కడుపులో గాజులు | నిప్పులతో స్నానాలు | మెడ చుట్టూ మీసాలు : భారత దేశపు ముగ్గురు వింత మొనగాళ్ల ముచ్చట్లు.

కడుపులో గాజులు | నిప్పులతో స్నానాలు | మెడ చుట్టూ మీసాలు : భారత దేశపు ముగ్గురు వింత మొనగాళ్ల ముచ్చట్లు.

మన దేశంలో వింత ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నట్టు, వింత మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు చేసే పనులు చూస్తే ఎవరికైనా మతిపోతుంది. వారిలో కొంత మంది తమ పూర్వీకుల ద్వారా వస్తున్న ఆచార సంప్రదాయాలుగా కొన్ని సాహసాలు చేస్తే, మరి కొంత మందికి వింత పనులు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. మతిపోయే సాహసాలు చేసే ముగ్గురు మొనగాళ్లు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. నిప్పులతో స్నానం చేసే మొనగాడు

అతడు సినిమాల ఒక డైలాగ్ ఉంటది కదా అదే, నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావ్ అని, కానీ పంజాబీ కి చెందిన కన్వాల్జీత్ సింగ్ అనే మొనగాడు నిప్పులతో పెద్ద ఆటనే ఆడుతున్నాడు. ఆ ఆటలను చూస్తే మనకు కళ్ళు బైర్లు కమ్ముతాయి. మామూలుగా మనం కొంచెం అగ్గి దగ్గరికి పోతే, ఆ అగ్గి సెగ కు అబ్బో అని వెనక్కి జరుగుతాం. కానీ పంజాబ్ కు చెందిన ఈ కన్వాల్జీత్ సింగ్ మాత్రం నిప్పులని నెత్తిమీద పోసుకుంటాడు.

పెద్ద ఇనుప గిన్నెలో బొగ్గులు వేసి, అవి ఎర్రగా సెగలు గక్కే దాకా మండిస్తాడు. అట్లా మండుతున్న ఎర్రటి నిప్పు కణాలను, బకెట్ లోని నీళ్లను పోసుకొని స్నానం చేస్తున్నట్టు, నెత్తి మీద, ఒంటిమీద పోసుకుంటాడు. ఆ నిప్పులను ఒంటిమీద పోసుకుంటూ ఉంటే, చూసే జనాలకు మాత్రం కళ్ళు బైర్లు కమ్ముతాయి. అయినా కూడా ఆయనకు ముఖం మీద చిరునవ్వు మాత్రం పోదు.

అసలు ఆయనకు నొప్పి అనేది తెలియదు. ఇది ఎట్లా సాధ్యం అనుకుంటున్నారా మీరు? ఆయనకు ఏమైనా మంత్రాలు వచ్చా అని మీకు అనిపిస్తుందా ? అలా అనుకుంటే మీరు మాత్రం తప్పకుండా పప్పులో కాలేసినట్టే, ఆయన గిట్ల ఎందుకు చేస్తుంటే సిక్కుల సంప్రదాయ యుద్ధ విద్య అయిన ఘట్క లో భాగం అంట. మీకు ఒక సందేహం రావచ్చు. మరి నిప్పులను ఒంటిమీద నెత్తిమీద పోసుకుంటే నొప్పి తెల్వదా అని, అలా తెలవకుండా ఆయన మనసును ఏకాగ్రతలో ఉంచి ఆ పని చేస్తాడంట.

ఈయన మరికొన్ని భయంకరమైన పనులు కూడా చేస్తాడంట. మండుతున్న నిప్పులను నోట్లో వేసుకొని నమ్ముతాడు. కంటి రెప్పలకు కొక్కిళ్లు తగిలించుకొని బరువైన సామాన్లను గుంజుతాడు. కార్ కింద పడుకుంటాడు నిండుగా మనసులో ఉన్న కారుఈయన పొట్ట మీది కేలి పోతున్న ఏమి కాదు. ఆయన పేరు కోసం ఇట్లా చేయడం లేదు అంట. తన పూర్వీకుల కాలం నుండి వస్తున్న సిక్కుల సంప్రదాయ యుద్ధ కళను ప్రపంచానికి తెలవాలని ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు.

2. ప్రపంచాన్ని షేక్ చేసిన రాజస్థాన్ మీసాల వీరుడు

మగవారికి మీసం ఉండడం అందం మరియు విలువ లాంటిది. తమకు నచ్చిన మాదిరి మగవారు తమ మీసాలను పెంచుకుంటారు. కానీ ఒక మొనగాడు మాత్రం ఏకంగా 14 అడుగుల మీసాన్ని పెంచిండు. అతనే రామ్ సింగ్ చౌహన్. ఇంత పెద్ద మీసాన్ని పెంచడం అంటే ఆషామాసి ముచ్చట కాదు. దానికి చాలా ఓపిక మరియు ధైర్యం ఉండాలి. మన తోటోడు మన మీసం గురించి మాట్లాడితే మనకెంతో పౌరుషం వస్తుంది. మరి 14 అడుగుల మీసం పెంచిన ఈయనకు ఇంకెంత పౌరుషం ఉండాలి. అందుకే ఈయన ప్రపంచంలోనే అతి పెద్ద మీసం ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు కొట్టిండు. అసలు ఈ మీసం విషయం ఏంటంటే ఈయన 1970 నుండి తన మీసాన్ని కత్తిరించలేదు. అది పెరిగి పెరిగి ఇప్పటికే 14 అడుగుల కన్నా ఎక్కువ ఉంది.

మరి అంత పెద్ద మీసాన్ని చూసుకోవడం అంటే తమాషా ముచ్చట కాదు. మనం నెత్తిమీద జుట్టుకే గంటలకు కొద్దిగా సమయం పెడతాం. మరి అంత పొడవున్న ఆయన మీసానికి ఎన్ని గంటల సమయం పడుతుందో, ఎంత కష్టపడాలి. ఆయన మీసాన్ని శుభ్రం చేసి నూనె పెట్టి దువ్వటానికి రెండు గంటల సమయం పడుతుంది. అంత పెద్ద మీసం ఉన్నప్పుడు చూసేటోళ్ళకు మంచిగా మెరుస్తూ కనబడాలి కదా, అందుకోసం ఆయన బాదాం నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, వంటివి పెడతాడు. అంతా పెద్ద మీసాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన నడుస్తున్నప్పుడు ఆ మీసం కాళ్ళ కింద పడకుండా మీసాన్ని తన మెడ చుట్టూ చుట్టుకుంటాడు. పొరపాటున కూడా ఆ మీసం కాళ్ళ కింద పడితే ప్రాణం పోయినంత పని అవుతుందట.

ఈ మీసం పుణ్యమా అని ఈయన సినిమా నటుడు కూడా అయ్యాడు. ఈయనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా ఈయన నటించాడు. ఈయన మీసం గురించి ఏమంటాడంటే మీసం మగాడికి ఒక నగ లాంటిది అంటాడంట. అది పెంచడం ఒక పెద్ద తపస్సు అని ఈయన ఉద్దేశం. గిన్నిస్ బుక్ వాళ్ళు ఈయనకు సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు ఆయన మస్తు సంతోష పడిండు. రాజస్థాన్ టూరిజం వాళ్లకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్క మారిపోయిండు. ఇంత పెద్ద మీసాన్ని పెంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు అంటే, ఆయన ఓపికకు దండం పెట్టాలి.

3. గాజు ముక్కల టిఫిన్ తినే వింత మనిషి

మనోజ్ కుమార్ అబ్బో ఈయన చేసే పని చూస్తే, మనకు నోట్లో నుంచి రక్తం వస్తుందా అని భయమేస్తుంది. మామూలుగా మనకు చేతికి కానీ, కాలికి కానీ, చిన్న గాజు ముక్క గుచ్చుకుంటే చాలా నొప్పి అనిపిస్తుంది. కానీ ఈయనకు కాళ్ళకు చేతులకు గుచ్చుకోవడం కాదు. గాజు ముక్కలనే పరపరా నమిలి మింగేస్తాడు.

మనం రోజు ఇడ్లీ, పూరి, వడా, లాంటి టిఫిన్లు తింటాము. కానీ ఈయన మాత్రంఎలక్ట్రిక్ బల్బులను నోటితో పటపట కోరిక చిన్న చిన్న ముక్కలుగా నమిలి మింగేస్తాడు. ఈయన ఇలా చేస్తుంటే చూసే వాళ్లకు మాత్రం నోట్లో నుంచి రక్తం వస్తుందేమో అని చాలా భయపడతారు. కానీ ఆయనకు మాత్రం ఏమి కాదు. మామూలుగానే ఉంటాడు.

ఆయనకు ఈ అలవాటు 20 సంవత్సరాల నుండి ఉందట. మొదట్లో సరదాగా మొదలు పెట్టాడంట. కానీ అదొక పిచ్చిగా మారిపోయింది. ఇప్పటి వరకు కొన్ని వేల బల్బులు మరియు గాజు గ్లాసులు మింగిండు. గాజు ముక్కలు కడుపులోకి పోతే పేగులు తెగి ప్రాణాలకు ముప్పు వస్తుంది. కానీ ఈయనకు అన్ని వేల గాజు ముక్కలు తన కడుపులోకి పోయిన ఆయనకు మాత్రం ఏమి కాలేదట. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఈయన ఏమంటాడంటే గాజు ముక్కలు తింటుంటే చాలా రుచిగా ఉంటుంది అంటాడు. గాజు ముక్కలు తిన్న ఆయనకు ఎప్పుడు కడుపు నొప్పి రాలేదని, ఏమి కాలేదని, చాలా సల్లగా చెప్తుండు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *