ఆకాశం నుండి కురిసే వజ్రాల వాన – చేపల వాన! నమ్మశక్యం కాని ప్రకృతి వింతలు

diamond rain fish rain nature wonders facts telugu

ఆకాశం నుండి కురిసే వజ్రాల వాన – చేపల వాన! నమ్మశక్యం కాని ప్రకృతి వింతలు

వాన పడేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం. వర్షం చిన్న చిన్న నీటితో మరియు పెద్ద పెద్దగా పడతాది. అప్పుడప్పుడు రాళ్లు కూడా పడతాయి. కానీ కొన్ని గ్రహాల మీద ఏకంగా వజ్రాల వాన పడుతుంది. ఇదేదో సినిమా కథ కాదు.

వజ్రాల వాన నిజంగానే కురుస్తుందా? సైన్స్ చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు

ఇది సైన్స్ ముచ్చట. అసలు ఎక్కడ వజ్రాల వాన పడుతుంది. ఎందుకలా వర్షం పడుతుంది. అనే విషయం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఈ వజ్రాల వర్షం మన భూమి మీద పడదు. మన భూమికి కొన్ని కోట్ల కిలో మీటర్ల దూరం ఉన్నా నెప్ట్యూన్, యురేనస్ గ్రహాల మీద ఈ వజ్రాల వాన పడతాదంట. ఇప్పుడు సైంటిస్టులు ఏమని చెప్తున్నారు అంటే, శని గ్రహం మరియు బృహస్పతి గ్రహం మీద ఇలాగే వజ్రాల వర్షం పడే అవకాశం ఉందట.

ఈ వజ్రాలు ఎట్ల తయారవుతాయి అని మీకు ఒక సందేహం రావచ్చు. ఆకాశంలో ఎవరైనా ఉండి వజ్రాలు తయారు చేస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు. దీని వెనకాల ఒక కెమిస్ట్రీ ఉంది. ఇలా వజ్రాల వాన పడటానికి కారణం, మీదేం గ్యాస్ దెబ్బ అంట. నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాల మీద మిథెన్ గ్యాస్ పుల్లగా ఉంటుంది.

మన భూమి మీద గాలి యొక్క ఒత్తిడి ఎంత ఉంటుందో అంత కంటే లక్షల రేట్లు ఎక్కువగా ఒత్తిడి ఆగ్రహాల మీద ఉంటుందట. అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అంటే, అక్కడికి మనిషి వెళితే క్షణాల్లో అప్పడం అప్పడం అయిపోతాడు. అక్కడ అంత ఒత్తిడి ఉంటుంది. విపరీతమైన ఒత్తిడికి మరియు వేడికి మిథున్ గ్యాస్ లో ఉండే హైడ్రోజన్ మరియు కార్బన్ విడిపోతాయి.

కార్బన్ అణువులు విడిపోయాక ఒకదానికొకటి గట్టిగా అతుక్కుని ఒత్తిడికి తట్టుకోలేక అవి గట్టి పడతాయి. ఫైనల్ గా బాగా మెరిసే వజ్రాలుగా మారిపోతాయి.

ఈ విషయం వినగానే మనకి ఒకటి అనిపించొచ్చు. అదేంటంటే, అక్కడికి ఒక రాకెట్ వేసుకొని పోయి బస్తాల నిండా వజ్రాలు తెచ్చుకుందాం అని మనకు ఒక ఆలోచన రావచ్చు. కానీ అక్కడ కథ వేరే ఉంటుంది. ఆ గ్రహాలు మనకు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

వజ్రాల వాన పడినాక అవి ఆ గ్రహం యొక్క లోపలికి పోతున్న కొద్దీ వేడి బాగా పెరిగిపోతుంది. ఆ భయంకరమైన వేడికి వజ్రాలు కూడా మొత్తం కరిగిపోతాయి. అవి ద్రవ రూపంలో మారి సముద్రం వలె ప్రవహిస్తాయి. అంటే అక్కడ వజ్రాల సముద్రాలు ఉన్నాయన్నమాట.

మీకు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. అక్కడ ఉండే చలికి గాలికి ఒత్తిడికి మనిషి కాదు కదా మన రాకెట్లు కూడా అప్పడం అప్పడం నుజ్జునుజ్జుగా అయిపోతాయి.

మీకు ఒక ముఖ్యమైన సందేహం వచ్చిందా? రాలేదా? మరి ఇంత వరకు అక్కడికి ఎవరు పోలేదు కదా. వజ్రాల వాన పడుతుందని ఎలా తెలుసు. సైంటిస్టులకు ఎలా తెలుసు అని మీకు సందేహం రావచ్చు. సైంటిస్టులు అక్కడికి పోకపోయినా, వారు భూమి మీదనే ల్యాబ్ లో ప్లాస్టిక్ ని లేజర్ లైట్ లతో విపరీతమైన ఒత్తిడి పెట్టి పరీక్ష చేస్తే అందులో నుండి చిన్న చిన్న వజ్రాలు తయారయినాయి. దీన్ని బట్టి అక్కడ అంత ప్రెషర్ ఉంటుంది. అందువల్ల అక్కడ కచ్చితంగా వజ్రాల వాన పడుతుందని నిర్ణయం తీసుకున్నారు.

విశ్వం అనేది చాలా పెద్ద వింత మాయాజాలం. మన భూమి పైన ఎట్లా అయితే నీళ్లు అమృతము. అక్కడ ఆ వజ్రాలు రాళ్లు రప్పలతో సమానం. ఆ గ్రహం పైన ఎవరు మనుషులు లేరు కానీ కుప్పలు కుప్పలుగా వజ్రాలు మాత్రం పడుతున్నాయి.

నీటిలో ఉండాల్సిన చేపలు.. అసలు ఆకాశంలోకి ఎలా వెళ్లాయి

మనం చిన్నప్పుడు ఆకాశం నుండి పూల వాన కురిసింది అని మరియు బంగారం వాన పడిందని వినే ఉంటాం. కానీ ఒక్కసారిగా ఆకాశం నుండి చేపల వాన పడితే ఎలా ఉంటుంది. తినడానికి ఇదేదో పిట్టకథలే అనుకుంటున్నారా. కాదు ఇది నిజం. ప్రపంచంలో చాలా చోట్ల చాపల వాన పడ్డది. మన దగ్గర కూడా అప్పుడప్పుడు ఈ చాపల వాన పడ్డ దాఖలాలు ఉన్నాయి. అసలు మేఘాలలో చాపలు ఏ విధంగా బతుకుతాయి. అక్కడి వరకు ఎలా పోతాయి అని సందేహం రావచ్చు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఆకాశంలోకి అసలు చేపలు ఎట్లా పోతాయి అనేది ఇక్కడ అసలైన పాయింట్, చేపలకు రెక్కలు ఉండవు కదా ఎగిరిపోవడానికి మరి మేఘాల్లోకి ఎట్లా పోయినాయి. దీనికి ముఖ్య కారణం సుడిగాలి మరియు నీటి సుడిగాలి. ఎప్పుడైనా చెరువులో గాని సముద్రంలో గాని గాలి భయంకరంగా తిరుగుతుందో దాన్నే నీటి సుడిగాలి అంటారు. ఇది మామూలు గాలి లెక్క కానే కాదు. ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ లాగా పని చేస్తుంది.

ఈ సుడిగాలి నీటి మీద వచ్చినప్పుడు అది నీళ్లను చాలా గుండ్రంగా తిప్పుకుంటూ ఆకాశం వైపు గొట్టం లాగా పైకి లాగుతుంది. ఆ ఫోర్సు ఎంత గట్టిగా ఉంటుందంటే, నీళ్లతో పాటు అందులో ఉన్న చేపలు, కప్పలు, తాబేలు, పీతలు మరియు ఇతర చిన్న చిన్న జీవులు అన్నిటిని పైకి లేపుతాయి.

సుడిగాలి వేగానికి చేపలన్నీ మేఘాల్లోకి చేరిపోతాయి. గాలి వేగం అక్కడ ఉన్నంత సేపు అవి మేఘాలలో ప్రయాణం చేస్తాయి. ఒకసారి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా గాలిలో కొట్టుకుపోతాయి. అవి ఎప్పుడైతే గాలి వేగం తగ్గుతుందో లేక మేఘాలు బరువు అయితాయో అప్పుడు ఆ నీటితో పాటు ఈ చేపలు కూడా కింద పడతాయి.

మరి ఆ చేపలు బతికే ఉంటాయా అని మీరు అనుకుంటున్నారా అవును అవి బతికే ఉంటాయి. చేపలు నీటితో పాటే పైకి పోతాయి. కాబట్టి మేఘాల్లో కూడా తేమ ఉంటుంది అవి చనిపోవు. కింద పడ్డప్పుడు కూడా గంతులు వేస్తూ తిరుగుతుంటాయి.

ఒకవేళ ఆ సుడిగాలి వాటిని మరీ ఎక్కువ ఎత్తుకు తీసుకుపోతే అక్కడ ఉండే చలి వల్ల అవి గట్టుకుని పోతాయి. అప్పుడు కింద పడ్డప్పుడు ఐస్ చేపలు పడతాయి. గాలి వేగం మరి బీభత్సంగా ఉంటే మాత్రం పాపం ఆ ఫోర్స్ కి ఈ చేపలు గాలిలోనే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి.

ఈ చాపల వాన ఎక్కడెక్కడ పడుతుందంటే, ఇది ప్రపంచంలో చాలా చోట్ల జరిగింది. హోండురస్ దేశంలో యోర అనే ఊరు ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో తప్పనిసరిగా ఈ చేపల వాన పడుతుంది. అక్కడ జనం దీన్ని ఒక పండుగ మాదిరి చేసుకుంటారు. ఆ దేవుడే మాకు ఆహారం పంపించిండు అని వాళ్ళ యొక్క నమ్మకం.

మన దగ్గర కూడా ఈ చేపల వాన పడింది. కేరళలో, శ్రీలంక బార్డర్లో, అప్పుడప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాలో కూడా పల్లెటూర్లలో పొలాలలో ఉన్నట్టుండి చేపలు కనిపిస్తూ ఉంటాయి. జనాలు చాలా మంది అనుకుంటారు. ఈ చేపలు వరదలకు కొట్టుకొచ్చాయని, కానీ అది కాదు. అవి ఆకాశం నుండి పడ్డ చేపలు.

ఈ చేపలు కింద పడ్డప్పుడు మరి వీటిని వండుకొని తినవచ్చా అని మీకు సందేహం రావచ్చు. చేపలు కింద పడ్డప్పుడు అవి బతికే ఉంటే వాటిని శుభ్రంగా కడుక్కొని మంచిగా కూర చేసుకుని తినవచ్చు. కానీ చనిపోయి ఉంటే వాటి నుండి వాసన వస్తుంటే అవి మాత్రం తినకూడదు. ఎందుకంటే అవి గాలిలో ఎప్పుడైతే చనిపోతాయో అప్పుడే వాటిలోకి బ్యాక్టీరియా చేరుతుంది. అందువల్ల అలాంటి చేపలను తినకూడదు

ప్రకృతి చాలా విచిత్రమైనది. మన ఊహించని ఎన్నో రకాల అద్భుతాలు ఇందులో జరుగుతుంటాయి. ఎప్పుడైనా బాగా వర్షం పడినప్పుడు మీ ఇంటి పెరట్లో ఏదైనా చేప పిల్ల కనిపిస్తే దాన్ని ఇది వరద నీటిలో కొట్టుకొచ్చిందని తీసి పారేయకండి. ఎవరికి తెలుసు, అది ఏ మేఘం నుంచి ఊడి పడిందో అది మీ కోసమే పడి ఉంటుంది. ఇది చేపల వెనుక ఉన్న అసలు కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *