Walking Palm Tree నడిచే చెట్టు | Dancing Plant నాట్యం చేసే మొక్క

walking palm tree, dancing plant AI Generated

చెట్లు ఒకే దగ్గర స్థిరంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. చెట్ల యొక్క వేర్లు భూమిలో బలంగా పాతుకుని ఉండటం వలన అవి ఒకే దగ్గర స్థిరంగా ఉంటాయి.

గాలి వస్తే చెట్ల కొమ్మలు, ఆకులు ఊగుతాయి. అంతే కానీ, చెట్లు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి పోవు. కానీ ఒక చెట్టు మాత్రం ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి నడుచుకుంటూ పోతుంది.

మీకు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? అవును ఇది నిజం. ఈ చెట్టు పేరు వాకింగ్ పామ్ ట్రీ (Walking Palm Tree) అంటారు.

ఈ చెట్టు అసలు ఎలా ఉంటుంది? ఇది నిజంగానే మనుషుల లాగా నడుస్తాదా? అసలు ఈ చెట్టు కథ ఏంటి అనే విషయం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Walking Palm Tree నడిచే చెట్టు వెనుక ఉన్న అసలు కథ

ఈ చెట్టు యొక్క అసలు పేరు సోక్రటీ ఎక్సోరిజా Socratea exorrhiza. కానీ దీన్ని అందరూ ముద్దుగా నడిచే చెట్టు అని పిలుస్తారు.

ఈ చెట్టు చూడడానికి మామూలుగా తాడిచెట్టు, కొబ్బరి చెట్టు లాగానే పొడుగ్గా ఉంటుంది. కానీ దీని వేర్లు మాత్రం భూమి లోపల కాకుండా భూమి పైకి ఉంటాయి.

అందువల్ల చెట్టుకు కాళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ చెట్టు మన దగ్గర ఉండదు. ఇది లాటిన్ అమెరికా దేశాలలో ఉంటుంది.

అమెజాన్ అడవుల్లో ఈ చెట్లు ముఖ్యంగా ఉంటాయి. ఈక్వెడార్ దేశంలో కూడా ఇవి చాలా కనిపిస్తాయి.

నడిచే చెట్టు అసలు ఇది ఎలా సాధ్యం

ఈ చెట్టు అసలు ఎలా నడుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీని నడక వెనకాల ఒక పెద్ద సైన్స్ ఉంది. అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి.

అప్పుడు చిన్న చిన్న చెట్లకు ఎండ సరిగ్గా తగలదు. చెట్లు బతకాలంటే తప్పనిసరిగా ఎండ కావాలి. అందుకోసం ఈ చెట్టు ఒక తెలివైన పని చేస్తుంది.

ఈ చెట్టు ఎటువైపు అయితే ఎండ బాగా వస్తుందో, అటువైపు నుండి తన కాండంతో కొత్త వేర్లను పుట్టిస్తుంది.

కొత్త వేర్లు బలంగా భూమిలో పాతుకోగానే వెనుక వైపు ఉన్న పాతవేర్లు మెల్లగా చచ్చిపోతాయి. ఈ విధంగా ముందున్న వేర్ల మీద ఆనుకుని, వెనుక ఉన్న వేర్లను వదిలేసుకుంటూ చెట్టు మెల్లమెల్లగా ముందుకు జరుగుతుంది.

ఎండ కోసం ప్లేస్ మార్చుకునే తెలివైన చెట్టు

మనం నడిచినట్టు ఈ చెట్టు తొందరగా నడవదు. ఇది సంవత్సరానికి 20 మీటర్ల దాకా జరుగుతుంది. ఈ విషయాన్ని అక్కడ ఉండే జనాలు చెప్తున్నారు.

కానీ సైంటిస్టులు ఏమని చెప్తున్నారు అంటే ఇది పూర్తిగా నడవదు అంటున్నారు. కానీ ఎండ కోసం అటు ఇటు వంగుతుంది. సైంటిస్టులు దాని వేర్లు అలా కనిపిస్తాయని అంటున్నారు.

ఏ విషయం ఏమైనా తనంతట తానే ప్లేస్ మార్చుకునే శక్తి ఈ చెట్టుకు ఉన్నట్టే లెక్క అన్నమాట. అమెజాన్ అడవులలో ఉండే గిరిజనులు ఈ చెట్టును చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు.

దీని కాండం చాలా గట్టిగా ఉంటుంది. అందువల్ల ఇల్లు కట్టుకోవడానికి, టేబుల్ తయారు చేసుకోవడానికి వాడుతారు. దీని పండ్లు కూడా తింటారు.

ఈ చెట్టు వేర్లను ఉడకబెట్టి ఆ నీళ్లను కొన్ని జబ్బులకు మందులుగా కూడా తాగుతారంట. లోకంలో ఎన్నో రకాల వింతలు ఉంటాయి అనడానికి ఈ చెట్టు ఒక ఉదాహరణ.

చెట్టు కూడా తను బతకడానికి ఎండ కోసం ఆరటపడి ప్లేస్ మార్చుకుంటుంది. ఈ విషయం చాలా గొప్ప విషయం. ఈ చెట్టును చూస్తే బ్రతకడానికి కష్టపడాలి అనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: [మాంసం తినే మొక్క, సిగ్గుపడే మొక్క, గాలిలో బతికే మొక్క]

Dancing Plant సంగీతానికి నాట్యం చేసే మొక్క

మనం ఇందాక నడిచే చెట్టు గురించి మాట్లాడుకున్నాం. ఆ చెట్టు ప్లేస్ మారుతుందని తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మొక్క దానికి మించి ఉంటుంది.

మనుషులు నాట్యం చేయడం చూశాం. కానీ మొక్క నాట్యం చేస్తే ఎలా ఉంటుంది? అవును ఇది నిజం. ఒక మొక్క నాట్యం చేస్తుంది.

మనం డప్పు కొట్టిన లేక పాట పాడిన తాళానికి తగ్గట్టు, ఇది ఆకులను ఆడిస్తుంది. డాన్స్ చేస్తుంది. అందుకే దీన్ని నాట్యం చేసే మొక్క (Dancing Plant) అంటారు.

ఈ మొక్క పాట వినగానే ఎందుకు ఆకులను ఆడిస్తుంది, ఎందుకు డాన్స్ చేస్తుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టెలిగ్రాఫ్ ప్లాంట్ అని పేరు ఎందుకు వచ్చింది

ఈ మొక్క యొక్క పేరు టెలిగ్రాఫ్ ప్లాంట్ Telegraph Plant. దీనిని సైంటిస్టులు కొడారియోకాలిక్స్ మోటోరియస్ Codariocalyx motorius అని పిలుస్తారు.

మొక్క ఏదో విదేశాల నుండి వచ్చింది కాదు. ఇది మన ఆసియా ఖండంలోనే పుట్టింది. మరీ ముఖ్యంగా మన భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా అడవులలో ఇది ఎక్కువగా కనబడుతుంది.

ఈ మొక్క చూడడానికి చిన్న పొద మాదిరి కనిపిస్తుంది. నిలువుగా పెరుగుతుంది. ఇది ఏ విధంగా నాట్యం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దీనికి ఉండే ఆకుల అమరికనే దీని ప్రత్యేకత. ప్రతి పెద్ద ఆకు పక్కనే రెండు చిన్న చిన్న ఆకులు కూడా ఉంటాయి. ఆ చిన్న ఆకులే అసలు కథ నడిపిస్తాయి.

ఈ మొక్క పక్కన ఎవరైనా గట్టిగా మాట్లాడిన, పాటలు పెట్టిన ముఖ్యంగా ఎక్కువ సౌండ్ వస్తే చాలు ఈ చిన్న ఆకులు బాగా గిరగిరా తిరుగుతాయి. పైకి కిందికి ఊగుతూనే ఉంటాయి.

ఉదయం ఎండ రాగానే ఈ ఆకులు కిందికి పైకి కదులుకుంటూ ఎండను వెతుక్కుంటాయి. రాత్రిపూట దీని ఆకులు కిందకి వాలిపోయి పడుకున్నట్టు అవుతాయి.

పాతకాలం నాటి టెలిగ్రాఫ్ మెషీన్ లాగా, అది ఎట్లా టకటక మని కొట్టుకుంటుందో, దీని ఆకులు కూడా అదే విధంగా కదులుతాయి. అందువల్ల దీన్ని టెలిగ్రాఫ్ ప్లాంట్ అని పేరు పెట్టారు.

ఇది మామూలు కలుపు మొక్క కాదు ఒక వింత

ఇది ఎందుకు ఇట్లా కదులుతుందంటే దీని వెనక ఒక సైన్స్ ఉంది. ఆకుల మొదట్లో ఉండే కణాలలో నీటి యొక్క ఒత్తిడి నిమిష నిమిషానికి మారిపోతూ ఉంటుంది.

మారినప్పుడల్లా ఆకులు కదులుతూ ఉంటాయి. ఇది ఎండను ఎక్కువగా లాక్కోవడానికి ఈ చెట్టు కష్టపడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు.

ఫేమస్ సైంటిస్టు అయినా చార్లెస్ డార్విన్ కూడా ఈ మొక్కను చూసి ఫిదా అయిపోయారు. దీని మీద ప్రయోగాలు కూడా చేశారు. మొక్క వల్ల ఏమైనా లాభమా అంటే, అవును దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి.

ఆయుర్వేదంలో దీని వేర్లను, ఆకులను వాడుతారు. దీన్ని చాలా మంది ఇంట్లో కుండీలలో పెంచుకుంటారు. ఇంట్లో సౌండ్ చేస్తుంటే, పాటలు పాడుతుంటే, దీని ఆకులు కదులుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది.

సంగీతానికి రాళ్లు కరుగుతాయని అంటారు కదా? కానీ మొక్కలు కూడా డాన్స్ చేస్తాయని ఇది నిరూపించింది. మీరు ఎప్పుడైనా నర్సరీకి వెళితే అక్కడ ఈ మొక్క దొరుకుతుందేమో అడగండి.

దీన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. గమనిక: మీరు పైన ఉన్న ఫోటో చూడగానే, అరే ఇది మన ఇంటి పెరట్లో ఉన్న పిచ్చి మొక్క లాగా ఉంది అని అనుకోకండి.

ఇది చూడటానికి చింతచెట్టు ఆకు లాగా, గట్ల మీద పెరిగే కలుపు మొక్క లాగా ఉంటుంది. కానీ ఇది వేరు అది వేరు. మన ఊర్లో ఉండే మొక్కలైతే కేవలం గాలి వస్తేనే ఊగుతాయి.

కానీ ఈ మొక్క అలా కాదు. దీనికి గాలి లేకున్నా కేవలం చప్పుడు చేస్తేనే చాలు, దానంతట అదే ఊగుతూనే ఉంటుంది. అందుకే దీన్ని వింత అన్నారు.

మీకేమనిపిస్తుంది

మనుషుల్లా నడిచే ఈ చెట్టు, డాన్స్ చేసే ఈ మొక్క గురించి తెలిశాక మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *