స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ | కరిగిన ఇంద్రధనస్సు! ఈ వింత నీళ్లను చూస్తే మతిపోవాల్సిందే
తెల్లని వన్నీ పాలని నల్లని వన్నీ నీళ్ళని కొందరు అంటారు. సాధారణంగా మనం గ్లాసులు పోసుకొని తాగే నీరు తేటగా ఉంటుంది. కానీ సముద్రంలో ఉండే నీటికి రంగు ఉంటుంది. సముద్రంలోని నీరు దాదాపుగా నీలం రంగులో ఉంటాయి. సముద్రపు నీరు తాగడానికి ఒక చుక్క కూడా పనికిరాదు. ఒక చోట మాత్రం నీళ్లు మనం తాగే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ వలె ఉంటాయి. పింక్ పింక్ కలర్ లో ఉంటాయి. అదేంటి నీళ్లు ఎక్కడైనా స్ట్రాబెరీ మిల్క్ షేక్ లెక్క ఉంటాయా అని మీకు సందేహం రావచ్చు. కానీ ఇది నిజం. ఇది ప్రకృతి చేసిన అద్భుతం. నీరు అలా ఎందుకు ఉంటాయి ఎవరైనా రంగులు కలిపారా లేక ఏమైనా కెమికల్స్ కలిపారా అని మీరు అనుకుంటున్నారా? అలా ఏమి కలపలేదు. నీళ్లు చూడటానికి చాలా అద్భుతంగా నోరూరించే విధంగా ఉంటాయి. ఈ నీళ్లు అలా ఉండటానికి దీని వెనకాల ఒక పెద్ద సైన్సు ఉంది. ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం.
గులాబీ రంగులో మెరిసిపోయే వింత సరస్సు

ఈ వింత సరస్సు ఆస్ట్రేలియాలో ఉంది. దీని పేరు లేక్ హిల్లియర్ అంటారు. ఇది సముద్రం పక్కనే ఉన్న చిన్న దీవిలో ఈ సరస్సు ఉంటుంది. పై నుంచి ఎవరైనా ఈ సరస్సును చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక దిక్కు నీలం రంగులో సముద్రం, ఇంకో దిక్కు పచ్చని అడవి మధ్యలో ఈ సరస్సు రౌండ్ గా గులాబీ రంగులో ఉంటుంది.
ఈ సరస్సు లోని నీరు చూడడానికి ఎలా ఉంటుందంటే, ఎవరో కావాలని స్టాబెరి సిరప్ లేక బబుల్ గమ్ గాని నీళ్లలో కలిపినట్టు ఉంటుంది. అందువల్ల దీన్ని ప్రపంచంలోనే ఒక వింతగా చెబుతారు. సముద్రానికి ఆ రంగు ఎలా వచ్చిందని అనుకుంటారు. కొంతమంది ఇది సూర్యుడు కాంతి పడడం వల్ల ఆ విధంగా మెరుస్తుంది అని అనుకుంటారు. కానీ అలాంటివి ఏమీ కాదు. మీరు కావాలంటే ఆ సముద్రం దగ్గరికి పోయి ఒక బాటిల్లో నీళ్లు తీసుకొని చూడండి. అవి మామూలు నీళ్లలా కాకుండా పింక్ కలర్ లోనే ఉంటాయి.
ఈ నీరు అలా ఉండడానికి కారణం, సైంటిస్టులు ఏమని చెప్తున్నారు అంటే, ఈ నీటిలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఆ ఉప్పులో ఒక రకమైన బ్యాక్టీరియా మరియు ఆల్గే ఉంటుంది. వాటివల్లే ఆ నీటికి పింక్ కలర్ రంగు వచ్చిందని సైంటిస్టులు అంటున్నారు. అలా పింక్ కలర్ లో నీళ్లు ఉండటం వలన మనకు స్ట్రాబెరీ జ్యూస్ మాదిరి కనిపిస్తుంది.
ఈ నీళ్లు స్ట్రాబెరీ జ్యూస్ మాదిరి ఉంటుంది అని త్రాగడానికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇందులో ఉప్పు ఎక్కువగా ఉండటం వలన ఆ నీరు చాలా కషాయంగా ఉంటుంది. స్నానం చేయొచ్చా మరియు ఈత కొట్టొచ్చా అంటే శుభ్రంగా కొట్టొచ్చు. పింక్ కలర్ రంగు నీళ్ల వల్ల మనకి ఎలాంటి సమస్య లేదు. కాకపోతే ఆ నీటిలో ఉప్పు ఎక్కువగా ఉండటం వలన మనం డెడ్ సీ (Dead Sea) లో తేలినట్టు ఉంటుంది. ఈ నీటిలో మనం తేలికగా నీళ్ల పైన తేలుతాము. కానీ ఈ సరస్సులో ఎవరూ దిగడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడి గవర్నమెంట్ ఈ సరస్సులో దిగడానికి పరిమిషన్ ఇవ్వలేదు. ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదంటే, ఈ సరస్సులో ఉండే ఆ బాక్టీరియా దెబ్బ తినకూడదని ఆ గవర్నమెంట్ ఇలా రూల్ పెట్టింది.
ఈ సరస్సులు చూడాలంటే, మనం కారులో కానీ బస్సులో కానీ పోలేము. ఎందుకంటే, చుట్టూరా దట్టమైన అడవి ఉంటుంది. దీన్ని చూడటానికి హెలికాప్టర్లో చూడాలి లేదా పడవలో దూరం నుంచి చూడొచ్చు. ఇలా ప్రకృతిలో ఎన్నో వింతలు ఉన్నాయి. ఈ సరస్సును చూస్తే నీళ్లు కూడా రంగులు మారుస్తాయి అనిపిస్తుంది.
నీళ్లు కాదు.. ఇది ఐదు రంగుల జాతర

మనం ఇందాక పింక్ కలర్ నీళ్లు ఉండే సరస్సు గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఐదు రంగులు ఉండే నది గురించి తెలుసుకుందాం. దీన్నే లిక్విడ్ రెయిన్ బో” (ద్రవ ఇంద్రధనస్సు) అని కూడా అంటారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రంగులలో నీరు ఉంటుంది. అవి ఆకుపచ్చ, నలుపు, పసుపు, ఎరుపు, నీలం ఇలా ఐదు రంగుల్లో నీరు ఉంటుంది. ఈ నది చూడడానికి రంగు రంగుల పూల తోటల అద్భుతంగా ఉంటుంది. ఈ నదిలో ఎవరైనా పెయింట్ కలిపారా అని మీకు సందేహం వస్తుందా? అలాంటిది ఏమీ లేదు. మీకు పూర్తి విషయం తెలిస్తే భూమ్మీద ఇలాంటి వింతలు కూడా ఉంటాయా అని మీరు ఆశ్చర్య పోతారు.
ఈ నది యొక్క పేరు కానో క్రిస్టల్స్” (Caño Cristales). ఈ నది కొలంబియా దేశంలో ఉంది. రివర్ ఆఫ్ 5 కలర్స్ అని అక్కడి స్థానికులు పిలుస్తారు. ఇంకొంతమంది దీనిని లిక్విడ్ రెయిన్బో అని పిలుస్తారు. ఎందువలన అంటే, ఆకాశంలో ఉండాల్సిన ఇంద్రధనస్సు నేలమీద పారినట్టు ఉంటుంది.
మరి ఈ రంగులు ఎక్కడినుంచి వచ్చాయి. అని మీకు సందేహం రావచ్చు. ఇది పూర్తిగా న్యాచురల్. దేవుడు మాయ కాదు. అలాగే కాలుష్యం కానే కాదు. ఇది ఇలా అవడానికి గల కారణం ఒక మొక్క. నది అడుగులో మకరేనియా క్లావిగెరా” (Macarenia clavigera) అనే ఒక వింత మొక్క పెరుగుతుంది. ఈ మొక్క వల్ల దీనికి ఇంత అందం ఏర్పడింది. సూర్యుడి ఎండ పడే కోణాన్ని బట్టి మరియు నీటి లోతును బట్టి ఈ మొక్క యొక్క రంగులు మారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎరుపు రంగులో ఈ మొక్క రక్తంలాగా మెరిసిపోతుంది. మధ్యలో ఇసుక వలన పసుపు, ఆకుపచ్చ రంగులు కలిసి ఉంటాయి. అవి చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు.
ఈ నది ఎప్పుడు పడితే అప్పుడు అలా కనిపించదు. సంవత్సరం మొత్తం ఇది రంగుల్లా ఉండదు. జూన్ నెల నుండి నవంబర్ నెల వరకు మాత్రమే ఇది రంగు రంగులు కనిపిస్తుంది. మిగిలిన సమయాలలో ఇది మామూలుగానే ఉంటుంది. అందువలన ఆ సమయం రాగానే ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు కెమెరాలు పట్టుకుని వెళతారు.
ఈ నదిని చూడటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ నదిని కాపాడుకోవడానికి అక్కడి గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. రోజుకు కొంత మందిని మాత్రమే ఈ నదిని చూడటానికి అనుమతినిస్తారు. ఈ నదిలోకి దిగేవాళ్లు సన్ స్క్రీన్ లొకేషన్ లో మరియు స్ప్రేలు లాంటివి వాడకూడదు ఎందువలన అంటే ఆ కెమికల్ వల్ల అందులో ఉన్న మొక్కలు చనిపోతాయి. ఈ నది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత అందమైన నదిగా ప్రపంచ రికార్డులో ఉంది.
