మనం ఆఫీస్ లో ఎక్సెల్ షీట్లు నింపడానికో లేక రాత్రి పూట సినిమాలు చూడటానికో వాడే ల్యాప్‌టాప్ మహా అయితే ముప్పై నలభై వేలు ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఒక లక్ష రూపాయలు పెట్టి కొంటాం.
ఆ లక్ష రూపాయల ల్యాప్‌టాప్ కిందపడితేనే మన గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కానీ ఎప్పుడైనా ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే ల్యాప్‌టాప్ గురించి విన్నారా.
అవును మీరు విన్నది నిజమే. ప్రపంచంలోని అపర కుబేరులు వాడే ఆ మైండ్ బ్లాక్ అయ్యే గ్యాడ్జెట్ పేరే Gold Diamond Laptop. మనం బండికి పెట్రోల్ కొట్టించడానికే వంద లెక్కలు వేసుకుంటే వీళ్ళు ఏకంగా ల్యాప్‌టాప్ కి కిలోల కొద్దీ బంగారం వజ్రాలు పూసేశారు.
అసలు ఈ వందల కోట్ల రూపాయల ల్యాప్‌టాప్ లోపల ఏముంది. ఇది ఎందుకంత భయంకరమైన ఖరీదు ఉంటుంది. అనేది ఆవివరంగా చూద్దాం.
Gold Diamond Laptop అంటే ఏమిటి?

మనం ఒక యాభై వేలు పెట్టి ల్యాప్‌టాప్ కొంటేనే దానికి గీతలు పడకుండా వంద రూపాయల స్క్రాచ్ గార్డ్ వేసి పసిపిల్లల్లా చూసుకుంటాం. రోజూ ఉదయం లేవగానే ఒక మెత్తటి గుడ్డ పెట్టి దాన్ని తుడుస్తూ ఉంటాం.
కానీ ఒకసారి ఊహించుకోండి. అసలు ప్లాస్టిక్ లేదా అల్యూమినియం డబ్బాతో కాకుండా ఏకంగా స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం, తళతళ మెరిసే వజ్రాలతో ఒక ల్యాప్‌టాప్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? దాన్నే గోల్డ్ డైమండ్ ల్యాప్‌టాప్ అంటారు.
ఇది ఆఫీస్ లో కూర్చుని ఎక్సెల్ షీట్లు చేసుకోవడానికి వాడే మామూలు ఎలక్ట్రానిక్ వస్తువు కాదు. అపర కుబేరులు వాళ్ళ దర్జాను లోకానికి చూపించుకోవడానికి చేతిలో పట్టుకుని తిరిగే ఒక అత్యంత ఖరీదైన ఆభరణం.
మనం మెడలో వేసుకునే చిన్న తులం బంగారు చైన్ కే ఈఎంఐలు కడుతూ కిందామీదా పడుతుంటే వీళ్లు ఏకంగా ల్యాప్‌టాప్ కే కిలోల కొద్దీ బంగారాన్ని పూసేశారు. దీన్ని చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే.
Gold Diamond Laptop తో సాధారణ ల్యాప్‌టాప్ తేడా
మనం ల్యాప్‌టాప్ కొనేటప్పుడు షాపుకెళ్లి అన్నా ర్యామ్ ఎంత, ప్రాసెసర్ స్పీడ్ ఎంత, బ్యాటరీ బ్యాకప్ వస్తుందా అని నానా ప్రశ్నలు అడుగుతాం.
కానీ ఈ డైమండ్ ల్యాప్‌టాప్ కొనే కుబేరులు అన్నా ఇందులో ఎన్ని గ్రాముల బంగారం వాడారు, వజ్రాలు ఎన్ని క్యారెట్లు, కొలతలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని అడుగుతారు.
సాధారణ ల్యాప్‌టాప్స్ ఎప్పుడూ లోపల ఉండే పెర్ఫార్మెన్స్ మీదే బతుకుతాయి. కానీ ఈ వేల కోట్ల ల్యాప్‌టాప్స్ మాత్రం ప్యూర్ గా బయటి డిజైన్ అంటే ఎక్స్టీరియర్ లుక్ మీదే ఆధారపడి ఉంటాయి.
మన నార్మల్ ల్యాప్‌టాప్ మూడు లేక నాలుగు సంవత్సరాలకు పాడైపోతే తుక్కు కింద 500 కు అమ్ముకుంటాం. కానీ ఈ గోల్డ్ డైమండ్ ల్యాప్‌టాప్ పాడైపోయినా లేదా లోపల మదర్ బోర్డ్ కాలిపోయినా వాళ్లకి ఎలాంటి టెన్షన్ ఉండదు.
పైన ఉన్న బంగారం కరగబెట్టి నెక్లెస్ చేయించుకోవచ్చు లేదా ఆ వజ్రాలు అమ్మి పది ఇళ్లు కొనుక్కోవచ్చు. అదీ ఈ ల్యాప్‌టాప్ రేంజ్ మరియు రీసేల్ వాల్యూ.
Gold మరియు Diamonds ఎందుకు ఉపయోగిస్తారు?
అసలు ల్యాప్‌టాప్ కి ఇనుము, ప్లాస్టిక్ కాకుండా ఈ బంగారం, వజ్రాలు ఎందుకురా బాబూ అని మీకు డౌట్ రావచ్చు. డబ్బున్న బిలియనీర్లకి ఒక విచిత్రమైన పిచ్చి ఉంటుంది.
వాళ్లు వాడే వస్తువు ఈ ప్రపంచంలో ఇంకెవడి దగ్గరా ఉండకూడదు, కేవలం వాళ్ల కోసమే దాన్ని తయారు చేయాలి అన్నదే వాళ్ళ మెయిన్ టార్గెట్.
పది మందిలో కూర్చుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే ఎదుటివాడి కళ్లు బైర్లు కమ్మాలి. ఆ రాయల్ లుక్ మరియు స్టేటస్ సింబల్ కోసమే ప్యానెల్స్ మరియు కీబోర్డ్ బటన్స్ మీద ప్యూర్ వజ్రాలు గుమ్మరిస్తారు.
ల్యాప్‌టాప్ వెనకాల ఉండే యాపిల్ లేదా ఇతర కంపెనీల లోగోల దగ్గర కూడా ఖరీదైన రాళ్లను పొదుగుతారు. మనం మన ల్యాప్‌టాప్ లో ఎంటర్ బటన్ గట్టిగా కొడితే కీబోర్డ్ ఎక్కడ విరిగిపోతుందో అని భయపడతాం.
కానీ ఈ కుబేరులు ఎంటర్ బటన్ కొడితే అందులో ఉన్న వజ్రం తళుక్కున మెరిసిపోతుంది.
Gold Diamond Laptop టాప్ మోడల్స్

మార్కెట్లో ఇలాంటి బంగారు ల్యాప్‌టాప్‌లు చాలానే ఉన్నా కొన్ని మోడల్స్ మాత్రం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కొన్ని టాప్ మోడల్స్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.
మనం సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం. కానీ ఈ అపర కుబేరులు మాత్రం కోట్లు పెట్టి ఈ ల్యాప్‌టాప్‌లను కూరగాయలు కొన్నట్టు కొనేస్తుంటారు.
Luvaglio One Million Dollar Laptop వివరాలు
పేరు పలకడానికే నోరు తిరగని ఈ ల్యాప్‌టాప్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గ్యాడ్జెట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీని ధర అక్షరాలా ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ఎనిమిది కోట్లకు పైనే ఉంటుంది.
ఎనిమిది కోట్లు అంటే మన ఊళ్లో ఒక పెద్ద విల్లా కొనేయొచ్చు. కానీ వీళ్లు మాత్రం ఆ డబ్బుతో కేవలం ఒక ల్యాప్‌టాప్ కొని బల్ల మీద పెట్టుకుంటారు.
ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మీ దగ్గర ఎనిమిది కోట్లు రెడీగా ఉన్నా సరే దీన్ని డైరెక్ట్ గా వెళ్లి కొనుక్కోలేరు. ఆ కంపెనీ వాళ్ళు మీ దర్జా చూసి స్పెషల్ గా పిలిచి ఇస్తేనే మీరు దీన్ని కొనగలరు.
ల్యాప్‌టాప్ ఆన్ చేయడానికి మనం మామూలు ప్లాస్టిక్ బటన్ నొక్కుతాం. కానీ వీళ్లు ఆన్ చేయడానికి ఒక అరుదైన ఖరీదైన వజ్రాన్ని పవర్ బటన్ గా అమర్చారు. ఆ బటన్ నొక్కితే కరెంటుతో పాటు కళ్లు కూడా జిగేల్ మంటాయి.
Tulip E-Go Diamond ప్రత్యేకతలు
ఈ ల్యాప్‌టాప్ పేరు వినగానే ఏదో పూల మొక్క అనుకునేరు. ఇది చూడటానికి అచ్చం ఒక స్టైలిష్ అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లాగా డిజైన్ చేశారు.
మన ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ అడిగితేనే మన జేబులు ఖాళీ అయిపోతాయి. అలాంటిది ఏకంగా ల్యాప్‌టాప్ నే హ్యాండ్ బ్యాగ్ మోడల్ లో వజ్రాలతో చేస్తే ఇంకేమైనా ఉందా.
దీని ప్యానెల్స్ మొత్తం మామూలు స్టీల్ తో కాకుండా సాలిడ్ పల్లాడియం మరియు వైట్ గోల్డ్ తో తయారు చేశారు. అంటే పైన వైట్ గోల్డ్ లోపల పల్లాడియం అన్నమాట.
అంతేకాదు దీనిపైన వందలాది ప్యూర్ వజ్రాలను ఒక క్రమంలో అద్భుతంగా పొదిగారు. దీని ధర సుమారు మూడు లక్షల డాలర్ల పైనే ఉంటుంది. అంటే చూడ్డానికి హ్యాండ్ బ్యాగ్ లా ఉన్నా దీని రేటు వింటే మాత్రం హార్ట్ ఎటాక్ రావడం గ్యారెంటీ. దీని ధర మూడు కోట్ల పైన ఉంటుంది.
కస్టమ్ 24K Gold MacBook ఎడిషన్స్
యాపిల్ మ్యాక్‌బుక్ అంటేనే మన కుర్రాళ్ళకి అదొక పెద్ద కల. ఈఎంఐలు కట్టి మరీ ఆ సగం కొరికిన యాపిల్ లోగో కోసం ఆరాటపడుతుంటారు.
కానీ అపర కుబేరులకు ఆ మామూలు యాపిల్ మ్యాక్‌బుక్ వాడటం అస్సలు నచ్చదు. అందరి దగ్గర ఉండేది నా దగ్గర ఉంటే నా రేంజ్ ఏంటి అని వాళ్ళు ఫీల్ అవుతారు.
అలాంటి వాళ్ళ కోసమే కావియార్ లాంటి కొన్ని కస్టమ్ కంపెనీలు రంగంలోకి దిగాయి. వీళ్లు మ్యాక్‌బుక్ పైన ఉన్న ఆ యాపిల్ లోగోని స్వచ్ఛమైన వజ్రాలతో నింపేస్తారు.
అంతే కాకుండా ల్యాప్‌టాప్ బాడీ మొత్తాన్ని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో కవర్ చేసి స్పెషల్ ఎడిషన్ కింద అమ్ముతుంటారు. ఈ బంగారు మ్యాక్‌బుక్ ల ధర కోట్లలో ఉంటుంది.
మనం ప్లాస్టిక్ కవర్ వేసుకుని వాడే మ్యాక్‌బుక్ కి వీళ్లు ఏకంగా బంగారు కవచం వేసి వాడుతున్నారు. ఇదే కుబేరుల అసలైన దర్జా. వీటి ధరలు నాలుగున్నర కోట్ల వరకు ఉంటాయి.
Gold Diamond Laptop ధర ఎందుకు ఇంత ఎక్కువ?

మనకి ఏడెనిమిది వేల ఫోన్ కొనడానికే పది వెబ్సైట్లలో ఆఫర్లు వెతికి ఈఎంఐలు పెట్టుకుంటాం. అలాంటిది ఈ ల్యాప్‌టాప్ కి ఏకంగా వేల కోట్లు ఎందుకు తీసుకుంటారు అని మీకు గట్టిగా డౌట్ రావచ్చు.
దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. అసలు ఆ డబ్బులు దేనికి తీసుకుంటారో డీటెయిల్డ్ గా ఒక లెక్క వేద్దాం. వీళ్లు లోపల వాడేది మామూలు యాపిల్ లేదా హై ఎండ్ విండోస్ ల్యాప్‌టాప్ మాత్రమే.
దాని అసలు ధర చూసుకుంటే మహా అయితే రెండు లేదా మూడు లక్షలు ఉంటుంది. కానీ ల్యాప్‌టాప్ ప్యానెల్ మొత్తం కవర్ చేయడానికి కనీసం అర కిలో నుంచి కిలో దాకా స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వాడుతారు.
ఒక కిలో బంగారం ధర అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం కోట్లలోనే ఉంటుంది. మనం పది గ్రాముల ఉంగరం కొంటేనే బిల్లు చూసి వణికిపోతాం. వీళ్ళు ఏకంగా కిలోల కొద్దీ బంగారాన్ని ల్యాప్‌టాప్ కి పూసేశారు.
యాపిల్ లోగో దగ్గర కీబోర్డ్ బటన్స్ దగ్గర వాడే వజ్రాల ఖర్చు ఇంకో రకం. ఈ ల్యాప్‌టాప్ పైన అంటించేవి మనకి రోడ్డు మీద దొరికే కలర్ రాళ్లు కావు. డైమండ్స్ కి ఎప్పుడూ ఒక లెక్క ఉంటుంది.
దాన్నే ఫోర్ సీస్, అంటే కట్ కలర్ క్లారిటీ క్యారెట్ అంటారు. ఈ గోల్డ్ ల్యాప్‌టాప్స్ కోసం ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన ఫ్లా లెస్ లేదా వీవీఎస్ వన్ గ్రేడ్ ఉన్న డైమండ్స్ మాత్రమే వాడతారు.
ఇందులో ఎలాంటి లోపాలు ఉండవు. కాంతి పడగానే మన కళ్లు చెదిరేలా మెరుస్తాయి. అందుకే ఆ వజ్రాలకి అంత భయంకరమైన రేటు ఉంటుంది.
Rare Materials తో Handcrafted తయారీ
ఇలాంటి కోట్ల రూపాయల ల్యాప్‌టాప్‌లను ఫ్యాక్టరీలో వందల సంఖ్యలో యంత్రాలతో తయారు చేయరు. ప్రతి ల్యాప్‌టాప్ ని చేతితో అంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ పద్ధతిలో ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.
మెషిన్లతో కాకుండా నిపుణులైన కళాకారులతో చేతితో నెలల తరబడి కూర్చుని అమర్చడానికి వాళ్ళు లక్షల్లో మేకింగ్ చార్జెస్ తీసుకుంటారు. మనం బట్టలు కుట్టించుకోవడానికే టైలర్ తో వంద బేరాలు ఆడతాం.
ఇందులో వాడే తోలు బంగారం మరియు అరుదైన రాళ్లు ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీకి చెందినవి అయి ఉంటాయి. దుబాయ్ షేక్‌లు రష్యాలోని అపర కుబేరులు ఇలాంటి వస్తువుల కోసమే ఎదురు చూస్తుంటారు. ఈ మార్కెట్ అంతా వాళ్ల చుట్టూనే తిరుగుతుంది.
Limited Edition తో కుబేరుల డిమాండ్
ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే వీటిని ఆఫర్లలో ప్రతి ఒక్కరికీ అమ్మరు. కేవలం లిమిటెడ్ ఎడిషన్ కింద ప్రపంచం మొత్తంలో ఒకటో రెండో పీస్ లు మాత్రమే తయారు చేస్తారు.
డిమాండ్ ఏమో ఆకాశంలో ఉంటుంది సప్లై ఏమో కేవలం ఒకటి రెండు మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్ గా దాని ధర ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోతుంది.
అందరికీ దొరికేది అయితే కుబేరులకు ఎందుకు కిక్ ఇస్తుంది చెప్పండి. నా దగ్గర ఉన్న వస్తువు ప్రపంచంలో ఇంకెవరి దగ్గరా లేదు అనే ఆ కిక్ కోసమే వాళ్లు ఇన్ని వందల కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెడతారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 360 కోట్ల ఐఫోన్ పూర్తి వివరాలు
Gold Diamond Laptop కొనడం కరెక్టేనా?

ఇన్ని వందల కోట్లు పెట్టి ఒక ల్యాప్‌టాప్ కొనడం నిజంగా అవసరమా అని మీకు పెద్ద డౌట్ రావచ్చు. ఆ డబ్బుతో ఊరికి దూరంగా పది ఎకరాల పొలం కొనుక్కోవచ్చు కదా అని మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అనిపిస్తుంది.
కానీ కుబేరుల లెక్కలు వేరుగా ఉంటాయి. అసలు వాళ్ళు దీన్ని ఎందుకు కొంటారు దీని వెనుక ఉన్న అసలైన లాజిక్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్ గా లోపలికి వెళ్లి చూద్దాం.
Resale Value ఎలక్ట్రానిక్ వస్తువా లేక ఆభరణమా
సాధారణంగా టెక్నాలజీ అనేది ఎప్పటికైనా పాతబడిపోతుంది. ఈరోజు మనం కొన్న లక్ష రూపాయల ఫోన్ రేపు సగానికి పడిపోతుంది. ల్యాప్‌టాప్ లోపల ఉండే ప్రాసెసర్ కూడా మూడేళ్లకు పనికిరాకుండా పోతుంది.
కానీ ఈ గోల్డ్ ల్యాప్‌టాప్ పైన ఉన్న వజ్రాలు బంగారం మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరవు. అందుకే దీన్ని ఒక ఎలక్ట్రానిక్ వస్తువుగా కాకుండా ఒక అరుదైన ఆభరణంగా చూస్తారు.
రేపు పొద్దున మదర్ బోర్డ్ కాలిపోయినా సరే ఆ పైన ఉన్న బంగారం కరగబెట్టి బిస్కెట్లు చేసుకోవచ్చు. లేదా ఆ వజ్రాలు ఊడదీసి ఉంగరాలు చేయించుకోవచ్చు. అంటే దీని రీసేల్ వాల్యూ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది.
Performance vs Status Symbol కేవలం దర్జా కోసమేనా
మీరు ఇందులో పబ్జీ ఆడుకోవడానికో లేక పెద్ద పెద్ద సినిమాలు ఎడిటింగ్ చేయడానికో ఈ ల్యాప్‌టాప్ కొంటే అది పక్కా వేస్ట్ అవుతుంది. కోటి రూపాయల రేసు గుర్రం కొని బండి లాగించినట్టే ఉంటుంది.
ఎందుకంటే పనితీరు పరంగా చూస్తే ఇది మనం రోజూ వాడే నార్మల్ ల్యాప్‌టాప్ లాగే ఉంటుంది. కేవలం పది మంది బిలియనీర్ల మధ్య కూర్చున్నప్పుడు నా రేంజ్ ఏంటో చూపించుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
Gold Laptop vs Normal MacBook Pro అసలైన పోలిక
ఒకసారి మనం వాడే నార్మల్ యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో కి మరియు ఈ గోల్డ్ ల్యాప్‌టాప్ కి తేడా ఏంటో లోతుగా చూద్దాం. లోపల సాఫ్ట్వేర్ అంతా ఒకటే ఉన్నా బయట చూస్తే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది.
నార్మల్ మ్యాక్‌బుక్ మహా అయితే రెండు మూడు లక్షలు ఉంటుంది. దాన్ని ఎవరైనా బ్యాగ్ లో వేసుకుని ఈజీగా మోసుకెళ్లొచ్చు. కానీ ఈ గోల్డ్ ల్యాప్‌టాప్ రేటు ఐదు కోట్ల పైనే ఉంటుంది.
అంతేకాదు ఈ గోల్డ్ ల్యాప్‌టాప్ లో కిలోల కొద్దీ బంగారం ఉండటం వల్ల ఇది చాలా బరువుగా ఉంటుంది. దీన్ని మోయాలంటే కచ్చితంగా రోజూ జిమ్ కి వెళ్లాల్సిందే లేదంటే దాన్ని పట్టుకోవడానికి ఒక మనిషిని పనిలో పెట్టుకోవాల్సిందే.
Buying Process ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వస్తుందా
మీ అకౌంట్లో వందల కోట్లు ఉన్నా సరే దీన్ని అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ లో క్యాష్ ఆన్ డెలివరీలో ఆర్డర్ చేయలేరు. దీన్ని కొనాలంటే కావియార్ లాంటి లగ్జరీ కస్టమైజేషన్ కంపెనీల దగ్గరికి వెళ్లాలి.
వాళ్లు ముందుగా మన బ్యాంక్ బ్యాలెన్స్ మన బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి కోట్లలో అడ్వాన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత డిజైన్ గీసి వజ్రాలు అంటించి మన చేతికి ఇవ్వడానికి కనీసం ఆరు నెలల టైమ్ తీసుకుంటారు.
Pros Cons లాభాలు మరియు నష్టాలు
ఇందులో లాభాలు ఏంటంటే ప్రపంచం మొత్తంలో మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరా ఈ మోడల్ ఉండదు. పైగా ఇది ఒక పాతకాలపు యాంటిక్ పీస్ లాగా భవిష్యత్తులో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది.
కానీ నష్టాలు కూడా గట్టిగానే ఉన్నాయి. దొంగల భయంతో ఈ ల్యాప్‌టాప్ ని బ్యాగ్ లో వేసుకుని బయట స్టార్ బక్స్ కి వెళ్లి కాఫీ తాగలేరు. పక్కన కచ్చితంగా ఇద్దరు గన్ మెన్లు ఉండాల్సిందే.
పైగా లోపల ఉన్న సాఫ్ట్‌వేర్ పాతబడిపోతే ఆ బంగారు రేకులు విడదీసి అప్‌గ్రేడ్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని.
నా చివరి మాట
ఈ Gold Diamond Laptop అనేది కేవలం ఒక రేంజ్ కి, హోదాకి గుర్తు మాత్రమే. కోట్లు ఖర్చు పెట్టి వీటిని కొనడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, మన అవసరానికి తగ్గ మంచి ల్యాప్‌టాప్ తీసుకోవడమే ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్.
మరి దీనిపై మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.
