కరెంట్ లేకున్నా వెలుగుతది.. ఈత రాకున్నా ముంచదు! సముద్రాల్లో కూడా ఇన్ని వింతలా?
మనం ఆకాశంలో చుక్కలు మెరుసుడు చూస్తూనే ఉంటాం. ఇది ఏం కొత్త విషయం కాదు. కానీ ఆకాశంలోని చుక్కలన్నీ రాలి నీళ్ళల్లో పడితే ఎలా ఉంటుంది. ఒకసారి ఊహించండి. అది సముద్రంలో పడితే ఎలా ఉంటుంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది కదా. అవును ఇది నిజం. కొన్ని సముద్రతీరాలు రాత్రి వేళల్లో లైట్ పెట్టినట్టు దగదగా మెరుస్తుంటాయి. ఇంకా అలలు వస్తుంటే మాత్రం నీలం రంగులో దేదీప్యమానంగా వెలిగిపోతాయి. ఇలా కావడాన్ని ఇంగ్లీషులో బయోల్యూమినిసెన్స్’ (Bioluminescence) అంటారు. అసలు ఈ సముద్రంలో లైట్లు మెరవడం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రాత్రి పూట సముద్రంలో డిస్కో లైట్లు

సముద్రంలో లైట్లు వెలగడం మ్యాజిక్ కాదు. మాయ అంతకన్నా కాదు. దీని వెనకాల ఒక సైన్స్ ఉంది. సముద్రం నీళ్లల్లో మన కంటికి కనిపించని ఎన్నో చిన్నచిన్న జీవులు మరియు పురుగులు ఉంటాయి. వాటిని ‘ఫైటో ప్లాంక్టన్ అంటారు. వీటిలో ఒక రకమైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇలా జరగడాన్ని లూసిఫెర్ అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తేలికగా రాత్రిపూట మినుగురు పురుగులు గాలిలో మెరుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇవి నీళ్లలో మెరుస్తాయి అన్నమాట.
ఈ లైట్లు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అమావాస్య చీకటిలో అలలు ఒడ్డుకు వస్తాయి కదా. అప్పుడు ఆ అలల అంచుల నీలం రంగు నియాన్ లైట్లు వెలిగిన విధంగా ఉంటుంది. మనం నీళ్ళల్లో చేతులు పెట్టి కదిపితే, మన చేయి చుట్టు స్పార్కిల్స్ వచ్చిన విధంగా అనిపిస్తుంది. నిజంగా ఆ సీను మీరు చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఇంకో కొత్త లోకంలో ఉన్నట్టు మరియు సినిమా సెట్టింగ్ లో ఉన్నట్టు ఫీల్ అవుతారు.
ఈ వింతలు చూడటానికి వేరే దేశాలకు పోనవసరం లేదు. మన దేశంలోనే చాలా దిక్కుల కనిపిస్తాయి. కానీ వీటిని చూడాలంటే అదృష్టం కూడా ఉండాలి. వీటిని కొద్ది రోజుల కింద ముంబైలో జుహు బీచ్ ల కొంతమంది చూశారు. కర్ణాటకలో పాడుబిద్రి, గోకర్ణ, మట్టు బీచ్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. చెన్నై లో కూడా తిరువాన్మియూర్ బీచ్ లో ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిని దీవులలో, లక్షద్వీప్ మరియు అండమాన్ హ్యావ్లాక్ ఐలాండ్ లో ఈ లైట్లను చూడొచ్చు.
ఈ లైట్లు ఎప్పుడు అంటే అప్పుడు కనిపించవు. ఇవి వీటి టైమ్ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఇవి చూడాలంటే పున్నమి వెన్నెల ఉండొద్దు. చందమామ వెలుగు ఉంటే ఈ లైట్లు చాలా డల్ గా కనిపిస్తాయి. అమావాస్య మరియు చీకటి ఎక్కువగా ఉన్నప్పుడే ఈ లైట్లు చాలా క్లియర్ గా మెరుస్తూ అందంగా కనిపిస్తాయి.కొన్ని కొన్ని సార్లు వర్షాకాలం పోయిన తర్వాత సముద్రంలో పోషకాలు పెరిగినప్పుడు, ఈ ప్లాంక్టన్ ఎక్కువగా అవుతాయి. అప్పుడు ఈ లైట్లు ఇంకా బాగా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో ఇది చూడ్డానికి చాలా ఎక్కువ ఛాన్సులు ఉంటాయి.
బెడ్ మీద పడుకున్నట్టు నీళ్ల మీద పడుకోవచ్చు

మనం సాధారణంగా బావిలోన చెరువులోనూ మరియు ఎక్కడైనా ఈత కొట్టాలంటే, ఈత నేర్చుకొని ఉండాలి. ఈత రానివారు ఈత నేర్చుకోవాలంటే, నీళ్లలో ఎక్కడ మునిగిపోతామో అని భయపడతారు. కానీ ఇప్పుడు చెప్పబోయే సముద్రంలో మాత్రం ఎవరైనా కళ్ళు మూసుకుని దూకేయొచ్చు. ఆ సముద్రం నీళ్లలో ఎవరు మునగలేరు. పైకి తేలుతూ ఉంటారు. ఇది నిజం. దీని పేరే డెడ్ సీ’ (Dead Sea). జోర్దార్, ఇజ్రాయిల్ దేశాల మధ్యలో ఉండే ఈ వింత సముద్రం సంగతి ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ సముద్రంలో మునగక పోవడానికి గల కారణం అంత ఉప్పులోనే ఉంది. మామూలు సముద్రపు నీళ్లలో కంటే ఈ నీళ్లలో పది రెట్లు ఉప్పు శాతం ఎక్కువగా ఉంది. ఈ ఉప్పు నీళ్ల వల్ల నీళ్లు బాగా చిక్కగా అయిపోతాయి. ఈ నీళ్లు ఎంత చిక్కగా ఉంటే, అంతా నీళ్లే బెలూన్ మాదిరి మనల్ని పైకి నెట్టుతూ ఉంటాయి. కానీ లోపలికి మునగనివ్వవు. అందువల్లనే అక్కడ టూరిస్టులో ఏ భయం లేకుండా ఉంటారు. నీళ్ల మీద పడుకొని పేపర్ చదువుతారు. అందులోనే దర్జాగా కూర్చుని కాఫీ తాగుతారు. వాళ్లకు బెడ్ మీద పడుకున్నట్టే ఉంటుంది.
ఈ సముద్రాన్ని మృత సముద్రం అంటారు. ఎందుకు అలా అంటారంటే, ఈ సముద్రంలో ఉప్పు గోరంగా ఉండటం వల్ల చాపలు కానీ, మొక్కలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, మరి ఏవి సముద్రంలో బ్రతకలేవు. పొరపాటున ఏదైనా చేప ఈ సముద్రంలోకి కొట్టుకొచ్చిన ఆ ఉప్పుకు తట్టుకోలేక ఎమ్మటే చనిపోతుంది. ప్రాణం ఉన్న జీవులు ఏవి ఈ సముద్రంలో బతకలేవు కాబట్టే దీనిని మృత సముద్రం (Dead Sea) అంటారు.
ఈ సముద్రం జంతువులకు ఉపయోగపడకపోయినా, మనుషులకు మాత్రం ఉపయోగపడుతుంది. ఈ సముద్రం అడుగులో నల్ల మట్టి ఉంటుంది. దాని వల్ల మనుషులకు ఉపయోగపడుతుంది. ఆ మట్టిని ఒంటికి రాసుకుంటే చర్మ రోగాలు పోతాయి. స్కిన్ గ్లో వస్తుందట. అందువల్ల అక్కడికి చాలా మంది పోయి మట్టి రాసుకోవాలని అనుకుంటారు. ఆ నీళ్లలో తేలుతూ సేద తీరాలని కోరుకుంటారు. ఈ సముద్రం ఒక న్యాచురల్ బ్యూటీ పార్లర్ లెక్క ఉంటుంది.
ఈ భూమి పైన నేల మట్టం కంటే, ఇది బాగా కిందకు ఉండే ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారుగా 430 కిలోమీటర్ల కిందకు ఉంటుందట. అందువల్ల ఈ ప్రదేశంలో ఎండ కూడా డిఫరెంట్ గా తగులుతుందట. ఇది ఇంకొక వింత విషయం అని చెప్పొచ్చు.
జాగ్రత్తగా ఉండాలి: ఈ నీళ్ల వల్ల ఏమి కాదు అని ఎవరైనా ఓవర్ గా ఎంజాయ్ చేసి ఆ నీళ్లు తాగితే మాత్రం నోరు కాలిపోతుంది. అవి ఉప్పు కషాయం మాదిరి ఉంటాయి. కంటిలో పడితే మంట పుడుతుంది జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈత రాకపోయినా సరే ఒకవేళ ఈ సముద్రం దగ్గరికి ఎవరైనా పోతే ఎంజాయ్ చేస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలి.
