Lyrebird Mimicry మనిషి లెక్క అరిచే పక్షి | Hoatzin Cow Bird ఆవు లెక్క నమిలే పక్షి

lyrebird mimicry, hoatzin cow bird strange facts AI Generated

మనం చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులను చూస్తూ ఉంటాం. వారు టీవీలలో మరియు స్టేజ్ మీద చేసే మిమిక్రీ ని చూసి మనం ఆశ్చర్యపోతాం.

కానీ మనుషుల్లోనే కాదు. పక్షుల్లో కూడా మిమిక్రీ చేయగల పక్షులు ఉన్నాయి. దాని పేరు లైర్ బర్డ్ (Lyrebird).

ఈ పక్షి చేసే మిమిక్రీ ని చూస్తే ఎవరైనా నోరు వెళ్ళ పెట్టాల్సిందే, అంత అద్భుతంగా చేస్తుంది. ఈ పక్షి చేసే వింత శబ్దాలు వింటే, నిజంగా అక్కడ మనిషి ఉన్నాడా లేక పక్షి ఉందా అనే సందేహం మనకు వస్తుంది.

ఈ పక్షి విషయం ఏమిటో మనం వివరంగా తెలుసుకుందాం.

Lyrebird మనిషి లెక్క అరిచే వింత పక్షి

దీని ముందు మిమిక్రీ ఆర్టిస్టులు కూడా వేస్టే. ఈ వింత పక్షి ఆస్ట్రేలియా అడవులలో ఉంటుంది. ఈ పక్షి చూస్తే కొంచెం మన అడవి కోడి మాదిరి ఉంటుంది.

తోక ముడుచుకున్న నెమలి మాదిరి కనిపిస్తుంది. ఈ పక్షి తోక చాలా పొడవుగా ఉంటుంది. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ షేపులో ఉంటుంది. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

ఈ పక్షి యొక్క ప్రత్యేకమైన టాలెంట్ ఏమిటంటే, కాపీ కొట్టడం. ఇది తను విన్న ప్రతి సౌండ్ సేమ్ టు సేమ్ దించుతుంది.

అడవిలో రకరకాల పక్షులు రకరకాలుగా అరుస్తాయి. ఈ పక్షి అన్ని రకాల గొంతులతో అరవగలదు. ఇది ఎలా అలా అరవగలుగుతుందో సైంటిస్టులకే అర్థం కావడం లేదు.

మిమిక్రీ ఆర్టిస్టులకు కూడా సాధ్యం కాని టాలెంట్

మీకు ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. ఇది కేవలం జంతువులు మరియు పక్షుల గొంతుతో మాత్రమే కాకుండా మనుషుల గొంతులా కూడా అరుస్తుంది.

మనుషులు చేసే వింత శబ్దాలను మరియు మిషిన్ల శబ్దాలను కూడా చేస్తుంది. మనుషులు ఎవరైనా అడవికి పోయి కెమెరాతో ఫోటోలు తీస్తే ఆ శబ్దాన్ని కూడా ఈ పక్షి సేమ్ టు సేమ్ చేస్తుంది.

ఇంకోటి అడవిలో రంపం మిషన్ తో చెట్లను నరికే శబ్దాన్ని కూడా భయంకరంగా చేస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే జూ పార్కులో ఉండే లైర్, పక్కన కడుతున్న బిల్డింగ్ నుండి వచ్చే సుత్తి దెబ్బల సౌండ్ మరియు డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ కూడా నేర్చుకుందట.

ఆడ పక్షులను ఆకర్షించడానికి చేసే మ్యాజిక్

ఈ పక్షి అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని మీకు సందేహం రావచ్చు. దీని వెనకాల ఒక ప్రేమ కథ ఉంది. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఈ వేషాలన్నీ వేస్తాయట.

ఇవి టాలెంట్ ను చూపెట్టుకోవడానికి బిల్డప్లు ఇస్తాయంట. ఏ మగ పక్షి అయితే ఎక్కువ సౌండ్లతో చేస్తుందో ఆ పక్షికి ఆడ పక్షులు ప్రేమలో పడతాయట.

ఇది కూడా చదవండి: [మొసళ్లను తినే కొంగ, గాలిలో నిద్రపోయే పక్షి]

Hoatzin ఆవు లెక్క నమిలే కంపు పక్షి

ప్రపంచంలో చాలా రకాల అందమైన పక్షులు ఉన్నాయి. కొన్ని పక్షులు చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి. మరికొన్ని పక్షులు చూడటానికి కాస్త భయంగా ఉంటాయి.

కానీ కొన్ని పక్షులు మనం ముక్కు మూసుకునే విధంగా ఉంటాయి. ఆ పక్షి పేరు హోయాట్జిన్ (Hoatzin). ఈ పక్షి దగ్గరికి పోగానే ఒకటే కంపు కొడుతుంది.

మనం ఎవరైనా దీని దగ్గర పోతే ముక్కు మూసుకోవాల్సిందే అంత కంపు కొడుతుంది. ఈ పక్షి చూడడానికి రాక్ స్టార్ లాగా చాలా అందంగా ఉంటుంది.

కానీ ఎవరైనా దీని దగ్గరకు పోవాలంటే సాహసం చేయాల్సిందే. దీనిని ఎగిరే ఆవు అని కూడా సైంటిస్టులు పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారు అని మీకు తెలిస్తే, మీరు పక పక నవ్వుతారు.

ఎగిరే ఆవు అని ఎందుకు పిలుస్తారు

ఈ పక్షి దాని అసలు పేరు కంటే, స్టింక్ బర్డ్ గానే ఫేమస్ అయింది. దీని దగ్గర నుండి అచ్చం ఆవు పేడ వాసన వస్తుందట.

అలా ఎందుకు వస్తుందంటే, ఇది మిగతా పక్షుల లెక్క పురుగులు, పండ్లు తినదు. ఈ పక్షి కేవలం ఆకులను మాత్రమే తింటుందట. మీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా? ఇది నిజం.

మనం ఆవులను చూస్తూనే ఉంటాం కదా అవి గడ్డిని తిని అరిగించుకుంటాయి. ఈ పక్షి కూడా తను తిన్న ఆకులను తన పొట్టలోనే పులియ పెట్టుకుంటుంది.

అందువల్లనే, ఇది నోరు తెరవగానే కంపు వాసన వస్తుంది. ఇది పక్కకు వచ్చినా కూడా భయంకరమైన కంపు వస్తుంది. మీకు ఇంకొక విషయం తెలిస్తే మతిపోతుంది.

ఈ పక్షి పిల్లలు పుట్టినప్పుడు వాటి రెక్కల మీద రెండు పదునైన గోర్లు ఉంటాయట. కోటి సంవత్సరాల కిందట డైనోసార్లకు ఇలానే రెక్కల మీద గోర్లు ఉండేవట. ఇప్పుడు ఈ పక్షికి ఇలా ఉన్నాయట.

ఎందుకు ఇలా ఉన్నాయంటే, ఈ పక్షులు ఎక్కువగా నీళ్ల పక్కన ఉన్న చెట్ల పైన గూడు కడతాయి. ఒకవేళ వాటి పిల్లలు పట్టుతప్పి నీటిలో పడిపోతే, ఈత కొట్టుకుంటూ వచ్చి రెక్కల మీద తన గోర్లతో చెట్టును పట్టుకుని మళ్లీ పైకి ఎక్కుతాయి.

పక్షులు పెద్దయ్యాక వాటి గోర్లు రాలిపోతాయట. ఇది వినటానికి చాలా వింతగా ఉంది కదా.

కంపు వాసనే దీనికి శ్రీరామరక్ష

ఈ పక్షి తల మీద జుట్టు నిలుచొని ఉంటుంది. స్పైక్ హెయిర్ స్టైల్ మాదిరి ఉంటుంది. కళ్ళ చుట్టూ ముదురు నీలం రంగు ఉండి, కళ్ళు ఎర్రగా ఉంటాయి.

లుక్ పరంగా ఇది సూపర్ అని చెప్పొచ్చు. మొత్తానికి దీని మొఖం చూస్తే, ఏదో ఫ్యాషన్ షో కి తయారు అయినట్టు ఉంటుంది. పక్షులు అన్ని దాదాపుగా ఆకాశంలో ఎగురుతాయి.

కానీ ఈ పక్షి మాత్రం ఆకాశంలో ఎగరలేదు. ఎందువలన అంటే, తిన్న ఆకులు దాని పొట్టలోనే నిలువ ఉంటాయి. అప్పుడు దీని పొట్ట చాలా బరువుగా ఉంటుంది.

అందువల్ల ఇది గాలిలోకి ఎగరలేదు. ఈ పక్షి అతి కష్టం మీద ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు దుంకుతుంది. కానీ మిగతా పక్షుల మాదిరి ఆకాశంలో ఎగరలేదు.

మీకు నవ్వు తెప్పించే ఇంకొక విషయం చెప్తాను. అదేమిటంటే, దీని కంపు వాసనే దీనికి మేలు చేస్తుంది. అది ఎలా అంటే, మనుషులు గాని మరియు ఇతర జంతువులు కానీ దీన్ని తినటానికి ఇష్టపడవు.

దీన్ని తినడం కంటే ఆకలితో చచ్చింది నయం అనుకుంటాయి. ఆ విధంగా దీని కంపు వాసన దీనికి శ్రీరామరక్ష అయింది.

మిమిక్రీ చేసే ఈ పక్షి, కంపు కొట్టే ఆ పక్షి గురించి తెలిశాక మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *