మన రైతులు ఎక్కువగా వరి, పత్తి, మిరప, టమాటా వంటి పంటలను పండిస్తారు. ప్రస్తుత కాలంలో కొత్త పంటలు పండించడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నారు.
అందువల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరి నోటా వినిపిస్తున్న పేరు అగరు వృక్షం (Agarwood). దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఊద్ (Oudh).
దీనికి మార్కెట్లో చాలా విలువ ఉంది. ఒకటి కుళ్లిపోతే బంగారం, ఇంకోటి రాయిలా ఉంటే వజ్రం. ఈ చెట్ల వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Agarwood లిక్విడ్ గోల్డ్ అని ఎందుకు పిలుస్తారు

దీన్ని లిక్విడ్ గోల్డ్ అంటే ద్రవ రూపంలో ఉన్న బంగారం అని పిలుస్తారు. ఈ చెట్టు ఆషామాషీ చెట్టు కాదు. ఇది ఆగ్నేయ ఆసియా అడవుల్లో పెరిగే ఒక అరుదైన వృక్షం.
దీని కలప మామూలుగా అయితే తెల్లగా ఉంటుంది. మెత్తగా కూడా ఉంటుంది. దీనికి వాసన కూడా పెద్దగా ఉండదు. కానీ దీని యొక్క అసలు కథ ఇక్కడే మొదలవుతుంది.
ఈ చెట్టు కాండానికి ఎప్పుడైతే గాయమైనా లేకపోతే ఏదైనా ఫంగస్ వచ్చినా, చెట్టు తనను తాను రక్షించుకుంటుంది. అందుకోసం ఒక రకమైన జిగురు విడుదల చేస్తుంది.
ఆ జిగురు చెట్టు కాండం లోపల పేరుకుపోతుంది. కలప రంగు కూడా మారిపోతుంది. అప్పుడు నల్లగా గట్టిగా అవుతుంది.
ఈ విధంగా తయారైన నల్లటి కలపే అగరు. దీని నుంచి ఘాటైన సువాసన కూడా వస్తుంది.
చెట్టు గాయపడితేనే అగరు పుడుతుంది
దీని రేటు మీరు వింటే ఆశ్చర్యపోతారు. కిలో అగరు చెక్క వేల నుండి లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఇది ఇంత రేటు ఉండటానికి కారణాలు ఉన్నాయి.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన అత్తరులు, సెంటులు అగరు తోనే తయారవుతాయి. ముఖ్యంగా దీనికి అరబ్ దేశాల్లో, అంటే దుబాయ్, సౌదీ లో చాలా గిరాకీ ఉంటుంది.
ఆయుర్వేదంలో, చైనా వైద్యంలో ఎప్పటి నుండో దీన్ని ఉపయోగిస్తున్నారు. మంచి నాణ్యత గల అగరు ముక్కలను కాల్చితే, దాని నుండి వచ్చే పొగ మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది.
అందువల్ల చాలా గుళ్ళల్లో, మసీదులలో దీనిని వాడతారు. అడవిలో అయితే ఈ చెట్టుకు దానంతట అదే గాయమై అగరు తయారవుతుంది.
కానీ మన దగ్గర పెంచేటప్పుడు చెట్టు పెరిగినాక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత కాండానికి రంద్రాలు చేసి ప్రత్యేకమైన ఫంగస్ ను ఎక్కిస్తారు.
దీనిని ఇనాక్యులేషన్ అని అంటారు. అప్పుడు ఈ చెట్టు లోపల అగరు తయారవడం మొదలుపెడుతుంది.
ఎకరాకు ఐదు వందల చెట్లు లక్షల్లో ఆదాయం
మీకు ఒక సందేహం రావచ్చు. మరి ఇది మన దగ్గర పెరుగుతాదా అని, అవును పెరుగుతుంది. ఇది మన మట్టిలో, వాతావరణంలో చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది.
ఇది పెరగడానికి మంచి నేల అవసరం. నీళ్లు నిల్వ ఉండకుండా, జారిపోయే ఎర్ర నేలలు, గులక రాళ్ల నేలలు వీటిలలో బాగా పెరుగుతుంది. దీనికి పెద్దగా నీళ్లు కూడా అవసరం లేదు. డ్రిప్ ఉంటే చాలు.
ఈ పంటను చాలా ఓపికతో పండిస్తే చాలా లాభాలు ఉంటాయి. ఒక ఎకరంలో దాదాపుగా 400, 500 చెట్లు పెట్టొచ్చు. చెట్టు బాగా పెరిగి, మంచి గట్టిగా తయారైతే, ఒక్కొక్క చెట్టు నుండి లక్షల్లో ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది.
అందువల్ల దీన్ని నల్ల బంగారం అంటారు. ఈ పంట పండడంలో టెక్నాలజీని ఉపయోగించాలి. ఫంగస్ ఎక్కించే పద్ధతి మీదనే మీకు వచ్చే లాభం ఆధారపడి ఉంటుంది. ఆ విషయం తెలిసిన నిపుణుల సలహా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: [నడుము వంగిన క్రూకెడ్ అడవి, రివర్స్ లో పెరిగిన బావోబాబ్ చెట్టు]
African Blackwood రాయి కంటే గట్టి చెక్క

మనం ఎర్రచందనం, శ్రీగంధం గురించి విన్నాం. అగరు చెట్టు గురించి కూడా తెలుసుకున్నాం. కానీ వీటన్నింటిని మించి రేటులో మరియు అన్నిటికన్నా గట్టిగా ఉండే ఇంకొక చెట్టు ఉంది.
దాని పేరు ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ (African Blackwood). ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇది. ఖరీదు విషయంలో ముందు వరుసగా ఉంటుంది.
దీన్ని కోయడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని కోయడానికి గొడ్డలికి పదును కాదు. మనసుకు గట్టిగా ఓపిక ఉండాలి.
దీని విషయం ఏంటి, ఇది మన దగ్గర పెరుగుతదా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని పేరులోనే ఉంది ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అని, ఇది ఆఫ్రికా దేశాలలో ఉంటుంది.
ఈ చెట్టు పైకి చూడడానికి మాత్రం మామూలుగానే అనిపిస్తుంది. కానీ చెట్టు ముదిరినాక లోపల ఉండే కలప మాత్రం అచ్చం బొగ్గు లాగా ఉంటుంది.
రాయి లాగా గట్టిగా ఉంటుంది. దీని రేటు చూస్తే మీరు అమ్మో అంటారు. ఒక క్యూబిక్ మీటర్ కలప రేటు అంతర్జాతీయ మార్కెట్లో లక్షల్లో కాదు, ఏకంగా కోట్లల్లో ఉంటుంది.
నీళ్లలో వేస్తే మునిగిపోయే వింత చెక్క
రేటు ఎక్కువగా ఉండటానికి కారణం, క్లారినెట్ (Clarinet), ఒబో (Oboe), గిటార్ల లాంటి ఖరీదైన వాయిద్యాలు తయారు చేయడానికి ఈ చెక్కను ఉపయోగిస్తారు.
ఎందువల్ల అంటే, ఈ చెక్కలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అది పగలదు. శబ్దం కూడా భలే వస్తుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది.
ఈ చెక్కను నీళ్లలో వేస్తే తేలదు, మునిగిపోతుంది. దీన్ని కొయ్యడానికి ఇనుమును కోస్తారు చూడండి, అలాంటి మిషన్లు కావాలి.
బ్లాక్ వుడ్ చెక్కను చూసి ఎబోని చెక్క ఇది ఒకటే అనుకుంటారు కానీ అది కాదు. ఎబోనీ కూడా నల్లగా ఉంటుంది. కానీ ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అంత స్థిరంగా మాత్రం ఉండదు.
బ్లాక్ వుడ్ దీనికి ఉండే ఆయిల్ కంటెంట్ వల్ల ఇది వాతావరణం మార్పులకు స్పందించదు. అందువల్ల దీనికి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
మనం నాటితే మనవళ్లు కోసుకునే ఆస్తి
మన దగ్గర కూడా ఇది పెరుగుతుంది. ఇది మన వాతావరణం కు సెట్ అవుతుంది. కరువును తట్టుకునే శక్తి ఉంటుంది.
మన దగ్గర కొట్టే ఎండలకు తక్కువ వర్షపాతానికి ఇది బాగానే బతుకుతుంది. రాళ్లు రప్పలు ఉన్న బంజరు భూముల్లో కూడా పెరుగుతుంది.
ఇది లెగ్యూమ్ జాతి మొక్క. ఇది భూమిలో నత్రజనిని ఫిక్స్ చేసి, భూసారాన్ని పెంచుతుంది.
మొత్తం బాగానే ఉంది. కానీ ఒక సమస్య ఉంది. ఇది మనం పెట్టి, మన కళ్ళతో చూడలేము. ఇది మనం పెడితే మన మనవళ్లు చూస్తారు.
అవును మరి, ఇది పెరగడానికి అన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది ఎర్రచందనం, శ్రీ గంధం లాగా 15 నుండి 20 సంవత్సరాలకు చేతికి రాదు.
ఈ చెట్టు బాగా ముదిరి మంచి బ్లాక్ వుడ్ తయారు కావాలంటే, కనీసం 60 నుండి 70 సంవత్సరాలు పడుతుంది.
మీకేమనిపిస్తుంది
లిక్విడ్ గోల్డ్ లాంటి అగరు, రాయి లాంటి ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.
