Yubari King Melon ఒక్క పండు రేటు 30 లక్షలు | నిమ్మకాయ తింటే లడ్డు తిన్నట్టే

yubari king melon, miracle fruit AI Generated

మనం సాధారణంగా మార్కెట్లో కానీ, రోడ్డు పక్కన కానీ పండ్లు కొంటూ ఉంటాం. ఒక కిలో పండ్లు 100 లేక రూ. 200 ఉంటాయి.

మామిడి పండ్లకు మహా అయితే ఇంకా కొంచెం రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పండు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Yubari King Melon అమ్మో ఈ పండు రేటుతో ఓ ఇల్లు కొనొచ్చు

ఈ పండు పేరు యుబారి కింగ్ మెలోన్ (Yubari King Melon). ఈ పండు చూడడానికి అచ్చం మన దగ్గర దొరికే కర్బూజా పండు లాగానే ఉంటుంది.

కానీ దీని ధర మాత్రం లక్షల రూపాయలలో ఉంటుంది. అసలు ఈ పండుకు అంత రేటు ఎందుకు ఉంటుంది, ఏంటి దీని స్పెషల్ అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ పండు మనకు మార్కెట్లో దొరకదు, దీన్ని వేలం పాటలో కొనుక్కోవాలి. మామూలుగా అయితే ఒక పండు సుమారుగా 15,000 నుండి రూ. 20,000 దాకా ఉంటుంది.

అదే టాప్ క్వాలిటీ జత పండ్లు (అంటే రెండు పండ్లు) అయితే వేలంలో ఏకంగా లక్షల్లో కూడా ఉంటుంది. లక్షల్లో అంటే మీకు సరిగ్గా చెప్పాలంటే ఒక పండు 30 లక్షల దాకా పలికిన చరిత్ర ఉంది.

అంటే ఆ డబ్బులతో సిటీలో ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. ఈ పండు మన దగ్గర పండదు. ఇది జపాన్ దేశంలోని హోక్కైడో (Hokkaido) అనే ప్రాంతంలో యుబారి అనే ఊర్లోనే పండుతుంది.

అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అక్కడ ఉండే వాతావరణం, ఆ మట్టి దీనికి సరిగ్గా సెట్ అవుతాయి.

మసాజ్ చేస్తూ పెంచుతారు, బిడ్డకంటే ఎక్కువగా చూసుకుంటారు

మీరు అనుకోవచ్చు జస్ట్ కర్బూజా లాగా ఉండే పండుకే అంత రేట్ అని. కానీ దాన్ని పండించే విధానం మీరు చూస్తే ఔరా అంటారు.

రైతులు అక్కడ ఈ పండ్లను ఏదో ఒక పంట లెక్క కాకుండా సొంత బిడ్డలా లెక్క చూసుకుంటారు. ఈ పండ్లకు ఎండ తగలకుండా ప్రతి పండుకు టోపీలు పెడతారు.

మన దగ్గరలో ఉండే చెట్లకు ఒక్క తీగకు 10 కాయలు కాస్తాయి. కానీ ఈ పండుకు మొత్తం పోషకాలు అందాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఒక్క తీగకు ఉన్న పిందెలు అన్నిటిని తెంపేసి కేవలం ఒక్కటి అంటే ఒక్కటే ఉంచుతారు. చెట్టు యొక్క బలం మొత్తం ఆ ఒక్క పండుకే పోతుంది.

మీకు ఇప్పుడు నమ్మబుద్ధి కానీ విషయం చెప్తాను. అదేంటంటే అక్కడి రైతులు ఈ పండు షేపు మంచిగా ఉండాలని, పైన గీతలు అందంగా రావాలని చేతులతో ఆ పండుకి మసాజ్ చేస్తారంట.

సుమారు 100 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు

ఈ పండు రుచి గురించి చెప్పాలంటే అబ్బో సూపర్ ఉంటుంది. దీన్ని నోట్లో పెట్టుకోగానే వెన్నెలాగా కరిగిపోతాదట. ఇది తీపి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ పండును తిన్నవారు ఈ పండు గురించి అబ్బా చాలా జ్యూసీగా ఉంది, ఘుమఘుమలాడే వాసన వస్తుంది అని చెప్తారు.

ఈ పండును సామాన్యులు కొనడం కష్టం. జపాన్లో దీన్ని బహుమతి రూపంలో ఇస్తారు. అందుకోసమే ఎక్కువగా దీన్ని వాడుతారు అంట. వాళ్ల సంప్రదాయంలో దీనికి చాలా విలువ ఉంటుంది.

ఇది కూడా చదవండి: [రంగు రంగుల మొక్కజొన్న, వజ్రం లాంటి నల్ల ఆపిల్]

Miracle Fruit మీ నాలుకను ఏమార్చే మాయల పండు

మన దగ్గరకు ఎవరైనా వచ్చి మీరు నిమ్మకాయ కొరికితే చాలా తియ్యగా ఉంటుంది అని చెప్తే మనం ఏమనుకుంటాం? ఏంటండీ జోకులు వేస్తున్నారా అంటాం.

నేను ఏమైనా నీకు పిచ్చి వాళ్ళ లాగా కనిపిస్తున్నానా అని కోప్పడతాము. కానీ నేను చెప్తున్నా.. మీరు నిమ్మకాయ తిన్నా తీయగానే ఉంటుంది.

అవును నిజం, ప్రపంచంలో ఒక వింత పండు ఉంది. మీరు అది తిన్న తర్వాత పుల్లటి నిమ్మకాయ తిన్నా, కాకరకాయ తిన్నా నోటికి మాత్రం చాలా తీయటి స్వీట్ తిన్నట్టే అనిపిస్తుంది.

పులుపును తీపిగా మార్చేస్తుంది దీని టాలెంట్ మామూలుగా లేదు

ఈ పండు పేరు మిరాకిల్ ఫ్రూట్ (Miracle Fruit). దీని కథ ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దీని అసలు పేరు సిన్సెపాలం డల్సిఫికమ్ (Synsepalum dulcificum).

మీకు పలకడానికి ఇబ్బందిగా ఉంది కదా, అందుకే దీన్ని అందరూ ముద్దుగా మిరాకిల్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఈ పండు చూడడానికి చిన్నగా ఎర్రగా ఉంటుంది.

మన ఊర్లో దొరికే రేగుపండు లాగా లేక కాఫీ గింజ లాగా ఉంటుంది. ఇది ఆఫ్రికా దేశాల నుండి వచ్చింది, కానీ ఇప్పుడు ఇది మన దగ్గర కూడా దొరుకుతుంది.

ఈ పండు విషయం అంతా దాని గుజ్జులోనే ఉంటుంది. ఈ పండులో మిరాక్యులిన్ (Miraculin) అనే ఒక ప్రోటీన్ ఉంటుంది.

మీరు ఈ పండును నమిలినప్పుడు ఆ మిరాక్యులిన్ మీ నాలుక మీద ఉన్న రుచి చూసే మొగ్గలకు (Taste buds) అతుక్కుంటుంది. మామూలుగా ఉన్నప్పుడు అది ఏం చేయదు.

కానీ ఎప్పుడైతే పుల్లటి పదార్థం మీ నోట్లో పడుతుందో వెంటనే ఆ ప్రోటీన్ ఆక్టివేట్ అవుతుంది. మీ బ్రెయిన్ కి ఇది పులుపు కాదు తీపి అని రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది.

అందువల్ల మీరు నిమ్మకాయ రసం తాగినా పంచదార నీళ్ళు తాగినట్టు అనిపిస్తుంది.

కొనడం కష్టమే కానీ ఒక్కసారైనా రుచి చూడాల్సిందే

ఈ పండును కొన్న వెంటనే గబా గబా తినేయొద్దు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ పండుని నోట్లో వేసుకుని ఆ గింజ రాకుండా మెల్లగా నమలాలి.

ఆ గుజ్జును నాలుక అంతా అంటేలా ఒక నిమిషం పాటు నాలుకతో అటు ఇటు తిప్పాలి. గింజను బయటకు ఊసేయాలి.

ఇక ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఒక నిమ్మకాయ ముక్కను తీసుకొని కొరకండి.. అప్పుడు అబ్బ భలే తియ్యగా ఉంది అని మీకు అనిపిస్తుంది.

ఈ పండు తిన్న తర్వాత 30 నిమిషాల నుండి 1 గంట దాకా ఈ ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏం తిన్నా సరే అది తీయగానే ఉంటుంది.

ఆ తర్వాత మెల్ల మెల్లగా లాలాజలం ఊరి ఆ కోటింగ్ మొత్తం పోయాక మళ్ళీ మామూలుగా ఉంటుంది.

దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి. షుగర్ ఉన్నవాళ్లు స్వీట్ తినాలనిపిస్తే పంచదార బదులు ఈ పండు తిని, ఆ తర్వాత ఏదైనా పుల్లని పండు తింటే స్వీట్ తిన్నంత తృప్తి దొరుకుతుంది.

కీమోథెరపీ తీసుకునే వాళ్లకు నోరంతా చేదుగా, ఇనుము తుప్పు రుచి లాగా ఉంటుందట. వాళ్లు అన్నం తినలేక చాలా ఇబ్బంది పడతారట.

అప్పుడు ఏం చేయాలంటే ఈ పండు తినాలి, ఆ తర్వాత వాళ్లకు రుచి తెలిసి అన్నం బాగా తింటారు.

మన రైతు బజారులో ఈ పండు దొరకదు. ఇది అమెజాన్ లాంటి ఆన్లైన్ సైట్లలో మిరాకిల్ ఫ్రూట్ టాబ్లెట్స్ (Miracle Fruit Tablets) రూపంలో దొరుకుతాయి.

హైదరాబాద్ చుట్టు పక్కల ఉండే పెద్ద నర్సరీలల్ల ఈ మొక్కను అమ్ముతారు. దీన్ని కుండీలో పెంచుకోవచ్చు. పండు చిన్నగానే ఉంటుంది కానీ రేటు మాత్రం గట్టిగానే ఉంటుంది.

మీకేమనిపిస్తుంది? అసలు ఒక పండుకి ఇన్ని లక్షలు పెట్టడం కరెక్టేనా? దీని గురించి కింద కామెంట్ చేసి చెప్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *