ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు | ఇంద్రధనస్సు చెట్టు! ఇవి గ్రాఫిక్స్ కాదు పచ్చి నిజం

tree of 40 fruit rainbow eucalyptus facts

ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు | ఇంద్రధనస్సు చెట్టు! ఇవి గ్రాఫిక్స్ కాదు పచ్చి నిజం

మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంటాం. ఏ చెట్టుకు ఆ కాయలే కాస్తాయి. మామిడి చెట్టుకు మామిడి కాయలు కాస్తాయి. చింత చెట్టుకు చింతకాయలు కాస్తాయి. అది చాలా సహజం. కానీ ఒకే చెట్టుకు అన్ని రకాల కాయలు కలిపి కాస్తే ఎలా ఉంటది.

ఇది మ్యాజిక్ కాదు మనిషి సృష్టించిన అద్భుతం

ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వింత చెట్టు అమెరికాలో ఉన్నది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ఒక్క చెట్టుకే అన్ని రకాల పండ్లు కలిపి కాస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 రకాల పండ్లు కాస్తాయి. ఈ విషయం మీరు నమ్మడం లేదు కదా. అవును ఇది పచ్చి నిజం. దీనిని Tree of 40 Fruit అంటారు. ఎందుకలా అన్ని రకాల కాయలు కలిపి కాస్తాయి. మరి ఆ చెట్టు యొక్క అసలు కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మామూలుగా మన చుట్టు పక్కల ఉండే చెట్లకు ఏ చెట్టుకు ఆకాయలే కాస్తాయి. కానీ అమెరికాలో ఉండే సామ్ వాన్ అకెన్’ (Sam Van Aken) అనే ఒక ప్రొఫెసర్ కు ఒక ఆలోచన వచ్చింది. అన్ని రకాల పండ్లు ఒకే చెట్టుకు కాస్తే ఎలా ఉంటుంది. అని ఆలోచన చేశారు. ఆలోచన చేశారో లేదో అంతే, తన ప్రయోగం మొదలుపెట్టారు. ఆయన అప్పుడు పీచు పండ్లు, రేగు పండ్లు, చెర్రీలు, ఆప్రికాట్లు, బాదం, ఇలా గింజ గట్టిగా ఉండే 40 రకాల పండ్ల యొక్క కొమ్మలను తీసుకొని వచ్చి ఒకే చెట్టు మీద బతికించాడు. అంతే ఆ చెట్టు పెరిగి పెద్దదై 40 రకాల పండ్లు కాస్తుంది.

ఇది ఏం మ్యాజిక్ కాదు. అలాగని గ్రాఫిక్స్ కూడా కాదు. ఇది పక్కా సైన్స్ ముచ్చట. మన రైతులు మామిడి చెట్టుకి అంటు కట్టడం చేస్తారు కదా. అదే పద్ధతిని ఆయన అనుసరించాడు.

వేరు వేరుగా ఉండే చెట్ల యొక్క కొమ్మలన్నీ తీసుకొచ్చి, ప్రధాన చెట్టుకి కాండానికి చాలా జాగ్రత్తగా అతికిస్తారు. అది మెల్ల మెల్లగా ఆ చెట్టు తోని కలిసిపోయి పెరుగుతాయి. ఈ పద్ధతి ద్వారానే ఆ ప్రొఫెసర్ 40 రకాల కొమ్మలను అతికించి ఈ అద్భుతాన్ని చేశాడు. ఒక్కొక్క చెట్టు తయారు కావడానికి దాదాపుగా 5 సంవత్సరాల సమయం పట్టిందట.
ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎండాకాలం వచ్చిందంటే చాలు పండ్లతోని నిండిపోతుంది. కానీ అసలైన అందం ఎప్పుడొస్తుందా మీకు తెలుసా. వసంతకాలం వచ్చినప్పుడు ఈ చెట్టుకు పూత వస్తుంది. ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క రంగులో పూస్తుంది. కొన్ని పింక్ కలర్, కొన్ని ఎరుపు కలర్, కొన్ని వైట్ కలర్, ఇట్లా చెట్టు మొత్తం రంగు రంగులుగా మారిపోతుంది. దాన్ని చూస్తే ప్రతి ఒక్కరు అబ్బా ఈ చెట్టు ఏంటి ఇంత వింతగా ఉంది అనుకుంటారు.

మామూలుగా మన ఇంటి పెరట్లో ఎక్కువ స్థలం ఉండదు. ఒక్కొక్క పండుకు ఒక్కొక్క చెట్టు పెట్టాలంటే ఎంతో కష్టం అవుతుంది. కానీ ఇలాంటి టెక్నాలజీ ఉంటే పెరట్లో ఒక్క చెట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఏ సీజన్లో కావాల్సిన పండ్లన్నీ ఆ సీజన్లో మన చేతికి దొరుకుతాయి. మనం ప్రత్యేకంగా మార్కెట్టుకు పోయి కొనాల్సిన అవసరం లేదు.

ఎవరో పెయింటింగ్ వేసినట్టుంది కదా? కానీ ఇది న్యాచురల్

మనం రోడ్ల పక్కన పొడవుగా పెరిగే నీలగిరి చెట్లను చూస్తూనే ఉంటాం. నీలగిరి ఆకులను నలిపితే జండుబాం వాసన వస్తుంది. కాండం ఏమో తెల్లగాను, బూడిద రంగులోను సదాసీదాగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే చెట్టు మాత్రం మామూలు చెట్టు కాదు. ఈ చెట్టుని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ చెట్టు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఆర్టిస్టు వచ్చి బ్రష్ పట్టుకుని రంగు రంగుల పెయింట్ వేసినట్టు ఉంటుంది. ఈ చెట్టు పేరు రెయిన్‌బో యూకలిప్టస్” (Rainbow Eucalyptus). తెలుగులో దీన్ని ముద్దుగా ఇంద్రధనస్సు చెట్టు అని పిలుచుకోవచ్చు. మరి దీని కథ ఏంటో, ఎందుకలా రంగు రంగులుగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఈ చెట్టుకు అసలు ఈ రంగులు ఎలా వచ్చాయంటే, ఇది న్యాచురల్ చెట్టు. కానీ ఈ చెట్టును చూస్తే మాత్రం అలా అనిపించదు. ఎవరో వచ్చి రంగులు పూసినట్టు లేక గ్రాఫిక్స్ లాగా ఉంటుంది. మనం కళ్ళతో చూసింది కాకుండా వాస్తవాన్ని నమ్మాలి. ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీని మీద ఉండే బెరడు అంటే పై పోరా సంవత్సరానికి ఒకసారి ఓడిపోతుంది. అయితే ఆ మొత్తం ఒకసారి ఊడిపోకుండా కొంచెం కొంచెం గా వేరు వేరు సమయంలో ఊడిపోతుందంట.

ఈ చెట్టు యొక్క పాత బెరడు ఊడిపోగానే లోపల నుండి లేత ఆకుపచ్చ రంగు బయటకు వస్తుంది. ఆకుపచ్చ రంగు గాలి, ఎండ తాకగాని మెల్లగా ఊదా రంగులోకి మారుతుంది. మరి కొన్ని రోజులకు అది ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ తర్వాత మళ్లీ నారింజ రంగులోకి మారుతుంది. చివరకు బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది.

ఈ విధంగా చెట్టు మీద బెరడు వేరు వేరు దశల వారీగా ఉండటం వల్ల మనకు ఆకుపచ్చ, నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులు కలిసిపోయినట్టు అచ్చం ఇంద్రధనస్సు లాగా కనిపిస్తుంది. అందుకే దీనికి ఇంద్రధనస్సు చెట్లు అని పేరు వచ్చింది.

సాధారణంగా మన దగ్గర కనిపించే నీలగిరి చెట్లు ఆస్ట్రేలియా నుండి వచ్చినవే. కానీ ఈ రంగుల చెట్లు మాత్రం ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, న్యూ గినియా వంటి దట్టమైన అడవుల్లో పెరుగుతాయి. ప్రస్తుతానికి ఇప్పుడు అమెరికా వంటి దేశాల్లో కూడా పార్కుల్లో అందం కోసం ఈ చెట్లను పెంచుతున్నారు.

ఈ చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీని ఉపయోగం కూడా చాలా ఉంటుంది. దీని యొక్క కలపను కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. తెల్లటి పేపర్ కోసం ఈ చెట్టు యొక్క గుజ్జు చాలా ఉపయోగపడుతుంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇంత అందంగా గుండె చెట్టు నరుకుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. పేపర్ కోసం ఇంత అందమైన చెట్టు నరికేస్తారా అని అనిపించవచ్చు.

మన దగ్గర ఉండే నీలగిరి చెట్టు యొక్క ఆకులను నలిపితే ఒక ఘాటైన వాసన వస్తుంది. కానీ ఈ రంగుల చెట్టు ఆకులకు అంతా ఘాటైన వాసన ఉండదు. ఇది ముఖ్యంగా అందం కోసమే పుట్టిందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *