మొసళ్లను తినే కొంగ.. గాలిలోనే నిద్రపోయే పక్షి.. ఇవేం వింతలు అబ్బో బాబోయ్
ఈ భూమి మీద చాలా రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో కొన్ని చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. మరికొన్ని పక్షులు చాలా వింతగా ఉంటాయి. మరి కొన్ని పక్షులు అయితే భయంకరంగా ఉంటాయి. భగవంతుడు ఒక్కొక్క పక్షిని ఒక్కొక్క విధంగా సృష్టించాడు. కాబట్టి ఏ పక్షులను కూడా మనం చులకనగా చూడకూడదు. వింతైన కొన్ని పక్షుల గురించి ఈ కింద ఉన్నాయి.
1. గ్రేట్ ఫ్రిగేట్ బర్డ్ (Great Frigatebird) గాలిలోనే నిద్రపోయే అద్భుత పక్షి

గ్రేట్ ఫ్రిగేట్ బర్డ్ (Great Frigatebird) దీనినే ఓడ పక్షి అని కూడా అంటారు. ఈ పక్షి మంచి రూపం మరియు మంచి ప్రవర్తనకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇది ఉష్ణ మండలంలోని సముద్రతీరంలో కనిపిస్తుంది. ఈ పక్షుల యొక్క ఆకారం చాలా వింతగా ఉంటుంది. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఇవి తమ మెడలో ఎర్రగా ఒక సంచి ఉంటుంది. ఇవి సంతాన ఉత్పత్తి సమయంలో ఆ సంచిని ఉబ్బించి, ఆడ పక్షులను ఆకర్షిస్తాయి.
ఈ పక్షుల సంచి బెలూన్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ పక్షి కంటే ఈ బెలూన్ చాలా పెద్దదిగా ఉంటుంది. వీటి రెక్కల గురించి చెప్పాలంటే ఇవి చాలా పొడవుగా మరియు వెడల్పుగా ఉంటాయి. వీటి వెడల్పు చాలా పెద్దగా ఉంటుంది. సుమారుగా 2.05 నుండి 2.3 మీటర్ల వరకు ఉండవచ్చు. మిగతా పక్షులన్నిటితో పోలిస్తే ఎక్కువ శరీర పరిమాణం ఉన్న పక్షి ఇదే. దీని ముక్కు పొడవుగా ఉండి కొక్కెరల ఓడి తిరిగి ఉంటుంది. ఇలా ఉండటం వలన చాలా తేలికగా చేపలను మరియు కీటకాలను వేటగాలుగుతుంది.
మీకు ఈ పక్షుల ప్రవర్తన గురించి చెబితే నిజంగా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఈ పక్షులు గాలిలోనే ఎగురుతూ నిద్రపోతాయి. అంతేకాదు ఒకసారి నేలపై వాలకుండ కొన్ని రోజుల తరబడి గాలిలోనే ఉండగలవు. ఈ పక్షులు దొంగతనం కూడా చేస్తాయి. అవి ఎలాగంటే, ఇతర పక్షులు పట్టుకున్న చేపలను వెంటాడి వేటాడి ఇబ్బంది పెట్టి ఆ పక్షులు ఆచాపలను వదిలిపెట్టేలా చేస్తాయి. అలా వదిలిపెట్టినప్పుడు ఆ చాపలు ఇంకా కింద పడకముందే గాలిలోనే ఒడిసి పట్టుకుంటాయి. ఇలా చేయడాన్ని Kleptoparasitism పద్ధతి అంటారు. అందుకే ఈ పక్షులను పైరేట్ బర్డ్స్ అంటారు.
ఈ పక్షులు హిందూ మరియు పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణ మండలం ద్వీపాలలో నివసిస్తాయి. వీటి ముఖ్యమైన ఆహారం చేపలు, చేపలను ఎక్కువగా తింటాయి. అది ఎలాగంటే, సముద్రం నుండి గాలిలో ఎగురుతున్న చేపలను పట్టుకొని తింటాయి.
2. చెట్టు కొమ్మలా మారిపోయే పొటూ పక్షి (Potoo Bird)

పొటూ పక్షి (Potoo Bird) దెయ్యం పక్షి అని కూడా అంటారు. దీని పక్షి అనడం కంటే మాయగాడు అనొచ్చు. ఎందుకంటే, ఇది అలా ఉంటుంది కాబట్టి ఇది ఒక చెట్టు పైన కూర్చుంది అనుకోండి, అక్కడ ఒక పక్షి ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఒక చెట్టు మాత్రమే ఉంది ఏమి పక్షి లేదు అనుకుంటారు. చూసేవాళ్లకు దాని రంగు ఆకారం అలా ఉంటుంది. అచ్చం చెట్టుకొమ్మల్లాగా ఉంటుంది. ఆ పక్షి ఆకారం ఆలా ఎందుకు ఉంటుందంటే, దాని రంగు మరియు ఆకారం అచ్చం ఎండిపోయిన చెట్టు మాదిరి ఉంటుంది.
అది ఒక చెట్టు పైన కదలకుండా కూర్చుంటుంది. అందువల్ల అక్కడ పక్షి ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. ఈ పక్షి కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ అది శత్రువులను గుర్తించగలరు. అది ఎలాగంటే దాని కనురెప్పలకు చిన్నపాటి రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా గుర్తిస్తుంది. ఆ కళ్ళు మూసుకుని ఉన్నా కానీ ఆ కట్టి రంధ్రాల నుండి చూడగలుగుతుంది. చూసే వాళ్లు మాత్రం ఆ పక్షి కళ్ళు మూసుకొని ఉంది అని గమనిస్తారు. దీని ముక్కు చాలా చిన్నగా ఉంటుంది. కానీ నోరు మాత్రం అబ్బో చాలా పెద్దది. ఆ నోటి ద్వారా గాలిలో ఎగురుతున్న పురుగులను వేటాడుతుంది.
ఈ పక్షులు రాత్రిపూట సంచరిస్తాయి. వీటి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ పక్షులు చీకట్లో కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాయి. అది ఎలాగంటే వీటికి నారింజ లేదా పసుపు రంగులో కళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఇవి దక్షిణ మరియు మధ్య అమెరికాలోని ఉష్ణ మండల అడవులలో ఉంటాయి. ఈ పక్షులు మాంసాహారులు. ఇవి చీకట్లో కీటకాలు, విడతలు, చిమ్మట పురుగులను వేటాడి తింటాయి. చిన్న చిన్న గబ్బిలాలను కూడా అప్పుడప్పుడు వేటాడుతాయి. ఈ పక్షులు వాటికంటూ ప్రత్యేకంగా గూడు కట్టుకోవు. ఇవి చెట్టు కొమ్మల్లో ఉండే చిన్న గుంటలో ఉంటాయి.
ఈ పక్షులు ఎండిపోయిన కొమ్మ చివరన ఒకే ఒక గుడ్డు పెట్టి అక్కడనే పొదుగుతాయి. ఈ పక్షులకు Poor-me-one అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ పక్షులు చాలా వింతగా అరుస్తూ ఉంటాయి. ఈ పక్షుల అరుపు ఎవరో మొలుగుతున్నట్టు ఉంటుంది. ఈ పక్షుల అరుపు ఏడుస్తున్నట్టు కూడా ఉంటుంది. రాత్రిపూట ఈ పక్షుల అరుపులు వింటే చాలా భయపడతారు.
3. డైనోసార్ వారసుడిలా కనిపించే షూబిల్ కొంగ (Shoebill Stork)

షూబిల్ కొంగ (Shoebill Stork) ఈ పక్షిని చూడగానే మనం ఇదేమైనా పక్ష లేక బొమ్మన అనుకుంటాం. అలా ఉంటుంది ఇది. ఈ పక్షి ప్రపంచంలోనే వింతైన పక్షుల్లో అత్యంత భయంకరమైనది. దీని ఎత్తు 4 నుండి 5 అడుగుల వరకు పెరగ గలుగుతుంది. ఈ పక్షి ముక్కు చాలా పెద్దదిగా ఉంటుంది. పాత చెప్పుల మాదిరి గట్టిగా ఉంటుంది. దీని ముక్కు అంచున పదరైన కుక్కింలా ఉంటుంది. ఇది దాదాపుగా 24 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.
మీరు వీటి రెక్కలను చూస్తే ఆశ్చర్యపోతారు. వీటి రెక్కల విప్పు 8 అడుగుల వరకు ఉంటుంది. ఈ పక్షులు తూర్పు ఆఫ్రికాలోని చిత్తడి నేలలలో ఉంటాయి. ఇవి నదులు మరియు సరస్సులలో కూడా ఉంటాయి. వీటికి పాపిరస్ మొక్కలు బాగా ఉన్న ప్రాంతంలో నివసించడం అంటే చాలా ఇష్టం. ఈ పక్షులు మాంసాహారం తింటాయి. కప్పలు మరియు వాన పాములు తింటాయి. మీకు మరొక విషయం తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. అదేంటంటే, ఈ పక్షులు చిన్న చిన్న మొసళ్ళు లను కూడా వేటాడి తింటాయి. ఇది ఒక విగ్రహంల లాగా కదలకుండా నిలబడుతుంది. కొన్ని గంటల పాటు కూడా కదలకుండా నీటిలో ఉండి ఏదైనా దొరకగానే దానిని చాలా వేగంగా వెళ్లి ముక్కుతో పట్టుకుంటుంది.
వీటిని విగ్రహం లాంటి పక్షి అని కూడా అంటారు. వీటి శబ్దం వస్తు గమ్మతిగా ఉంటుంది. ఏదైనా తుపాకీ పేల్చినట్టు ఉంటుంది. ఈ పక్షులు ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతాయి. ఎందుకంటే వీటికి ఒంటరితనం అంటే చాలా ఇష్టం. జంటగా ఉన్నా సరే ఆహార విషయంలో మాత్రం అలా ఉండవు ఇవి ఆహారం కోసం ఒంటరిగా వేటాడుతాయి.
