థియేటర్లో లైట్లు ఆరిపోగానే మన గుండె చప్పుడు పెరగడానికి కారణం ఏంటి? అసలు తెర మీద హీరో ఎంట్రీ ఇవ్వగానే మనకు తెలియని గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి. వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.
వందల కోట్లు పెట్టి తీసిన యాక్షన్ సినిమా అయినా సరే, అందులో కరెక్ట్ గా మ్యూజిక్ పడకపోతే అది అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం. ఒక సినిమాకి ప్రాణం పోసే ఈ అద్భుతమైన మ్యూజిక్ అసలు ఎలా పుడుతుందో, వెండితెర వెనుక జరిగే ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
మనం కుర్చీలో కూర్చుని రెండున్నర గంటలు ఎంజాయ్ చేసే, ఆ సౌండ్ వెనుక ఎంత మంది రాత్రులు నిద్రపోకుండా కష్టపడతారో తెలిస్తే నిజంగా షాక్ అవుతాం. దర్శకుడు తీసిన సీన్ కి మ్యూజిక్ డైరెక్టర్ తన ప్రాణం పెట్టి ఎలా ట్యూన్స్ కొడతాడో చూద్దాం.
అసలు ఒక డైలాగ్ లేని సీన్ ని కూడా తమ మ్యూజిక్ తో జనాన్ని ఎలా ఏడిపిస్తారో ఎలా భయపెడతారో ఈ ఆర్టికల్ లో చూద్దాం. చదివాక మ్యూజిక్ డైరెక్టర్ల మీద మీకంటూ ఒక కొత్త రెస్పెక్ట్ రావడం పక్కా.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏమిటి?
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటో చాలా మందికి ఒక క్లారిటీ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో స్క్రీన్ మీద జరుగుతున్న సీన్ కి మనలో ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేసే మ్యాజిక్ ఇది.
హీరో ఎంట్రీ ఇవ్వగానే మనకు తెలియకుండానే అరుపులు ఎందుకు వస్తాయి చెప్పు. ఆ హీరో నడుచుకుంటూ వస్తుంటే వెనకాల డ్రమ్స్ పగిలిపోయేలా కొట్టే మ్యూజిక్ వల్లే ఆ కిక్ వస్తుంది.
ఒకవేళ అదే హీరో ఫైట్ చేస్తున్నప్పుడు వెనకాల మ్యూజిక్ తీసేసి మన డెయిలీ సీరియల్స్ లో వచ్చే ఏడుపు మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే బస్టాండ్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న నార్మల్ పబ్లిక్ లాగే కనిపిస్తాడు.
అంటే తెర మీద ఉన్న నటుడికి ఒక వంద రెట్లు ఎలివేషన్ ఇచ్చేది, ఆ సీన్ రేంజ్ ని ఆకాశానికి పెంచేది, ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. ఇదొక్కటి తేడా కొడితే కోట్లు పెట్టి తీసిన యాక్షన్ సినిమా కూడా భయంకరమైన కామెడీ పీస్ అయిపోతుంది.
ఇక మ్యూజిక్ కి ఉన్న మరో పవర్ ఏంటంటే డైలాగ్ లేకపోయినా మనకు కథను అర్థం చేయించడం. సినిమాలో ఒక తల్లి ఏడుస్తూ ఉంటుంది ఆమె ఏ డైలాగ్ చెప్పదు.
అదే మ్యూజిక్ లేకుండా చూస్తే ఆవిడ కంట్లో నలుసు పడిందేమో అని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా అదే టైంకి మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఏడిపించే వయోలిన్ ట్యూన్ ప్లే చేస్తాడు చూడు అప్పుడు మన కంట్లో నుంచి కూడా ఆటోమేటిక్ గా నీళ్లు వచ్చేస్తాయి.
అంటే మాటలతో చెప్పలేని బాధను లేదా సంతోషాన్ని నేరుగా ప్రేక్షకుల గుండెల్లోకి దించే బాణం ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. పదాలు అవసరం లేకుండానే పాస్ అయిపోయే ఎమోషన్ ఇది.
కొన్నిసార్లు హీరో హీరోయిన్ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకోరు. కానీ వెనకాల వచ్చే మెలోడీ మ్యూజిక్ వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో మనకు పక్కాగా చెప్పేస్తుంది.
అలాగే థ్రిల్లింగ్ సస్పెన్స్ ఫీలింగ్స్ ని పెంచడంలో మ్యూజిక్ ది మామూలు రోల్ కాదు. ఒక హారర్ సినిమా చూస్తున్నప్పుడు మనకు భయం వేసేది దెయ్యాన్ని చూసి కాదు, వెనకాల వచ్చే మ్యూజిక్ విని.
మీరు కావాలంటే ఏ దెయ్యం సినిమా అయినా సరే టీవీలో మ్యూజిక్ మొత్తం మ్యూట్ చేసి చూడు. ఆ దెయ్యం తెల్ల చీర కట్టుకుని వస్తుంటే భయం బదులు విపరీతమైన నవ్వు వస్తుంది మనకు.
కానీ అదే చీకట్లో ఆ భయంకరమైన డర్రుమనే సౌండ్ లేదా ఏడుపు వినపడితే చాలు మనం పక్కకు చూడటానికి కూడా వణికిపోతాం. ఆ భయాన్ని మన నరాల్లోకి ఎక్కించేది దెయ్యం కాదు ఈ మ్యూజిక్ మాత్రమే.
మొత్తంగా చెప్పాలంటే సినిమా అనేది ఒక ప్రాణం లేని బాడీ అయితే అందులో ప్రాణం పోసేది ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఈ ప్రాణం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకులు సినిమాకి అంతలా కనెక్ట్ అవుతారు.
సినిమా పూర్తైన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు చేస్తారు
సినిమా మొత్తం షూటింగ్ అయిపోయి, ఎడిటింగ్ కూడా అయ్యాక, ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు రంగంలోకి దిగుతారు అని చాలామందికి డౌట్ వస్తుంది. ముందే మ్యూజిక్ కొట్టేసి దానికి తగ్గట్టు యాక్ట్ చేయొచ్చు కదా అని మనకి అనిపిస్తుంది.
కానీ అది ప్రాక్టికల్ గా అస్సలు వర్కౌట్ కాదు. ఉదాహరణకి డైరెక్టర్ ముందే ఒక బీభత్సమైన యాక్షన్ మ్యూజిక్ చేయించుకున్నాడు అనుకుందాం. తీరా షూటింగ్ రోజున హీరోకి జ్వరం వచ్చి డల్ గా కొడితే ఆ సీన్ కి ఈ మ్యూజిక్ కి ఏమైనా సింక్ అవుతుందా.
మన బ్రహ్మానందం గారి సీన్ కి ఫైట్ మ్యూజిక్ పెడితే జనాలు థియేటర్లో నవ్వుకుంటారు కానీ ఫీల్ అవ్వరు. అందుకే ఎడిటింగ్ మొత్తం పూర్తయిపోయి ఏ సీన్ ఎంత సేపు ఉందో పక్కాగా తెలిశాకే ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టడం మొదలుపెడతారు.
హీరో విలన్ ని కొట్టే సీన్ ఎడిటింగ్ లో ఐదు నిమిషాలు ఉందనుకో. ఆ ఐదు నిమిషాలకు కరెక్ట్ గా సరిపోయేలా మ్యూజిక్ ని డిజైన్ చేస్తారు. మధ్యలో హీరో స్లో మోషన్ లో నడిస్తే దానికి తగ్గట్టు డ్రమ్స్ స్లోగా కొడతారు.
అదే ముందే మ్యూజిక్ చేయించుకుంటే ఆ మ్యూజిక్ స్పీడ్ కి తగ్గట్టు హీరో పరిగెత్తాలి అంటే పాపం హీరోకి ఊపిరి ఆగిపోతుంది.
ప్రతి సీన్ మూడ్ కు తగిన సంగీతం ఇవ్వాలంటే సినిమా ఫైనల్ కట్ వాళ్ళ చేతిలో ఉండాల్సిందే. అప్పుడే హీరోయిన్ ఏడుస్తుంటే వయోలిన్ వాడాలా లేక ఫ్లూట్ వాడాలా అని వాళ్లకి ఒక క్లారిటీ వస్తుంది. సినిమా మూడ్ ని బట్టి ఇన్స్ట్రుమెంట్స్ మార్చేస్తారు.
నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మన హీరోలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కి నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో కనిపెట్టడం జనాలకు చాలా కష్టం. ఆ గ్యాప్ ని ఫిల్ చేసి వాడి మొహంలో లేని ఎక్స్ప్రెషన్ ని కూడా ఈ మ్యూజిక్ తో కవర్ చేసేస్తారు. వాడి యాక్టింగ్ వీక్ అయినా మ్యూజిక్ పీక్ లో ఉంటే జనాలు విజిల్స్ వేస్తారు.
అందుకే సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చీకటి గదిలో కూర్చుని సినిమా మొత్తం చూస్తాడు. ఎక్కడ ఏ మ్యూజిక్ పడితే థియేటర్ దద్దరిల్లుతుందో లెక్కలు వేసుకుని మరీ తన కీబోర్డ్ తో ప్రాణం పోస్తాడు.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తయారీ దశలు
ఇప్పుడు అసలైన కథలోకి వద్దాం అసలు ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఏదో రాత్రికి రాత్రి మ్యాజిక్ లాగా గాల్లోంచి ఊడిపడదు దీని వెనుక చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది.
మన ఇంట్లో ఒక పెద్ద పెళ్లి భోజనం వండటానికి వంటవాళ్లు ఎన్ని రకాల పనులు చేస్తారో ఈ మ్యూజిక్ పుట్టడానికి కూడా సరిగ్గా అన్ని దశలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి విపులంగా చూద్దాం.
మొదటి దశ సినిమా చూసి సన్నివేశాల విశ్లేషణ
ముందుగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చీకటి గదిలో కూర్చుని సినిమా మొత్తం ఎలాంటి సౌండ్ లేకుండా కేవలం సైలెంట్ గా చూస్తాడు పాపం వాడికి అదొక పెద్ద శిక్ష లాంటిది అని చెప్పొచ్చు.
ఎందుకంటే పచ్చిగా ఉన్న ఆ వీడియో చూసినప్పుడు అందులో ఎవరైనా యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే వాళ్ల మొహాలు చూసి వీడేంటి ఇలా చేశాడు అని తలపట్టుకుంటాడు అప్పుడే వాడికి అర్థమవుతుంది ఈ వీక్ యాక్టింగ్ ని కవర్ చేయాలంటే నా మ్యూజిక్ ఎంత గట్టిగా కొట్టాలి అని.
సినిమా మొత్తం చూశాక ఎక్కడ ఏడిపించాలి, ఎక్కడ భయపెట్టాలి, ఎక్కడ థ్రిల్ ఇవ్వాలి అని ఒక పక్కా లెక్క వేసుకుంటాడు. అంటే ఏ కూరలో ఎంత ఉప్పు వేయాలి, అని ఒక వంటవాడు ఆలోచించినట్లు ఇతను కూడా ఏ సీన్ కి ఏ మ్యూజిక్ వాడాలి అని మైండ్ లో ఒక డిజైన్ చేసుకుంటాడు.
రెండవ దశ స్పాటింగ్ సెషన్
ఇక ఇక్కడ అసలైన కామెడీ మొదలవుతుంది. డైరెక్టర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ కలిసి పక్క పక్కన కూర్చుని మళ్ళీ సినిమా చూస్తారు దీన్నే సినిమా భాషలో స్పాటింగ్ సెషన్ అంటారు.
మన డైరెక్టర్ ఏమో నా సినిమా ఆస్కార్ రేంజ్ అనుకుని, ప్రతి చిన్న సీన్ లోనూ అదరగొట్టే మ్యూజిక్ కావాలి అని అడుగుతాడు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కి తెలుసు కదా ఎక్కడ సౌండ్ ఉండాలి, ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటే జనాలు ఫీల్ అవుతారు అనేది.
సరిగ్గా ఇక్కడే వీళ్లిద్దరి మధ్య భార్యాభర్తల గొడవ లాంటిది జరుగుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్లలో మ్యూజిక్ అస్సలు ఉండకూడదు అని మ్యూజిక్ డైరెక్టర్ మొండికేస్తాడు. అలా ఫైనల్ గా ఏ సీన్ లో సౌండ్ ఉండాలి, ఎక్కడ నిశ్శబ్దం ఉండాలి అని ఒక నిర్ణయానికి వస్తారు.
మూడవ దశ మ్యూజిక్ థీమ్స్ రూపొందించడం
ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ప్రతి ముఖ్యమైన క్యారెక్టర్ కి ఒక బ్రాండ్ లాంటి మ్యూజిక్ ని ఇక్కడే పుట్టిస్తారు ఉదాహరణకి బాహుబలి దండాలయ్యా సాంగ్ రాగానే మనకు ఆటోమేటిక్ గా గూస్ బంప్స్ వస్తాయి కదా అలా అన్నమాట.
హీరో ఎంట్రీ ఇస్తే ఒక రకమైన సౌండ్ విలన్ నడుచుకుంటూ వస్తుంటే, ఏదో పెద్ద భూకంపం వస్తున్నట్టు ఇంకో భయంకరమైన సౌండ్ సెట్ చేస్తారు. ఒకవేళ పొరపాటున విలన్ కి కామెడీ మ్యూజిక్ కొడితే, వాడు ఎంత సీరియస్ గా ఉన్నా జనాలు పడి పడి నవ్వుతారు.
అందుకే సినిమా మొత్తానికి ఒక సోల్ లాంటి మెలోడీ ని తయారు చేస్తారు. అది సినిమా మొదట్లో మధ్యలో చివర్లో అలా వస్తూనే ఉంటుంది. అది విన్నప్పుడల్లా మనకు ఆ సినిమా కథ మొత్తం గుండెల్లోకి వెళ్లేలా భలే ప్లాన్ చేస్తారు.
నాలుగవ దశ కంపోజింగ్ మరియు అరేంజ్మెంట్
ఇక మ్యూజిక్ డైరెక్టర్ తన ల్యాబ్ లోకి వెళ్లిపోయి కీబోర్డ్ ముందు కూర్చుని రకరకాల ప్రయోగాలు చేస్తాడు. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ వాడి ఒక సౌండ్ కి ఇంకో సౌండ్ ని కలిపి ఒక సరికొత్త ఫీల్ ని క్రియేట్ చేస్తాడు.
ఉదాహరణకి ఒక ఫ్లూట్ సౌండ్ ని డ్రమ్స్ సౌండ్ ని కలిపితే ఎలా ఉంటుందో అని ట్రై చేస్తాడు. మన భాషలో చెప్పాలంటే వేడి వేడి చికెన్ బిర్యానీ లో చల్లటి పెరుగు చట్నీ కలిపి తింటే ఆ మజా ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా ఈ డిఫరెంట్ వాద్యాల శబ్దాలను అలా కలుపుతాడు అన్నమాట.
ఏ సీన్ కి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ వాడితే, ఆ మూడ్ పర్ఫెక్ట్ గా వస్తుందో అని ఒకటికి పదిసార్లు వాయించి చూసుకుంటాడు. ఇదంతా ఒక సైంటిస్ట్ ల్యాబ్ లో కొత్త మందు కనిపెట్టడానికి ప్రయోగాలు చేసినట్లు చాలా సీరియస్ గా జరిగిపోతుంది.
ఐదవ దశ రికార్డింగ్ ప్రక్రియ
ఇక్కడ సినిమా బడ్జెట్ ని బట్టి కథ మొత్తం మారిపోతుంది. పెద్ద బడ్జెట్ సినిమా అయితే ఒక వంద మందిని పెద్ద స్టూడియోకి పిలిపించి వాళ్ళతో లైవ్ గా వయోలిన్ డ్రమ్స్ గిటార్ లాంటివి వాయిస్తారు.
ఆ లైవ్ ఆర్కెస్ట్రా సౌండ్ థియేటర్లో వింటే, జనం కుర్చీల్లోంచి లేచి అరవడం పక్కా. అదే బడ్జెట్ లేని చిన్న సినిమా అనుకో, మన మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే తన ముందు ఉన్న కంప్యూటర్ లో అన్ని సౌండ్స్ ని మౌస్ తో క్లిక్ చేసి రికార్డ్ చేసేస్తాడు.
కానీ ఎంత డిజిటల్ సాఫ్ట్ వేర్ వాడినా ఆ లైవ్ మ్యూజిషియన్స్ వచ్చి చేతులతో వాయించే సౌండ్ కి ఉండే ఆత్మ దేనికీ రాదు. అందుకే పెద్ద సినిమాలకు లైవ్ గా రికార్డ్ చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ లో ఉండి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఆరవ దశ సీన్ కు సింక్ చేయడం
ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో చేయాల్సిన పని. హీరో విలన్ ని లాగిపెట్టి కొట్టినప్పుడు ఆ దెబ్బ పడే కరెక్ట్ టైం కి వెనకాల మ్యూజిక్ బ్యాంగ్ అని పేలాలి. ఒక అర సెకండ్ అటూ ఇటూ అయినా సీన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతుంది.
కొన్ని డబ్బింగ్ సినిమాల్లో మనం చూస్తాం కదా హీరో నోరు ఒకసారి కదులుతుంది, డైలాగ్ ఇంకోసారి వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకెప్పుడో వస్తుంది. అలా కాకుండా సినిమా సన్నివేశాలకు కరెక్ట్ గా మ్యూజిక్ టైమింగ్ సెట్ అయ్యేలా చూసుకుంటారు.
హీరోయిన్ కంట్లో నుంచి కన్నీరు కింద పడే కరెక్ట్ టైం కి ఒక సాడ్ ట్యూన్ స్టార్ట్ అయ్యేలా చూసుకుని ఎమోషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్తారు ఆ టైమింగ్ సెట్ చేయడం అనేది ఒక కష్టమైన పజిల్ సాల్వ్ చేసినంత తలనొప్పి వ్యవహారం.
ఏడవ దశ ఫైనల్ మిక్సింగ్
ఇదే మన చివరి అంకానికి క్లైమాక్స్ ఇక్కడే డైలాగ్స్ ని సౌండ్ ఎఫెక్ట్స్ ని, అంటే గాలి శబ్దం కార్ సౌండ్ లాంటివి మరియు మన మ్యూజిక్ డైరెక్టర్ కొట్టిన మ్యూజిక్ ని ఈ మూడింటిని ఒకే దాంట్లో వేసి మిక్స్ చేస్తారు.
కొన్ని చెత్త సినిమాల్లో హీరో ఎంత గట్టిగా ఎమోషనల్ డైలాగ్ చెప్పినా, వెనకాల మ్యూజిక్ వాటేసుకుని ఆ డైలాగ్ జనం చెవికి వినపడకుండా చేస్తుంది. అలా కాకుండా డైలాగ్ వచ్చేటప్పుడు మ్యూజిక్ ని కొంచెం తగ్గించి మళ్ళీ డైలాగ్ అయిపోగానే మ్యూజిక్ ని పెంచుతారు.
దీన్నే కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడం అంటారు. థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడికి డైలాగ్ స్పష్టంగా వినపడాలి, అలాగే మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించాలి. ఈ ఫైనల్ ఆడియో మిక్సింగ్ పక్కాగా కుదిరితేనే అది మనకు కిక్ ఇస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో ఎందుకు ముఖ్యమైనది
ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది లేకపోతే మన సినిమాలు అన్నీ సగం ఉడికిన బంగాళదుంప కూర లాగా చప్పగా ఉంటాయి. జనాలు థియేటర్ కి వెళ్లేది వాళ్ల ఏడుపులు కష్టాలు మర్చిపోయి స్క్రీన్ మీద ఉన్న వాడి ఏడుపు చూసి ఫీల్ అవ్వడానికే.
సరిగ్గా ఆ ఫీలింగ్ ని అంటే భావోద్వేగాన్ని వంద రెట్లు పెంచేది ఈ మ్యూజిక్ మాత్రమే. తెర మీద హీరో వాళ్ళ అమ్మని కలిసి ఏడుస్తుంటే వెనకాల ఒక సాడ్ ట్యూన్ ప్లే అవుతుంది. అప్పుడు చూడు థియేటర్లో ఉన్న కుర్రాళ్లు కూడా కర్చీఫ్ తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంటారు.
అదే అక్కడ ఆ ఎమోషనల్ మ్యూజిక్ తీసేసి మన వార్తల్లో వచ్చే బ్రేకింగ్ న్యూస్ మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుంది. సీన్ మొత్తం కామెడీ అయిపోయి థియేటర్లో జనాలు సీట్లు చించేస్తారు. అందుకే ప్రేక్షకుడి గుండెల్ని పిండేయాలంటే ఆ ఎమోషన్ కి తగ్గ మ్యూజిక్ పడాల్సిందే.
ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అందులో సగం సక్సెస్ ఆ మ్యూజిక్ కొట్టే వాడిదే ఉంటుంది. తెర మీద దెయ్యం రాకముందే వాడు కొట్టే సౌండ్ కి జనాలు భయంతో వణికిపోతారు.
హీరో చీకట్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు వెనకాల డబ డబ అని గుండె చప్పుడు లాంటి మ్యూజిక్ వస్తుంది. అప్పుడు మనకి తెలియకుండానే పక్కన ఉన్న వాడి చెయ్యి గట్టిగా పట్టుకుంటాం. ఆ సస్పెన్స్ ని థ్రిల్ ని బలంగా చూపిస్తుంది ఈ స్కోర్ మాత్రమే.
నువ్వు కావాలంటే మ్యూజిక్ లేకుండా ఒక హారర్ సినిమా చూడు ఆ దెయ్యం వచ్చి భయపెడుతున్నా నీకు ఏమాత్రం భయం వేయదు. పైగా ఆ దెయ్యం మేకప్ చూసి విపరీతమైన నవ్వు వస్తుంది. అందుకే థ్రిల్ ఫీల్ అవ్వాలంటే మ్యూజిక్ పక్కాగా ఉండాల్సిందే.
చివరిగా చెప్పాలంటే ప్రేక్షకులను ఆ సినిమా కథలో పూర్తిగా ముంచేయడంలో మ్యూజిక్ ది మామూలు రోల్ కాదు. మనం కుర్చీలో కూర్చున్న విషయం కూడా మర్చిపోయి ఆ కథలో ఒక క్యారెక్టర్ లాగా ఫీల్ అయ్యేలా చేస్తుంది.
పెద్ద పెద్ద యుద్ధం జరుగుతున్న సీన్లలో ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే, మన చేతిలో కూడా ఒక కత్తి ఉంటే బాగుండు వెళ్ళి నరికేద్దాం అని ఒక ఊపు వస్తుంది చూడు అదే ఈ మ్యూజిక్ చేసే అసలైన మ్యాజిక్.
అలా మనల్ని ఒక రెండు గంటల పాటు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి ఆ కథలో పూర్తిగా మునిగిపోయేలా చేస్తుంది ఈ బ్యాక్‌గ్రౌండ్. మ్యూజిక్ ఇంత పవర్ ఉంది కాబట్టే మన డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ల వెంటపడి మరీ మంచి ట్యూన్స్ చేయించుకుంటారు.
ముగింపు
మొత్తానికి సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఉప్పు లేని పప్పు లాగా ఉంటుంది.
హీరోకి యాక్టింగ్ రాకపోయినా సరైన మ్యూజిక్ ఉంటే, నడుచుకుంటూ వచ్చే సాధారణ సీన్ కూడా థియేటర్ దద్దరిల్లేలా ప్రభావవంతంగా మారుతుంది.
అదే మ్యూజిక్ తేడా కొడితే సీరియస్ ఎమోషన్ కూడా భయంకరమైన కామెడీ లాగా మారి జనాలు నిద్రపోతారు. అందుకే ఈ మ్యూజిక్ సినిమాకి ప్రాణం లాంటిది.