బాహుబలి సినిమాలో దేవుసేన రాజ్యం అయినా, అవెంజర్స్ సినిమాలో మైండ్ బ్లోయింగ్ ఫైట్ సీన్స్ అయినా ఇవన్నీ నిజంగా ఆయా ప్రదేశాలకు వెళ్లి షూట్ చేసినవి కావు. ఇదంతా ఒక చిన్న ఆకుపచ్చని వస్త్రం చేసే మాయ. ఈ మాయ పేరునే మనం గ్రీన్ స్క్రీన్ (Green Screen) అని పిలుస్తాం.
అసలు ఈ గ్రీన్ స్క్రీన్ అంటే ఏమిటి? ఒక చిన్న గదిలో, కేవలం ఒక ఆకుపచ్చని బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగించి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఎలా క్రియేట్ చేస్తారు? ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద సినిమాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ, ఇప్పుడు యూట్యూబ్ (YouTube) వీడియోలు, గేమింగ్ స్ట్రీమింగ్స్, మరియు రోజువారీ న్యూస్ ఛానెల్స్ (News Channels) లో కూడా ఎందుకు అంత సాధారణం అయిపోయింది?
గ్రీన్ స్క్రీన్ వెనుక ఉన్న అసలు టెక్నాలజీ ఏంటి? దాన్ని షూట్ చేయడానికి ఎలాంటి సెటప్ కావాలి? మరియు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ లో ఆ గ్రీన్ కలర్ ని తీసేసి మనకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ని ఎలా పెట్టుకోవాలి? గ్రీన్ స్క్రీన్ ఎలా పనిచేస్తుంది లోపల నిజంగా ఏమి జరుగుతుందో పూర్తి స్టెప్-బై-స్టెప్ గైడ్ ద్వారా వివరంగా తెలుసుకుందాం.
గ్రీన్ స్క్రీన్ మాయ
గ్రీన్ స్క్రీన్ అంటే పెద్ద బ్రహ్మవిద్య ఏమీ కాదు. మన ఇంట్లో కిటికీలకు వేసుకునే ఆకుపచ్చ రంగు పరదా లాంటిదే. కాకపోతే సినిమాల్లో వాడేది కొంచెం ఖరీదైన ముడతలు లేని క్లాత్ అంతే.
వెనకాల గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పెట్టి షూట్ చేసి ఆ తర్వాత ఎడిటింగ్ లో ఆ రంగును మాయం చేస్తారు. అప్పుడు ఆ ఖాళీ ప్లేస్ లో మనం స్విట్జర్లాండ్ లో ఉన్నట్టు గ్రాఫిక్స్ పెట్టుకోవచ్చు. మన సగం మంది యూట్యూబర్లు ఇంట్లో కూర్చొని ఫారిన్ టూర్ల వీడియోలు చేసేది ఈ మాయతోనే.
ఇంతకీ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉండగా ఈ ఆకుపచ్చ రంగునే ఎందుకు పట్టుకున్నారు అనే డౌట్ రావచ్చు. ఇక్కడే అసలైన సైన్స్ ఉంది. మన మనుషుల చర్మం రంగులో ఎక్కడా గ్రీన్ షేడ్ అస్సలు ఉండదు.
మన స్కిన్ టోన్ లో ఎర్ర రంగు లేదా బ్రౌన్ కలర్ మాత్రమే మిక్స్ అయ్యి ఉంటాయి. అందుకే వెనకాల ఆకుపచ్చ రంగు పెడితే కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కి మనిషికి మరియు బ్యాక్ గ్రౌండ్ కి మధ్య తేడా ఈజీగా అర్థం అయిపోయి కటింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది.
ఒకవేళ మీరు స్కిన్ కి మ్యాచ్ అయ్యే ఎర్ర రంగు బట్ట వెనకాల కట్టి షూట్ చేసావనుకో ఎడిటింగ్ లో బ్యాక్ గ్రౌండ్ తో పాటు మొఖం కూడా మాయం అయిపోయి స్క్రీన్ మీద దెయ్యం లాగా కనిపిస్తారు. అందుకే గ్రీన్ కలర్ చాలా సేఫ్.
మరి బ్లూ స్క్రీన్ ఎప్పుడు వాడతారు అంటే ఎప్పుడైనా హీరోలు ఆకుపచ్చని అడవుల్లో చెట్ల మధ్య షూట్ చేయాలి అనుకుంటే అప్పుడు గ్రీన్ స్క్రీన్ పనికిరాదు. ఆ చెట్లు కూడా కట్ అయిపోతాయి కాబట్టి ఆ ఒక్క టైంలో మాత్రం బ్లూ కలర్ వాడుతారు.
క్రోమా కీ ఎలా పనిచేస్తుంది
క్రోమా కీ అంటే ఏదో పెద్ద సైంటిఫిక్ పదం అనుకోకు మన ఊర్లో పండుగకి కోడిని కోసి ఈకలు పీకినట్టు వీడియోలో ఉన్న గ్రీన్ కలర్ ని పీకి పక్కన పడేసే ఒక అద్భుతమైన టెక్నిక్ అంతే.
కంప్యూటర్ లో సాఫ్ట్ వేర్ చేసే మాయాజాలం అంతా ఈ క్రోమా కీ టూల్ చుట్టే తిరుగుతుంది. మీరు ఎడిటింగ్ యాప్ లోకి వెళ్లి క్రోమా కీ ఆన్ చేసి ఆ గ్రీన్ కలర్ మీద ఒక్క క్లిక్ ఇస్తే చాలు.
సాఫ్ట్ వేర్ కి వెంటనే మైండ్ బ్లోయింగ్ అయిపోయి ఆ రంగు స్క్రీన్ మీద ఎక్కడెక్కడ ఉందో మొత్తం ఒక్క సెకన్లో లాగేస్తుంది. మన కంటికి కనబడని ఆకుపచ్చని పిక్సెల్స్ ని కూడా ఈ సాఫ్ట్ వేర్ రాబందు లాగా పసిగట్టేస్తుంది.
వీడియోలో ఉన్న మనిషికి మరియు వెనకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్ కి మధ్య కత్తితో గీత గీసినట్టు సాఫ్ట్ వేర్ ఎలా విడదీస్తుంది అంటే అంతా ఆ రంగుల తేడానే.
సాఫ్ట్ వేర్ కేవలం ఆ గ్రీన్ కలర్ ని మాత్రమే టార్గెట్ చేసి రిమూవ్ చేయగానే వెనకాల ఒక పెద్ద కన్నం పడినట్టు మొత్తం ఖాళీ జాగా వచ్చేస్తుంది.
ఆ ఖాళీ జాగాలో నువ్వు తాజ్ మహల్ పెడతావో లేక చంద్రుడి మీద కూర్చున్నట్టు గ్రాఫిక్స్ పెడతావో అది పూర్తిగా నీ ఇష్టం. కాకపోతే మీరు వేసుకున్న చొక్కా మీద పొరపాటున ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం మీ కడుపులో కూడా కన్నం పడుతుంది.
అప్పుడు నువ్వ వెనకాల పెట్టిన తాజ్ మహల్ నీ కడుపులోంచి జనాలకు స్పష్టంగా కనిపిస్తుంది అందుకే గ్రీన్ స్క్రీన్ ముందు యాక్టింగ్ చేసేటప్పుడు గ్రీన్ బట్టలు అస్సలు వేసుకోకూడదు.
దీన్నే టెక్నికల్ భాషలో కలర్ స్పిల్ (Color Spill) అంటారు. ఉదాహరణకు, మొన్న నేను చూసిన ఒక యూట్యూబ్ వీడియోలో ఒకతను గ్రీన్ స్క్రీన్ సరిగ్గా సెట్ చేయకుండా గ్రీన్ కలర్ ఉన్న క్యాప్ పెట్టుకున్నాడు.
సాఫ్ట్ వేర్ వాడి తలతో సహా బ్యాక్ గ్రౌండ్ ని కట్ చేసేసింది. అందుకే ఏమాత్రం గ్రీన్ షేడ్ ఉన్న వస్తువు వాడినా ఈ క్రోమా కీ టూల్ దాన్ని దారుణంగా లేపేస్తుంది.
గ్రీన్ స్క్రీన్ సెటప్ ఎలా ఉండాలి
గ్రీన్ స్క్రీన్ సెటప్ అనగానే ఏదో రామోజీ ఫిల్మ్ సిటీలో లాగా పెద్ద స్టూడియో కట్టేయాలి అనుకోకు. ఒక పద్ధతి ప్రకారం మన చిన్న గదిలో కూడా అదిరిపోయే హాలీవుడ్ రేంజ్ సెటప్ ఈజీగా రెడీ చేయొచ్చు. దీనికి ముఖ్యంగా కావాల్సింది బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ మరియు కెమెరా ఈ మూడు ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
బ్యాక్ గ్రౌండ్ సెటప్
గ్రీన్ స్క్రీన్ సెటప్ అంటే ఏదో కిరాణా కొట్టు ముందు టెంట్ వేసినట్టు కాకుండా కొంచెం పద్ధతిగా ఉండాలి. వెనకాల వేసే గ్రీన్ క్లాత్ లేదా గోడకు వేసిన పెయింట్ చాలా స్మూత్ గా ఉండాలి.
బట్టల దుకాణంలో వదిలేసిన పాత గుడ్డ ముక్క తెచ్చి పెడితే ఎడిటింగ్ లో చుక్కలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆ క్లాత్ కి అస్సలు ముడతలు ఉండకూడదు. ఇస్త్రీ చేసిన షర్ట్ లాగా టైట్ గా లాగి కట్టాలి.
ముడతలు ఉంటే అక్కడ చీకటి పడి సాఫ్ట్ వేర్ కన్ఫ్యూజ్ అయిపోయి బ్యాక్ గ్రౌండ్ ని సరిగ్గా కట్ చేయదు.
దెయ్యం నీడలు రాకుండా లైటింగ్ సీక్రెట్స్
లైటింగ్ అంటే మన ఇంట్లో ఉండే జీరో వాట్ బల్బులు పెడితే పని అవ్వదు గ్రీన్ స్క్రీన్ మీద నీడలు పడకుండా లైటింగ్ చాలా పర్ఫెక్ట్ గా సమానంగా పడేలా రెండు వైపులా లైట్లు పెట్టాలి.
ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది వెనకాల ఉన్న గ్రీన్ స్క్రీన్ కి కొట్టే లైటింగ్ వేరు నీ మొహం మీద పడే లైటింగ్ వేరు రెండు వేరు వేరుగా చూసుకోవాలి.
మీ వెనకాల ఉన్న నీడ గ్రీన్ స్క్రీన్ మీద పడకుండా మీరు స్క్రీన్ కి కొంచెం దూరంగా నిలబడాలి అప్పుడే వెనకాల దెయ్యం పట్టినట్టు నీడలు రావు.
సినిమా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి త్రీ పాయింట్ లైటింగ్ (Three-point lighting) వాడుతారు. అంటే ఒక మెయిన్ లైట్ (Key Light) మీ మీద, ఇంకొకటి నీడలు పోగొట్టడానికి (Fill Light), మరొకటి గ్రీన్ స్క్రీన్ మీద సమానంగా పడేలా సెట్ చేస్తారు. ఈ బ్యాలెన్స్ కుదిరితేనే అవుట్ పుట్ సరిగ్గా వస్తుంది.
పర్ఫెక్ట్ కటింగ్ కోసం కెమెరా సెట్టింగ్స్
ఇక కెమెరా విషయానికి వస్తే ఏదో పాతకాలం నాటి డబ్బా ఫోన్ తో తీస్తే కుదరదు కనీసం హెచ్ డి రిజల్యూషన్ ఉన్న కెమెరా లేదా మంచి ఫోన్ వాడాలి.
ఫ్రేమ్ రేట్ కూడా సెట్టింగ్స్ లో మార్చుకోవాలి అప్పుడే నువ్వు కదిలినప్పుడు వీడియో బ్లర్ అవ్వకుండా నీట్ గా వస్తుంది.
మీరు తీసే వీడియో క్వాలిటీ ఎంత బాగుంటే ఎడిటింగ్ లో ఆ గ్రీన్ కలర్ ని తీసేయడం అంత ఈజీ అవుతుంది లేకపోతే కటింగ్ లో నీ చెవులు కూడా కట్ అవుతాయి చూసుకో.
హాలీవుడ్ గ్రాఫిక్స్ కోసం స్టెప్ బై స్టెప్ గైడ్
ఇప్పుడు అసలైన సినిమా మొదలు పెడదాం గ్రీన్ స్క్రీన్ ముందు నిలబడి హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తా విను ఈ ప్రాసెస్ తెలిస్తే నువ్వు కూడా ఇంట్లో కూర్చొని విదేశాలు చుట్టేయొచ్చు.
స్టెప్ 1: పక్కా ప్లానింగ్ తో రంగంలోకి
కెమెరా ఆన్ చేయగానే మనం బాహుబలి రేంజ్ కి వెళ్ళిపోలేం కదా ముందుగా మనం ఏ సీన్ తీస్తున్నామో వెనకాల ఏ బ్యాక్ గ్రౌండ్ పెట్టాలో పక్కాగా ముందే డిసైడ్ అవ్వాలి.
లేకపోతే వీడియో తీసాక వెనకాల స్విట్జర్లాండ్ మంచు కొండలు పెట్టి మీరు ఇక్కడ స్వెట్టర్ లేకుండా లుంగీ కట్టుకుని నిలబడితే జనాలు నవ్వి చస్తారు.
అందుకే బ్యాక్ గ్రౌండ్ ఏంటో దానికి తగ్గ బట్టలు ఏంటో ముందే ఒక పేపర్ మీద రాసుకుని ప్లానింగ్ తో రంగంలోకి దిగాలి.
స్టెప్ 2: నీడలు పడకుండా జాగ్రత్తగా షూటింగ్
ఇక్కడ చాలా మంది బ్లాగర్లు చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే గ్రీన్ స్క్రీన్ కి అతుక్కుపోయి ఫెవికాల్ వేసినట్టు నిలబడతారు. అలా చేస్తే నీ నీడ స్క్రీన్ మీద పడిపోయి వీడియోలో దెయ్యం లాగా వస్తుంది.
స్క్రీన్ కి నీకు మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి అప్పుడే ఆకుపచ్చ రంగు నీ మొహం మీద పడకుండా అంటే గ్రీన్ స్పిల్ కొట్టకుండా నీట్ గా వస్తుంది.
లైటింగ్ పర్ఫెక్ట్ గా పెట్టుకుని నీడలు ఎక్కడా రాకుండా జాగ్రత్తగా షూట్ చేస్తే ఎడిటింగ్ లో నీకు సగం పని తగ్గినట్టే.
స్టెప్ 3: ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లో ఆట
షూటింగ్ అయిపోగానే ఆ వీడియోని తీసుకుని మీకు నచ్చిన ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లో వేసేయ్ మొబైల్ లో కైన్ మాస్టర్ అయినా సరే కంప్యూటర్ లో ప్రీమియర్ ప్రో అయినా సరే పని ఒకటే.
అందులో టైమ్ లైన్ మీద ముందుగా మీరు పెట్టుకోవాలి. అనుకున్న వెనక బ్యాక్ గ్రౌండ్ ఫోటో వేసి దాని పైన నీ గ్రీన్ స్క్రీన్ వీడియోని సెట్ చేయాలి. అంతే సగం మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది.
స్టెప్ 4: ఒక్క క్లిక్ తో గ్రీన్ కలర్ మాయం
ఇదే అసలైన క్రేజీ మ్యాజిక్ క్రోమా కీ టూల్ సెలెక్ట్ చేసుకుని ఆ గ్రీన్ కలర్ మీద పికర్ తో ఒక్క టచ్ ఇస్తే చాలు ఆకుపచ్చ రంగు మొత్తం ఎగిరిపోయి మీరు గాలిలో తేలుతున్నట్టు వస్తుంది
కానీ ఎడ్జెస్ దగ్గర అంటే నీ జుట్టు చుట్టూ చెవుల దగ్గర కొంచెం ఆకుపచ్చ రంగు మిగిలిపోయి చెట్టు లాగా కనిపిస్తావు.
దాన్ని స్మూత్ ఎడ్జెస్ ఆప్షన్ తో నీట్ గా ట్రిమ్ చేయాలి అప్పుడే కటింగ్ పర్ఫెక్ట్ గా వచ్చి చూసేవాళ్ళకి డౌట్ రాకుండా ఒరిజినల్ ఫీల్ వస్తుంది.
స్టెప్ 5: మనకు నచ్చిన లోకం వెనకాల సెట్ చేద్దాం
గ్రీన్ కలర్ పోయాక నువ్వు ముందుగానే సెలెక్ట్ చేసుకున్న దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఫోటో వెనకాల సెట్ చేయాలి.
కానీ మీరు బుర్జ్ ఖలీఫా కంటే పెద్దగా కనిపిస్తే ఎవడూ నమ్మడు కదా అందుకే బ్యాక్ గ్రౌండ్ కి తగ్గట్టు నీ సైజుని కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే రియాలిటీ వస్తుంది.
స్టెప్ 6: కలర్ కరెక్షన్ తో రియాలిటీ
మీరు ఇంట్లో ట్యూబ్ లైట్ కింద షూట్ చేసి వెనకాల ఏమో ఎర్రటి ఎండలో ఉన్న ఫోటో పెడితే జనాలు ఈజీగా పసిగట్టేస్తారు.
అందుకే వెనకాల ఉన్న ఫోటో లైటింగ్ కి తగ్గట్టు మీ మొహం మీద ఉన్న బ్రైట్నెస్ మరియు కాంట్రాస్ట్ మార్చాలి అప్పుడే మీరు నిజంగా అక్కడే ఎండలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది.
స్టెప్ 7: హై-క్వాలిటీలో ఫైనల్ ఎక్స్పోర్ట్
ఇదంతా అయ్యాక వీడియోని మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. తక్కువ క్వాలిటీ పెడితే మీరు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయి పిక్సెల్స్ పగిలిపోతాయి.
కనీసం హెచ్ డి లేదా ఫోర్ కే క్వాలిటీలో సేవ్ చేసి యూట్యూబ్ లో పెడితే ఇక మీకు వ్యూస్ వర్షం కురవడం ఖాయం.
ఉపయోగాలు
గ్రీన్ స్క్రీన్ వాడకం ఎక్కడెక్కడ ఉందో చూస్తే నీక ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
సినిమాలు
బాహుబలిలో ఆకాశం నుండి పడే జలపాతాలు నిజంగా ఉన్నాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అదంతా కేవలం స్టూడియోలో కట్టిన ఆకుపచ్చ గుడ్డల మాయాజాలం మాత్రమే అని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
YouTube వీడియోలు
మన ఊర్లో పెంకుటింట్లో కూర్చుని వెనకాల అమెరికా వైట్ హౌస్ పెట్టుకుని బిల్డప్ ఇచ్చే యూట్యూబర్లు అంతా వాడేది ఇదే. ఒక చిన్న గదిలో కూర్చుని గ్రాఫిక్స్ తో ప్రపంచాన్ని చుట్టేసినట్టు మాయ చేస్తారు.
న్యూస్ ఛానల్స్
టీవీలో న్యూస్ చదివే యాంకర్లు వెనకాల పెద్ద మంటలు వరదలు వస్తున్నట్టు చూపిస్తూ వాళ్ళు అక్కడే ఉన్నట్టు ఓవరాక్షన్ చేస్తారు కదా. నిజానికి వాళ్ళు ప్రశాంతంగా ఏసీ రూమ్ లో కూర్చుని గ్రీన్ స్క్రీన్ ముందు పోజులు కొడుతుంటారు.
గేమింగ్ వీడియోలు
గేమ్ ఆడుతూ యూట్యూబ్ లో అరిచే గేమర్లు కూడా ఈ గ్రీన్ స్క్రీన్ బాగా వాడతారు. వాళ్ళ వెనకాల ఉన్న పాత గోడలు బట్టలు స్క్రీన్ కి అడ్డం రాకుండా కేవలం వాళ్ళ మొహం మాత్రమే మూలన కనిపించేలా కట్ చేసి పెడతారు.
లాభాలు
గ్రీన్ స్క్రీన్ వల్ల అతి పెద్ద లాభం ఏంటంటే అసలు మన జేబుకి చిల్లు పడదు.
లక్షలు ఖర్చు పెట్టి విమానాలు ఎక్కి ఫారిన్ వెళ్లాల్సిన పని లేకుండా కేవలం వంద రూపాయల ఆకుపచ్చ గుడ్డతో హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ సృష్టించవచ్చు.
ఇంట్లో అద్దె కట్టడానికి పైసలు లేకపోయినా ప్యారిస్ లో ఈఫిల్ టవర్ కింద నిలబడి కాఫీ తాగుతున్నట్టు జనాలకు కిరాక్ బిల్డప్ ఇవ్వొచ్చు.
మనం అమీర్ పేట ఇరుకు గల్లీలో ఉంటూ ఏకంగా అంగారక గ్రహం మీద నడుస్తున్నట్లు లేదా అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చున్నట్లు సెటప్ చేసుకోవచ్చు.
ఇలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచం మొత్తం చుట్టేయడానికి గ్రీన్ స్క్రీన్ ఒక అద్భుతమైన వరం.
కొంచెం తేడా కొట్టినా పరువు గోవిందా
గ్రీన్ స్క్రీన్ అంటే అంతా పూలపాన్పు అనుకుంటే పప్పులో కాలేసినట్టే దీని వెనుక చాలా పెద్ద తలనొప్పులు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా లైటింగ్ విషయంలో కొంచెం తేడా కొట్టినా సరే ఎడిటింగ్ లో న మొహం మీద ఎలుకలు కొరికినట్లు కన్నాలు పడతాయి
లైటింగ్ పర్ఫెక్ట్ గా లేకపోతే వీడియోలో నువ్వ మనిషిలా కాకుండా దెయ్యం లాగా కనిపిస్తావు జనాలు చూసి భయపడటం ఖాయం.
అలాగే ఇది వాడాలంటే కొంచెమైనా ఎడిటింగ్ బుర్ర ఉండాలి ఏమీ తెలియకుండా గ్రీన్ స్క్రీన్ ముందు నిలబడితే అస్సలు లాభం లేదు.
సాఫ్ట్ వేర్ వాడటం రాకపోతే మీరు వెనకాల పెట్టిన తాజ్ మహల్ నీ తల మీద మొలిచినట్టు పరువు పోయే గ్రాఫిక్స్ వస్తాయి.
అందుకే దీనికి పర్ఫెక్ట్ లైటింగ్ మరియు ఎడిటింగ్ స్కిల్స్ అనేవి రెండు కళ్లు లాంటివి అని గట్టిగా గుర్తుపెట్టుకో.
మనవాళ్లు చేసే పిచ్చి పొరపాట్లు
గ్రీన్ స్క్రీన్ వాడేటప్పుడు మనవాళ్ళు చేసే పిచ్చి పనులు చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు.
లైటింగ్ సరిగ్గా పెట్టకుండా కిరాణా కొట్టులో బల్బు పెట్టినట్టు పెడితే ఎడిటింగ్ లో న మొహం మీద మచ్చలు గ్యారెంటీ.
ఆకుపచ్చ స్క్రీన్ ముందు ఆకుపచ్చ చొక్కా వేసుకుంటే సాఫ్ట్ వేర్ మిమ్మల్ని కూడా మాయం చేసి గాలిలో తలకాయ మాత్రమే తేలుతున్నట్టు బ్రహ్మానందం కామెడీ లాగా చేస్తది.
స్క్రీన్ కి అతుక్కుపోయి నిలబడితే మీ వెనకాల పడే నీడ వల్ల నీకు ఒక దెయ్యం తోడైనట్టు స్క్రీన్ మీద నల్లటి మచ్చలు వస్తాయి.
పాత కాలం నాటి రేషన్ షాప్ ఫోన్ తో లేదా క్వాలిటీ లేని కెమెరాతో తీస్తే గ్రీన్ కట్ అవ్వదు సరికదా నీ మొహం కూడా దారుణంగా బ్లర్ అవుతుంది.
కొత్తగా వాడేవాళ్ళకి నా పక్కా చిట్కాలు
కొత్తగా గ్రీన్ స్క్రీన్ వాడేవాళ్ళు ముందుగా ఇంట్లో ఉన్న బాత్రూమ్ బల్బులు వాడటం మానేయాలి. ట్యూబ్ లైట్ల కింద తీస్తే ఫేస్ మీద ఎలుకలు కన్నాలు పెట్టినట్టు వస్తుంది.
అందుకే మంచి బ్రైట్ గా ఉండే లైటింగ్ వాడుకుంటేనే నీ మొహం గ్రీన్ స్క్రీన్ మీద హీరో లాగా వెలిగిపోతుంది ఎడిటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది.
లక్షలు పెట్టి ఏవేవో పెద్ద స్టూడియో సెటప్ లు కొనాల్సిన అవసరం అస్సలు లేదు.
మన బట్టల కొట్టులో దొరికే సాదాసీదా ఆకుపచ్చ గుడ్డ తెచ్చుకుని ముడతలు లేకుండా టైట్ గా ఇస్త్రీ చేసి గోడకు నాలుగు మేకులు కొట్టినా చాలు మ్యాజిక్ స్టార్ట్ చేయొచ్చు.
గోడ మీద బల్లి లాగా ఆ గ్రీన్ స్క్రీన్ కి అతుక్కుపోయి అస్సలు నిలబడకు దాని వల్ల మీ మీద పడే నీడ వెనకాల పడుతుంది.
ఒక రెండు అడుగులు ముందుకు వచ్చి గ్యాప్ ఇచ్చి నిలబడితే వెనకాల ఆ దెయ్యం లాంటి నీడలు పడకుండా మీ వీడియో చాలా క్లీన్ గా వస్తుంది.
మొదట్లోనే పెద్ద పెద్ద డైరెక్టర్లు వాడే హాలీవుడ్ రేంజ్ సాఫ్ట్ వేర్లు వాడి ఏమీ అర్థం కాక జుట్టు పీక్కోకు.
మన మొబైల్ ఫోన్ లో ఉండే కైన్ మాస్టర్ విఎన్ లాంటి బేసిక్ ఎడిటింగ్ యాప్స్ తో చిన్నగా ప్రాక్టీస్ మొదలు పెట్టు మెల్లగా అసలు మ్యాజిక్ మీకే అర్థం అవుతుంది.
నా చిన్న మాట
గ్రీన్ స్క్రీన్ అంటే కోట్లు ఖర్చు పెట్టే బ్రహ్మ విద్య కాదు ఇంట్లో ఒక చిన్న సెటప్ తో కూడా హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ సృష్టించవచ్చు. స్టార్టింగ్ లో కొంచెం దెయ్యం లాగా వచ్చినా భయపడకు రోజూ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా నీ ఇంట్లోనే బాహుబలి విజువల్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు.
తెర మీద మనం చూసే ఆ విజువల్ వండర్స్ వెనుక ఇంత చిన్న గ్రీన్ స్క్రీన్’ లాజిక్ ఉందా అని నేను ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు షాక్ అయ్యాను. ఆ ఆసక్తి తోనే ఈ టెక్నికల్ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను.
Leave a Reply