నడుము నొప్పి వచ్చినట్టు వంగింది.. గర్వం ఎక్కువై రివర్స్ అయ్యింది! ఈ చెట్ల కథలే వేరు
మనం తరచుగా చెట్లను చూస్తూనే ఉంటాం. చెట్లు మామూలుగా ఎటారుగా నిటారుగా పెరుగుతాయి. కానీ పోలాండ్లో ఒక అడవి ఉంటుంది. అందులో చెట్లని వంకరటింకరగా పెరుగుతాయి. ఆ చెట్లు ఎలా పెరుగుతాయి అంటే ఎవరన్నా కుర్చీలో కూర్చున్నట్టు లేక ఇంగ్లీష్ అక్షరం జే ఆకారంలో పెరుగుతాయి. కిందకి వంగి మళ్లీ పైకి పెరుగుతాయి. ఒక చెట్టు కాదు రెండు చెట్లు కాదు. ఏకంగా 400 పైగా చెట్లు ఈ అడవిలోఉన్నాయి. ఈ అడవిని క్రుకెడ్ ఫారెస్ట్” (Crooked Forest) అంటారు. ఈ చెట్లు ఎందుకు అలా వంగిపోయాయో ఇప్పటికే ఎవరికి అర్థం కాదు. ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాగి తూలుతున్నట్టు ఉండే చెట్టు ఇదే

ఈ అడవి పోలాండ్ దేశంలోని గ్రిఫినో అనే ఉరికి దగ్గరలో ఉంటుంది. అక్కడ చుట్టూ ఉన్న చెట్లని నిటారుగా ఉంటాయి. కానీ ఈ చెట్లు మాత్రం ఏదో నడుము నొప్పి వచ్చినట్టు వంకరగా ఉంటాయి. మీకు ఇంకొక వింత గురించి చెప్పాలంటే, ఈ చెట్లని కూడా ఉత్తరం దిక్కే వంగిపోయి ఉంటాయి. ఈ చెట్లను చూడడానికి జనాలు ఎగబడి చూస్తారు.
ఈ చెట్లను1930 ఆ సమయంలో నాటారు అంట. కానీ ఈ చెట్టు మాత్రం ఎందుకు అలా వంకరగా ఉన్నాయి అని ఆధారం లేదు. ఈ చెట్ల గురించి ఇప్పుడు మీకు ఆసక్తికరమైన విషయాలు చెప్తా.
ఈ చెట్లు అలా వంకరగా పెరగడానికి కారణం మనుషులే అని అంటున్నారు. ఆ కాలంలో రైతులు పడవలు తయారు చేయడం కోసం మరియు గుండ్రంగా ఉండే బల్లలు తయారు చేయడం కోసం చెట్లను అలా చేశారంట. అంటే ఈ చెట్లు చిన్నగా ఉన్నప్పుడే వాటిని వంకరగా తిప్పేశారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రైతులు ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయారంట. అందుకే అప్పటినుండి ఆ చెట్లన్నీ అలాగే వంకరగా పెరిగాయి.
మరి కొంతమంది ఏమంటారు అంటే, ఆ చెట్లు చిన్నగా ఉన్నప్పుడే వాటిపై మంచు పడి ఆ చెట్లని వంకరగా పెరిగాయని కొందరు అంటారు. ఇంకా అక్కడ ఉన్నవాళ్లు రకరకాలుగా అంటారు. ఏలియన్స్ వచ్చి ల్యాండ్ అయ్యారని రకరకాల పుకార్లు పుట్టించారు.
ఈ అడవిలోకి ఎవరైనా వెళితే హర్రర్ సినిమాకు వెళ్ళినట్టే ఉంటుంది. అక్కడ ఉన్న చెట్లని ఒకే షేపులో ఒకే ఎత్తులో లో వంగి ఉంటాయి. ఎవరో కళాకారులు వచ్చి డిజైన్ చేసినట్టు ఉంటాయి. కానీ ఈ చెట్లు మాత్రం ఫోటోలు దిగడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. కారణం ఏదైనాప్పటికీ మనుషులు ఈ చెట్లను చూస్తే చాలా అనుభూతులు పొందుతారు.
తలకాయ కిందకు.. కాళ్లు పైకి

మనం ఎన్నో రకాల చెట్లను చూస్తూ ఉంటాం. సాధారణంగా ఏ చెట్టుకైనా వేర్లు భూమి లోపల ఉంటాయి. కొమ్మలు పై భాగంలో ఉండి ఆకాశం దిక్కు చూస్తూ ఉంటాయి. కానీ ఆఫ్రికా అడవుల్లో ఒక చెట్టు దీనికి విరుద్ధంగా ఉంది. అవును ఆ చెట్టు తల కిందులుగా ఉంటుంది. ఆ చెట్టును చూస్తే ఎవరో ఒక బలమైన వ్యక్తి ఆ చెట్టును పీకి, మళ్ళీ భూమి లోకి తల కిందులుగా నాటినట్టు ఉంటుంది. అందుకే దాన్ని అప్ సైడ్ డౌన్ ట్రీ’ (Upside Down Tree) అంటారు. దీని యొక్క అసలు పేరు బాయోబాబ్. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చెట్టు యొక్క ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు రాలిపోయినప్పుడు చూస్తే మాత్రం, ఆ కొమ్మలు అచ్చం వాటి వేర్ల మాదిరి కనిపిస్తాయి. ఈ ఈ చెట్టు గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే, ఈ చెట్టుకు పూర్వకాలంలో చాలా అహంకారం ఉండేదట. నేనే అందరి కంటే గొప్ప చెట్టుని అని విర్రవీగుతూ ఉండేదట. అది చూసిన దేవుడు దాని పొగరు అనచడానికి ఆ చెట్టును పట్టుకొని తల కిందులుగా భూమిలోకి పాతి పెట్టాడట. అప్పటి నుండి అది అలాగే పెరుగుతుందని అక్కడి జనాలు విశ్వసిస్తారు.
చెట్టు తలకిందులుగా ఉన్న ఈ చెట్టు వల్ల అడవిలో జంతువులకు ఉపయోగముంది. అదేమిటంటే, దీని కాండం చూస్తే మామూలు చెట్ల లాగా ఉండదు. బాగా లావుగా ఉంటుంది. చాలా అంటే చాలా లావుగా ఉంటుంది. ఎందుకలా లావుగా ఉంటుందంటే, వర్షం పడ్డప్పుడల్లా ఆ నీళ్లను వేస్ట్ పోనివ్వకుండా తన కాండంలో దాచుకుంటుందట. ఒక్క చెట్టు సుమారుగా లక్ష లీటర్ల దాకా నీటిని దాచుకుంటుంద. ఎప్పుడైనా ఎడారిలో కరువు వచ్చినప్పుడు, అక్కడున్న ఏనుగులు ఈ చెట్టు యొక్క బీరులను నమిలి అందులో ఉండే నీటిని తాగుతాయి. అప్పుడు వాటి దాహం తీరుతుంది. అందుకే దీన్ని బాటిల్ ట్రీ అని పిలవడం కూడా జరుగుతుంది.
ఈ చెట్ల యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి అంత తొందరగా చనిపోవు. ఒక్కొక్క చెట్టు దాదాపుగా 2000 నుండి 3000 సంవత్సరాల దాకా బతుకుతుంది. కొన్ని చెట్లు బాగా అంటే బాగా లావుగా ఉంటాయి. అవి ఎంత లావు ఉంటాయంటే, వాటి కాండం లోపల ఒక పెద్ద డొల్ల ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అదేమిటంటే, వీటి కాండంలో చిన్న చిన్న ఇండ్లు కూడా కట్టుకోవచ్చు. అంత లాగా ఈ కాండంలో లావు ఏర్పడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి.
ఈ చెట్టులో ఆహార పోషకాలు కూడా ఉన్నాయి. దీనికి కాసే కాయలు మామూలు కాయలు కావు. వీటిని మంకీ బ్రెడ్ అంటారు. వీటిలో విటమిన్ సి నారింజ పండులో అంటే అధికంగా ఆరు రేట్లు ఉంటుంది. అందువల్ల దీన్ని జీవ వృక్షం తో కొలుస్తారు అంట.
ఈ చెట్టు చూడడానికి చాలా వింతగా దయ్యం చెట్టు మాదిరి ఉన్న, అక్కడి మానవులకు జంతువులకు నీడనిస్తుంది. నీళ్లను కూడా అందిస్తుంది. ప్రకృతిలో ఏ చెట్టు అయినా కూడా కారణం లేకుండా పుట్టదు. అనే విషయానికి ఈ చెట్టు ఒక ఉదాహరణ చెప్పొచ్చు.
