చెట్టు మొదలుకే పండ్లు కాస్తాయి! ఆకు మీద మనిషి కూర్చున్నా మునగదు! ఈ వింతలు ఎప్పుడైనా చూశారా?

jabuticaba tree giant water lily wonders

చెట్టు మొదలుకే పండ్లు కాస్తాయి! ఆకు మీద మనిషి కూర్చున్నా మునగదు! ఈ వింతలు ఎప్పుడైనా చూశారా?

మనం చిన్నప్పటినుండి చూస్తూనే ఉంటాం. చెట్టు ఏదైనా సరే దానికి పువ్వులు, కాయలు, పండ్లు అన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి. పైన కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టు మామూలు చెట్టు కాదు. ఆ చెట్టు మిగతా అన్ని చెట్టులా కాదు. వాటికి విరుద్ధంగా ఉంటుంది. ఆ చెట్టుకు పండ్లు కొమ్మలకు కాయవు. పండ్లు నేరుగా చెట్టు మొదలుకు, కాండం నిండా అతుక్కుని కాస్తాయి. పండ్లు అలా ఎందుకు కాస్తాయో, వాటి కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చూస్తే జబ్బు చేసినట్టు ఉంటది.. కానీ తింటే అమృతం

ఈ చెట్టు యొక్క ఫోటోను మొదటిసారి చూసినవాళ్లు, అయ్యో పాపం ఈ చెట్టుకి ఏదో పెద్ద జబ్బు చేసింది అనుకుంటారు. ఎందుకంటే ఆ చెట్టుకు నల్లటి గడ్డలు, బొడిపెలు వస్తాయి. చీడ పట్టినట్టు ఉంటుంది. అందువల్ల ఆ చెట్టును చూసినవారు దానిపై జాలి పడతారు.

మీకు అసలు విషయం తెలిస్తే నోరు వెళ్ళబెడతారు. ఎందుకంటే ఆ నల్లటి బొడిపెలు జబ్బు కానే కాదు. అవి అమృతం లాంటి తీయటి పండ్లు. దీన్ని జబోటికాబా (Jabuticaba) అంటారు. ఈ చెట్టును ప్రపంచం మొత్తం బ్రెజిలియన్ గ్రేప్ ట్రీ (Brazilian Grape Tree)అంటారు.

ఈ చెట్లు మన దగ్గర కనిపించవు. ఇవి దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, అర్జెంటీనా, పేరు దేశాల్లో పెరుగుతాయి. ఆ దేశాలలో ప్రతి ఇంటి పెరట్లో ఈ చెట్టు కనిపిస్తుంది. మన దగ్గర వేపచెట్టు, మామిడి చెట్టు ఎలా కనిపిస్తాయో, అక్కడ ఈ చెట్లు అట్ల కనిపిస్తాయి.

మీకు సందేహం రావచ్చు. పండ్లు కొమ్మలకు కాకుండా చెట్టు కాండానికి ఎందుకు కాస్తాయని, దాని వెనకాల ఒక పెద్ద సైంటిఫిక్ కారణం ఉంది. దీన్ని సైన్స్ భాషలో కలి ఫ్లోరి అంటారు.

ఈ చెట్టు యొక్క పండ్లు నల్లగా ఉంటాయి. కానీ పండ్ల టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పండ్లు చూడటానికి అచ్చం నల్ల ద్రాక్ష లెక్క ఉంటాయి. ఒక ప్లమ్ పండు అంతా లావుగా ఉంటాయి. ఈ పండు పైన తొక్క మాత్రం కొంచెం వగరుగా ఉన్న, లోపల గుజ్జు తెల్లగా, తీయగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి.

ఈ చెట్టు పండ్లు సంవత్సరానికి చాలా సార్లు కాస్తాయి. ఇది మామూలు చెట్లు లేక కాదు. మంచి నీళ్లు, ఎండ తగిలితే సంవత్సరానికి ఏకంగా 5 నుండి 6 సార్లు కాస్తాయి. ఈ చెట్టుకు నిండా తెల్లటి పూలు ఉన్నప్పుడు చూస్తే, ఎవరో వీటికి పౌడర్ పూసినట్టు ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ పువ్వులన్ని నల్లటి పండ్ల మాదిరి మారిపోతాయి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఒక్కో చెట్టుకు కొన్ని వందల కిలోల పండ్లు కాస్తాయి.

ఈ పండ్లు వట్టి రుచికే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది.

50 కిలోల బరువును కూడా తేలికగా మోసే ఆకు

మనకు తెలుసు కదా ఆకు అంటే ఎలా ఉంటుందనేది. ఆకు గాలికి ఊగుతుంది. నీళ్లలో వేస్తే పైకి తేలుతుంది. ఆకు మీద ఒక చిన్న రాయి వేసిన, కప్ప దుంకిన ఆకు మునిగిపోతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ ఆకు మీద ఏదైనా బరువైన వస్తువు ఉన్నా కూడా మునిగిపోకుండా ఉండటం, మీరు ఎప్పుడైనా చూశారా? అవును నిజం ఒక ఆకు మీద మనిషి కూర్చున్న సరే, అది మునిగిపోకుండా పడవ లాగా మనిషిని మోస్తుంది. ఇది మీకు నమ్మ బుద్ధి కావడం లేదు కదా. మీకు ఏదో నేను సరదాగా చెప్తున్నా అని అనుకోకండి.ఇది నిజమైన విషయం

ఈ ఆకు ఎంత పెద్దగా ఉంటుంది అంటే, మీ ఇంట్లో ఉండే డైనింగ్ టేబుల్ లెక్క ఉంటుంది. మరి ఆకు పేరు, ఆకు ఎక్కడ ఉంటుంది, ఎంత బరువు మోస్తుంది, ఎట్లా మోస్తుంది. అనే విషయాలు ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను.

ఈ ఆకు యొక్క పేరు విక్టోరియా అమెజానికా (Victoria Amazonica). ఈ పేరు వినడానికి ఒక మహారాణి పేరు లెక్క ఉంది కదా. అవును మరి, ఇది నీటి మొక్కల్లో మహారాణిగా ఉంటుంది.

మన ఊర్లల్లో ఉండే చెరువులలో ఇవి కనిపించవు. ఇవి దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో ఉంటాయి. ఇవి అక్కడ చిత్తడి నేలల్లో పెరుగుతాయి. వీటిని చూడడానికి టూరిస్టులు ఎగబడతారు. అవును మరి, ఇది ప్రపంచం లోని అన్ని ఆకుల్లో ఇదే పెద్ద ఆకు.

ఈ ఆకు యొక్క సైజు చూస్తే మన కళ్ళు బైర్లు కమ్ముతాయి. సాధారణంగా ఒక తామర ఆకు ఎంత పెద్దగా ఉంటుంది చెప్పండి. ఒక ప్లేట్ సైజు అంత ఉంటుంది. ఈ ఆకు సైజు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క ఆకు దాదాపుగా మూడు మీటర్ల వరకు ఉంటుంది. అంటే 9 నుండి 10 అడుగులు అన్నమాట. దీని వెడల్పు బాగా పెరుగుతాయి. అంటే మనం ఒక చిన్న సైజు కారు ఈ ఆకుపైన పార్క్ చేసుకోవచ్చు.

ఈ ఆకు చూడటానికి ఒక పెద్ద సైజు పళ్లెం లాగా చాలా గుండ్రంగా ఉంటుంది. ఈ ఆకు యొక్క అంచులు పైకి లేచి ఉంటాయి. ఎందుకంటే, నీళ్ళు లోపలికి రాకుండా ఒక గోడ లాగా అడ్డుకుంటాయి. అందువల్ల ఇది నీళ్ల మీద ఒక టబ్ వలె తేలుతుంది.

ఈ ఆకు అసలు మనిషిని ఎలా మోస్తుంది అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడే ఉంది ఒక అసలైన మ్యాజిక్. ఆకు కదా మనిషి కాలు పెడితే చిరిగిపోతాది అని మీరు అనుకోవచ్చు. కానీ దీని స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది.

ఈ ఆకును తిరగేసి చూస్తే అచ్చం మన మంచం నవారు లాగా ఉంటుంది. సైకిల్ చక్రం స్పోక్స్ వలె గట్టిగా ఉండే నరాలు (Ribs/Veins) కనిపిస్తాయి. ఈ నరాలు ఆకు కి ఒక ప్రేమ్ లాగా సపోర్టు ఇస్తాయి. అంతే కాకుండా ఈ నరాల యొక్క మధ్యలో గాలి సంచులు కూడా ఉంటాయి. ఈ గాలి వల్లనే ఆకును నీటి మీద బెలూన్ లాగా తెలుస్తుంది. ఒక్క ఆకు దాదాపుగా 40 నుండి 50 కిలోల బరువు మోస్తుంది. అంటే 40, 50 కిలోల బరువు గల వ్యక్తులు ఈ ఆకుపై కూర్చున్నా కూడా ఇది పైకి తేలుతూనే ఉంటుంది. కాకపోతే ఒక విషయం, బరువు ఒకే దగ్గర పడకుండా కొంచెం బ్యాలెన్స్ గా కూర్చోవాలి.

ఆకులే కాదు, దీని యొక్క పువ్వులు కూడా వింతగా ఉంటాయి. ఈ పువ్వులు రాత్రిపూట మాత్రమే విచ్చుకుంటాయి. ఈ పువ్వులు మొదటి రాత్రి తెలుపు రంగులో ఉంటాయి. రెండవ రాత్రి పువ్వు రంగు మారిపోతుంది. పింక్ లేదా ఊదా రంగులోకి మారిపోతుంది. ఈ పువ్వు దగ్గరికి పోతే అచ్చం పైనాపిల్ పండు వాసన వస్తుంది. బటర్ స్కాచ్ వాసన కూడా వస్తుంది.

ఈ ఆకు పైకి చూడడానికి స్మూత్ గా, చాలా మెత్తగా ఉంటుంది. కానీ నీళ్ల లోపల ఉండే ఆకు భాగం మొత్తం పదునైన ముళ్ళతో ఉంటుంది. ఎందువల్ల అంటే, నీళ్లలో ఉండే చేపలు కానీ, ఇతర జంతువులు కానీ, ఆకును కొరికి తినకుండా ఉండటానికి దేవుడు ఇచ్చిన ఒక రక్షణ కవచం అని మనం అనుకోవచ్చు. అందువల్ల దీని పట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *