మేఘాలయాలోని కాశీ అనే తెగకు సంబంధించిన గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజనులు అక్కడ బాగా పెరిగిన రబ్బరు చెట్లతో ఈ బ్రిడ్జిలు కడతారు. అది ఎలా అంటే, నదికి ఓవైపు ఉన్న చెట్టు వేర్లను వెదురు బొంగుల సహాయంతో అటు వైపు రోడ్డుకు మల్లి ఇస్తారు. ఆ వేర్లు మెల్ల మెల్లగా పాకుతూ వేరే వైపు ఉన్న ఒడ్డుకు మట్టిలోకి చుచ్చుకుపోతాయి. అప్పుడు ఆ వేర్లు గట్టి పడతాయి. మనుషులు నడిచినా కూడా గట్టిగా ఉండే అంత బలంగా తయారవుతాయి. అంత గట్టిగా కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అక్కడి వాళ్లకు అంత ఓపిక ఉంది. కావున ఈ బ్రిడ్జి కట్టగలిగారు.
ఈ విధంగా కట్టిన బ్రిడ్జిలు చాలా సంవత్సరాల పాటు గట్టిగా ఉంటాయి. మామూలుగా బ్రిడ్జిలు కడితే అవి కొత్తలో బాగుంటాయి. కానీ పాతవి అయినా కొద్ది పగుళ్లు వస్తాయి. కానీ ఈ బ్రిడ్జి మాత్రం అలా కాదు. వ్యతిరేకంగా ఉంటుంది. బ్రిడ్జి ఎంత పాతదైతే అంత గట్టిగా ఉంటుంది. ఈ బ్రిడ్జి మీద 50 మంది ఒకసారి నిలబడ్డ ఏమీ కాదు.
మీకు ఒక సందేహం రావచ్చు. ఇన్ని సంవత్సరాలు ఆగి ఈ బ్రిడ్జిని కట్టడం ఎందుకు ? చెక్కలతో కట్టొచ్చు కదా అని మీరు అనుకుంటారు. దానికి ఒక కారణం కూడా ఉంది. మేఘాలయాలోని చిరపుంజి ప్రాంతంలో వర్షాలు బాగా కురుస్తాయి. ఆ వానలకు చెక్కలు ఎండవు. వాటితో బ్రిడ్జిలు కడితే ఆ తేమకు త్వరగా కుళ్లిపోతాయి. కానీ బతికి ఉన్న చెట్ల వేర్లు తొ అయితే మాత్రం ఎంత బాగా నానితే అంత గట్టిగా తయారు అవుతాయి. అందువల్ల అక్కడివారు తెలివిగా ఆలోచించి చెట్ల వెర్లతొ బ్రిడ్జి కడతారు.

మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలంటే, అది నొంగ్రియెట్ (Nongriat) ఊర్లో ఉన్న డబల్ డెక్కర్ బ్రిడ్జి. డబల్ డెక్కర్ అంటే ఒక బ్రిడ్జి పైన ఇంకొక బ్రిడ్జి ఉంటుందన్నమాట. ఇది చూడడానికి మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ బ్రిడ్జి చూడాలంటే మాత్రం 3000 పైగా మెట్లు దిగాల్సి ఉంటుంది. ఇన్ని మెట్లు దిగి అక్కడికి పోయిన వారు మాత్రం ఆ బ్రిడ్జి చూశాక కాళ్ల నొప్పులు అన్ని మర్చిపోతారు. ఆ బ్రిడ్జి అంత బాగుంటుంది.
