గతంలో సినిమా వస్తుందంటే ఒక పండగ వాతావరణం ఉండేది. పేపర్‌లో ఒక చిన్న పోస్టర్ పడినా, రేడియోలో పాటలు వినిపించినా చాలు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని జనాలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసేవాళ్లు.
సినిమా థియేటర్‌కి వెళ్లేదాకా హీరో లుక్ ఎలా ఉంటుందో, హీరోయిన్ ఎలా ఉంటుందో, విలన్ ఎంట్రీ ఏంటో తెలిసేది కాదు. ఆ క్యూరియాసిటీ, ఆ సస్పెన్స్ సినిమా చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన కిక్ ఇచ్చేవి.
కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. డిజిటల్ యుగంలో ప్రమోషన్స్ అనే పేరుతో మేకర్స్ చేస్తున్న హంగామా చూస్తుంటే, అసలు వీళ్ళు సినిమా తీస్తున్నారా లేక ప్రమోషనల్ వీడియోల ఫ్యాక్టరీ నడుపుతున్నారా? అన్న అనుమానం రాక మానదు.
ఇటీవల ఇండస్ట్రీలో ఒక సీనియర్ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో అన్నట్లు అప్‌డేట్ ఇస్తున్నాం అని చెప్పడానికి ఒక అప్‌డేట్, రేపు ఉదయం 9 గంటలకు ఒక అనౌన్స్‌మెంట్ వస్తుందని చెప్పడానికి ఈరోజు సాయంత్రం ఒక పోస్టర్ ఇదంతా చూస్తుంటే ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి పెరగడం దేవుడెరుగు, విపరీతమైన చిరాకు మాత్రం వస్తోంది.
ఇండస్ట్రీలో ఈ ఓవర్ ప్రమోషన్స్ ట్రెండ్ ఎందుకు మొదలైంది? దీనివల్ల నిజంగా సినిమాకి లాభం జరుగుతోందా లేక జనాల సహనాన్ని పరీక్షిస్తున్నారా? అనే విషయాలను ఈరోజు వివరంగా విశ్లేషించుకుందాం.
అనౌన్స్‌మెంట్ నుంచి ట్రైలర్ దాకా ప్రేక్షకుల మీద మేకర్స్ ఆడుతున్న అప్‌డేట్ల ఆట
ఒక సినిమా మొదలైనప్పటి నుంచి థియేటర్‌లోకి వచ్చేదాకా మేకర్స్ ఫాలో అవుతున్న ప్రమోషనల్ టైమ్‌లైన్ చూస్తుంటే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. ఒక సగటు సినిమాకి ఇప్పుడు ప్లాన్ చేస్తున్న అప్‌డేట్స్ లిస్ట్ ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం:
ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్: ఫలానా హీరో, ఫలానా డైరెక్టర్ కాంబినేషన్ అనగానే ఒక పోస్టర్ వదులుతారు.
ముహూర్తం షాట్: పూజా కార్యక్రమాల కోసం ఒక వీడియో, దానికి ఒక కవరేజ్.
టైటిల్ అనౌన్స్‌మెంట్: సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశామని చెప్పడానికి ముందు ఒక అప్‌డేట్, ఆ తర్వాత టైటిల్ గ్లింప్స్.
ఫస్ట్ లుక్ గోల: హీరో ఫస్ట్ లుక్ ఫలానా తేదీన వస్తుందని ఒక ప్రీ-లుక్ పోస్టర్. చెప్పిన టైంకి ఫస్ట్ లుక్.
గ్లింప్స్ / టీజర్: సినిమా ఫ్లేవర్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక గ్లింప్స్. దీనికి ముందు గ్లింప్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ఒకటి కామన్.
పాటల పరేషాన్: ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ చేసి అన్ని పాటలు ఒకేసారి వదులుతే హ్యాపీగా వినేవాళ్లం. ఇప్పుడు అలా కాదు. సాంగ్ ప్రోమో డేట్ అంటారు. మళ్లీ సాంగ్ ప్రోమో వదులుతారు. ఆ తర్వాత లిరికల్ వీడియో అంటారు. సినిమా రిలీజ్ అయ్యాక వీడియో సాంగ్ అంటారు. సినిమాలో 4 పాటలు ఉంటే, ఈ సైకిల్ 4 సార్లు రిపీట్ అవుతుంది.
ట్రైలర్ పండగ: ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం ఒక వీడియో, ట్రైలర్ కట్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్, రిలీజ్ కి ముందు ‘రిలీజ్ ట్రైలర్’ లేదా ‘యాక్షన్ ట్రైలర్’ అంటూ ఇంకోటి.
ఇది చదువుతుంటేనే మనకు ఆయాసం వస్తోంది కదా. మరి ఇన్ని అప్‌డేట్స్ నెలల తరబడి ఫాలో అవ్వాల్సిన ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? “అయ్యా బాబోయ్, ఇక ఆపండిరా నాయనా, డైరెక్ట్‌గా సినిమానే రిలీజ్ చేయండి అని జనాలు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే స్థాయికి ఈ ట్రెండ్ వెళ్లిపోయింది.
మేకర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు?
ప్రేక్షకులకు ఇంత చిరాకు వస్తుందని తెలిసినా మేకర్స్ ఎందుకు ఈ ట్రెండ్‌ని వదలడం లేదు? దీని వెనుక చాలా పెద్ద బిజినెస్ లాజిక్ దాగి ఉంది.
ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాలంలో జనాల అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఈరోజు చూసిన వార్త రేపటికి మర్చిపోతున్నారు. అందుకే తమ సినిమా గురించి జనాలు మర్చిపోకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్‌డేట్ వదులుతూ, రోజూ ట్విట్టర్లో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండాలనేది నిర్మాతలకు ఉన్న భయం.
అంతేకాకుండా, సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా జరగాలన్నా, ఓటీటీ సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి రైట్స్ కొనాలన్నా సోషల్ మీడియాలో సినిమాకి ఎంత బజ్ ఉందనేదే ఇప్పుడు కొలమానంగా మారిపోయింది.
యూట్యూబ్‌లో ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి, పోస్టర్‌కి ఎన్ని లక్షల లైక్స్ వచ్చాయి అనే లెక్కలు చూసి డిస్ట్రిబ్యూటర్లు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. అందుకే సినిమా షూటింగ్ కంటే కూడా ఈ పీఆర్ ఏజెన్సీలు, ప్రమోషన్ల మీదే నిర్మాతలు కోట్లు ఖర్చు చేస్తున్నారు.
రికార్డుల వేట సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య రచ్చ
ఈ అప్‌డేట్ల గోల ఇక్కడితో ఆగితే బాగుండు.. కానీ దీనివల్ల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు, రచ్చ అంతా ఇంతా కాదు. ఒక హీరో సినిమా గ్లింప్స్ లేదా ఫస్ట్ సింగిల్ ప్రోమో వస్తే చాలు, దానికి 24 గంటల్లో ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయని, అన్ని లక్షల లైక్స్ వచ్చాయని ప్రొడక్షన్ హౌస్ వాళ్లు పెద్ద పెద్ద నెంబర్లతో పోస్టర్లు వేస్తారు.
దాంతో థియేటర్లలో చూడాల్సిన సినిమా కాస్తా యూట్యూబ్ వ్యూస్ లెక్కల్లోకి మారిపోతుంది.
వెంటనే ఇంకో హీరో ఫ్యాన్స్ రంగంలోకి దిగి మా హీరో టీజర్ రికార్డును మీరు దాటలేదు, మీవన్నీ బాట్స్ వ్యూస్.. ఫేక్ వ్యూస్” అంటూ కామెంట్ల సెక్షన్లలో బూతులు తిట్టుకుంటూ కొట్టుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మేకర్స్ వదిలే ప్రతి చిన్న పోస్టర్, ప్రతి చిన్న ప్రోమో ఈ ఫ్యాన్ వార్స్‌కి ఒక పెద్ద ఆయుధంగా మారుతోంది.
సినిమా ఎలా ఉందనే మెయిన్ పాయింట్ పక్కన పెట్టేసి మా హీరో పోస్టర్ ట్విట్టర్ లో ఇన్ని గంటలు ట్రెండ్ అయింది, మీ హీరో లిరికల్ సాంగ్ కి మా అంత లైక్స్ రాలేదు అంటూ ఫ్యాన్స్ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు.
నిజానికి ఈ రికార్డుల పిచ్చిని కూడా ప్రొడక్షన్ కంపెనీలు తమ పైన చెప్పుకున్న బిజినెస్ పబ్లిసిటీ కోసం భలే వాడుకుంటున్నాయి. వ్యూస్ పెంచడానికి ఫ్యాన్స్ రాత్రింబవళ్లు ఫోన్లు పట్టుకుని యూట్యూబ్‌లో లూప్‌లో పెట్టి సాంగ్స్ చూస్తుంటే, నిర్మాతలకు ఫ్రీగా పబ్లిసిటీతో పాటు డిజిటల్ రెవెన్యూ కూడా వస్తోంది.
కానీ మధ్యలో సాదాసీదా ప్రేక్షకుడు మాత్రం కంటెంట్‌ను ప్రశాంతంగా ఆస్వాదించడం మర్చిపోయి, ఈ వ్యూస్, లైక్స్ మాయలో పడి తలపట్టుకుంటున్నాడు.
సోషల్ మీడియా దెబ్బకు హీరో హీరోయిన్ పాపులారిటీ అమాంతం ఎలా మారుతుంది
ఫోన్ స్క్రీన్లలోనే సగం సినిమా థియేటర్లలో కిక్ మిస్ అవుతున్న జనాలు
ఒకప్పుడు సినిమా అంటే అదొక సర్‌ప్రైజ్ ప్యాకేజ్. స్క్రీన్ మీద బొమ్మ పడేదాకా లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు. అందుకే ప్రతి చిన్న సీన్‌కి థియేటర్లలో అరుపులు, కేకలు వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?
సినిమా రిలీజ్ అయ్యేలోపే మేకర్స్ వదిలే గ్లింప్స్, టీజర్లు, రెండు రకాల ట్రైలర్లు అన్నీ కలిపితే దాదాపు 10 నిమిషాల సినిమా ముందే చూసేస్తున్నాం. హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో ట్రైలర్‌లోనే చూపిస్తున్నారు. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్ షాట్స్ అన్నీ టీజర్లలోనే వాడేస్తున్నారు.
దీనివల్ల తీరా రెండు వేలు ఖర్చుపెట్టి, టికెట్ కొని థియేటర్‌కి వెళ్ళాక.. స్క్రీన్ మీద ఆ సీన్ వచ్చినప్పుడు ఓహ్ ఇది నేను ట్రైలర్‌లోనే చూసేశాను కదా అనే ఫీలింగ్ వస్తోంది. ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ పూర్తిగా చచ్చిపోయింది.
అంచనాలే అసలు శత్రువు
ఈ అప్‌డేట్ల పరంపర వల్ల జరిగే అతిపెద్ద నష్టం ఏంటంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వారంకో పోస్టర్ వదులుతూ, నెలకో ప్రోమో వదులుతూ బజ్ క్రియేట్ చేయడం వల్ల జనాలు సినిమా మీద కొండంత అంచనాలు పెట్టుకుంటారు. థియేటర్‌కి వెళ్ళాక ఆ అంచనాల్లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు.
అదే ఎలాంటి అంచనాలు లేకుండా, కేవలం ఒక మంచి ట్రైలర్‌తో వచ్చి సైలెంట్‌గా హిట్టయిన సినిమాలు చాలా ఉన్నాయి. కంటెంట్ మీద నమ్మకం ఉన్న దర్శకుడు ఎప్పుడూ తన సినిమాను అప్‌డేట్లతో నింపేయడు.
కేవలం తన పనితనాన్ని మాత్రమే మాట్లాడుకోనిస్తాడు. కానీ కంటెంట్ వీక్‌గా ఉన్నప్పుడే ఈ ప్రమోషన్ల హడావిడి, అప్‌డేట్ల గోల ఎక్కువగా ఉంటుందని ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఒక అంచనాకు వచ్చేశారు.
సినిమా ఫ్లాప్ వెనుక జనాలు అస్సలు గమనించని నిజాలు
నా అభిప్రాయం
ఒక సామాన్య ప్రేక్షకుడిగా, సినిమాలు విపరీతంగా ఇష్టపడే వ్యక్తిగా నా అభిప్రాయం ఒక్కటే కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఇంటర్నెట్‌లో ఎంత పెద్ద బజ్ క్రియేట్ చేసినా, ఎన్ని పదుల సంఖ్యలో అప్‌డేట్లు వదిలినా అవన్నీ సినిమా రిలీజ్ అయ్యే మొదటి ఆట వరకే పనిచేస్తాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో పడ్డాక సినిమా బాలేదు అని మౌత్ టాక్ వస్తే, అంతకుముందు పెట్టిన వందల కోట్ల ప్రమోషన్లు అన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి.
అప్‌డేట్ ఇస్తామని చెప్పడానికి ఒక అప్‌డేట్ ఇచ్చే ఈ సంస్కృతికి ఇండస్ట్రీ ఎంత త్వరగా ముగింపు పలికితే అంత మంచిది. ప్రేక్షకుడికి కావాల్సింది ట్విట్టర్లో ట్రెండ్ అయ్యే పోస్టర్లు కాదు, థియేటర్‌లో రెండున్నర గంటల పాటు కట్టిపడేసే ఒక మంచి కథ, బలమైన ఎమోషన్.
మేకర్స్ తమ సమయాన్ని, డబ్బును ప్రమోషన్ల మీద కాకుండా కథ, స్క్రీన్‌ప్లే మీద పెడితే, సినిమా ఎలాంటి హడావిడి, అప్‌డేట్స్ లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చినా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.
Leave a Reply