నేల మీద ఇంద్రధనస్సు | ఇంకోటి ఆకాశంలో తేలే కొండ! ఈ కొండల వెనుక ఉన్న సీక్రెట్ ఇదే
మామూలుగా మన ఊర్లో కానీ లేకుంటే ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు కానీ కొండలను చూస్తుంటాం. అవి పచ్చని చెట్లతో ఉంటాయి. నల్లటి రాళ్లతో కూడా కొన్ని కొండలు ఉంటాయి. కానీ కొండలు ఇంద్రధనస్సుల ఉండడం మీరు ఎప్పుడైనా చూశారా. ఇది వినటానికి వింతగా ఉన్న ఇది నిజం. ఆ కొండలను చూస్తే ఎవరో ఆర్టిస్టు వచ్చి కొండలకు రంగులు వేసినట్టు ఉంటుంది. ఇది ఏమైనా ఆయన లేక సైన్సా అన్నట్టు ఉంటుంది. అసలు ఆ కొండకు రంగులు ఎలా వచ్చాయి. వాటిని ఎవరు వేశారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కళ్ల ముందే అద్భుతం: ఈ రంగుల కొండల వెనుక ఉన్న కథ ఇదే

ఈ రెండు వింతైన కొండలు రెండు దేశాల్లో ఉన్నాయి. ఒకటి చైనా దేశంలో ఉన్న కొండను జాంగ్యే డాన్క్సియా” (Zhangye Danxia) అంటారు. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకోటి పేరు లో ఉంటుంది. ఈ కొండను వినోకుంకా” (Vinicunca) లేక రెయిన్ బో మౌంటెన్ అంటారు. ఈ ప్రదేశాలకు మనం వెళ్లి చూస్తే భూమి మీద ఉన్నామా లేక వేరే గ్రహం మీద ఉన్నామా అనే సందేహం కలుగుతుంది.
ఇవి రాత్రికి రాత్రి ఏర్పడిన కొండలు అని చాలా మంది అలానే అనుకుంటారు. ఈ కొండకు కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. సైన్సు ప్రకారం చూస్తే ఇది టెక్టోనిక్ ప్లేట్స్” (Tectonic Plates) మరియు వాతావరణంచేసిన మ్యాజిక్ అంట.
ఈ కొండలను చూస్తే బేకరీలోని మనకు కేక్ గుర్తుకు వస్తుంది. బేకరీలోని లేయర్ కేకు ఒకదానిమీద ఒకటి వేరు వేరు రంగుల్లో ఉంటుంది. ఈ కొండలు కూడా అలాగే ఉంటాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఇసుక మరియు మట్టి ఖనిజాలు ఒక దాని మీద ఒకటి పేరుకుపోవడం వల్ల ఇలా జరిగింది.
ఇవే రంగులు కూడా మారతాయి.ఈ మట్టిలో ఉన్న ఐరన్ ఇనుము మరియు ఖనిజాలు నీటితో మరియు గాలితో రియాక్ట్ అవడం వలన ఇలా రంగులు మారుతాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇనుము తుప్పు పడితే ఎరుపు రంగులోకి వస్తుంది. అలాగే కొన్ని రకములైన సల్ఫర్ ఉంటే పసుపు రంగులోకి మారుతుంది. అదేవిధంగా క్లోరైడ్ ఉంటే ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఈ కొండలు రంగులు మారడానికి గల కారణం భూమిపై ఉండే లోపాల ఒత్తిడి వల్ల ఈ పొరలన్నీ పైకి నెట్టబడతాయి. అందువల్ల ఇలా రంగులు మారుతాయి.
మీకు కళ్ళ ముందే జరిగే ఒక అద్భుతం చెప్తాను. చైనాలోని పార్కుకు పోతే సూర్యుడి ఎండ పడ్డప్పుడు కొండలు తల తల మెరిసిపోతుంటాయి. వాన పడి వెలసిన తర్వాత కూడా ఆ తాకిడికి రంగులు ఇంకా ముదురుగా చాలా స్పష్టంగా కనిపిస్తాయి పసుపు ఎరుపు నారింజ ఆకుపచ్చ నీలం ఇలా చారలు చారలుగా కొండలు ఉంటాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి
ప్రకృతి చెక్కిన ‘డైనింగ్ టేబుల్’.. మౌంట్ రొరైమా మిస్టరీ ఇదే

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. కానీ ప్రకృతి గీసిన ఈ రంగుల పెయింటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనిషి ఎంత గొప్ప పెయింటర్ అయినా కూడా ప్రకృతి గీసిన ఈ పెయింటింగ్ ముందు ఫిదా అవ్వాల్సిందే అని ఈ కొండలు నిరూపించాయి. మనం మామూలుగా చిన్నప్పుడు డ్రాయింగ్ వేసిన లేక సినిమాల్లో కొండలను చూసిన ఎలా ఉంటాయి చెప్పండి. కింద వెడల్పుగా ఉండి, పైకి పోతున్న కొద్ది సన్నగా, చివరన ఒక మున మోనా తేలి ఉంటాది. ప్రపంచంలో దాదాపుగా కొండలన్నీ ఇలానే ఉంటాయి.కానీ దక్షిణ అమెరికాలో ఒక వింత కొండ ఉంది. దీన్ని చూస్తే మీ అంచనాలన్నీ తలకిందులు అవుతాయి.
ఈ కొండ ప్రత్యేకత ఏమిటి అంటే, దీనికి మొన ఉండదు. ఒక పెద్ద కత్తి తీసుకుని ఎవరో కేక్ ని అడ్డంగా కోసినట్టు ఉంటుంది.ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వేసినట్టు ఉంటుంది. అలాగే పైన మొత్తం కూడా చదునుగా ఉంటుంది. అందువల్ల దీన్ని టేబుల్ టాప్ మౌంటెన్ అంటారు. ఇది చాలా పెద్దగా ఉంటుంది. పైన చదునుగా ఉన్న ప్రదేశం దాదాపుగా 31 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంత పెద్దగా ఉంటుందంటే ఏకంగా ఒక ఊరే కట్టొచ్చన్నమాట. చుట్టూ ఉన్న గోడలు కూడా నిటారుగా సుమారుగా 400 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మనుషులు దీన్ని ఎక్కడము అంటే సాహసం అనే చెప్పొచ్చు.
ఈ కొండ చూడడానికి గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది. ఎందువలన అంటే, ఇది చాలా ఎత్తులో ఉంటుంది. వాతావరణంలోని తేమ వల్ల ఎప్పుడు ఈ తెల్ల మేఘాలు కొండ చుట్టూ కమ్మేసి ఉంటాయి. చూసే వాళ్లకు ఆ కొండ మేఘాల మధ్యలో ఒక్కటే కొండ ఉన్నట్టు ఉంటుంది. ఇది గాలిలో తేలుతున్న ఒక ఐలాండ్ వలే కనిపిస్తుంది.
మనం అక్కడికి పోతే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. అందుకే దీనికోసం టూరిస్టులు మరియు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకోవడానికి ఎగబడతారు. మీరు హాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ UP చూశారా? ఆ మూవీలో ఒక తాత ఇల్లు బెలూన్లతో ఎగిరి ఒక కొండ మీదకు పోతది. ఆ సినిమాలో చూపించినట్టు, ప్యారడైజ్ ఫాల్స్ ఈ మౌంట్ రోరైమని చూసే డిజైన్ చేశారు అంట.
ఈ కొండపై ఉండే ప్రపంచం వేరు, కింద ఉండే ప్రపంచం వేరు. సైంటిస్టుల ప్రకారం ఈ రాళ్లు భూమిపైన ఉన్న అత్యంత పురాతన రాళ్లు. ఎన్నో బిలియన్ సంవత్సరాల నాటివి. అంటే డైనోసార్లు పుట్టకముందు నుండే ఈ కొండ ఉంది అన్నమాట. ఇక్కడ ఒక మాదిరి నల్లటి కప్పలు ఉంటాయి. వీటి విచిత్రం ఏమిటి అంటే, ఇవి మిగతా కప్పల్లాగా కావు. గెంత లేవు మరియు ఇదా లేవు. మనుషుల మాదిరి నెమ్మదిగా నడుస్తూ వెళతాయి. ప్రమాదం ఎదురైతే బంతి మాదిరిముడుచుకుంటాయి. ఈ వింత కొండ వెనిజులా బ్రెజిల్ గయానా మూడు దేశాల బార్డర్లో ఉంది. ప్రకృతిలో మనుషులు ఎవరు ఊహించలేని ఎన్నో అద్భుతాలు ఉన్నాయని అనడానికి ఈ కొండ ఒక నిదర్శనం అవుతుంది.
